Evare Song: పవన్ కల్యాణ్ పాట పాడుతుంటే నేను పర్ఫామ్ చేశాను: అర్జున్ అంబటి, తమన్ రేంజ్‌లో ఎదగాలని కోరుకున్న సింగర్ సాకేత్
Arjun Ambati Speech Evare Song Launch Event: ఎస్ఎస్ వర్ధన్ మ్యూజిక్ అందించిన లేటెస్ట్ సాంగ్ ఆల్బమ్ ఎవరే. క్రేజీ ఎన్ క్యాచీ యూట్యూబ్ ఛానెల్‌లో మే 1న ఎవరో సాంగ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఎవరే సాంగ్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబటి అర్జున్, సింగర్ సాకేత్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Arjun Ambati Comments In Evare Song Launch Event: అనిశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద వెంకట కల్యాణ్ మండవిల్లి సమర్పణలో శిరీష మండవిల్లి నిర్మాణంలో ‘ఎవరే’ ప్రైవేట్ ఆల్బమ్‌ని ఆనంద్ తెరకెక్కించారు. ఈ ఆల్బమ్‌కి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాధ్యతల్ని ఆనంద్ నిర్వర్తించారు.

క్యాచీ యూట్యూబ్ ఛానెల్‌లో
ఎస్ఎస్ వర్దన్ మ్యూజిక్ అందించిన ఈ ఆల్బమ్‌లో వెచలపు కృష్ణ, రిద్ది అనామిక చరణ్ నటించారు. ఎవరే సాంగ్‌ను మే 1న క్రేజీ ఎన్ క్యాచీ యూట్యూబ్ ఛానెల్‌లో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో బుధవారం (ఏప్రిల్ 22) ఎవరే పాటకు సంబంధించిన రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ అర్జున్ అంబటి, సింగర్ సాకేత్, రాంబాబు గోసాల ముఖ్య అతిథిగా విచ్చేశారు.
పవన్ కల్యాణ్ సింగర్‌గా
అర్జున్ అంబటి మాట్లాడుతూ .. "‘ఎవరే’ టీంకు ఆల్ ది బెస్ట్. నిర్మాత బాగుంటేనే మళ్లీ ఇంకో పాటను గానీ, సినిమాను గానీ తీస్తారు. పవన్ కల్యాణ్ పాట పాడుతూ ఉంటే నేను పర్ఫామ్ చేశాను. పవన్ కల్యాణ్ సింగర్‌గా ఇంకా మంచి స్టేజ్‌కి వెళ్లాలని కోరుకుంటున్నాను. వర్దన్ మ్యూజిక్ బాగుంది. కృష్ణ, రిద్ధి జంట బాగుంది. పక్కింటి అబ్బాయిలా కృష్ణ కనిపిస్తున్నారు. ‘ఎవరే’ పాట మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
తమన్ రేంజ్‌లో
సింగర్ సాకేత్ మాట్లాడుతూ .. "‘ఎవరే’ టీంకు ఆల్ ది బెస్ట్. ఎస్ఎస్ వర్దన్ పేరు బాగుంది. తమన్ అన్న రేంజ్‌లో ఎదగాలని కోరుకుంటున్నాను. పవన్ కల్యాణ్, అనన్య చక్కగా పాడారు. పాటలో ఎనర్జీ, మెలోడీ రెండూ చక్కగా కుదిరాయి. కృష్ణ, రిద్ధి అనామిక జంట బాగుంది. ఈ పాట మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని కోరారు.
ఎవరో సాంగ్ పెద్ద హిట్ అవ్వాలని
రాంబాబు గోసాల మాట్లాడుతూ .. "‘ఎవరే’ ప్రోమో చూశాను. నాకు చాలా నచ్చింది. లిరిక్స్ కూడా బాగున్నాయి. హీరో కృష్ణ, రిద్ధి చక్కగా నటించారు. ఎస్ఎస్ వర్దన్ మా ఎస్ఎస్ తమన్ రేంజ్‌కి వెళ్లాలని కోరుకుంటున్నాను. ‘ఎవరే’ సాంగ్ పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తున్నాను" అని అన్నారు.
ఏడాది నుంచి వర్క్ చేస్తున్నాం
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ వర్ధన్ మాట్లాడుతూ .. "‘ఎవరే’ పాట కోసం మేం ఏడాది నుంచి వర్క్ చేస్తున్నాం. నా విజన్‌కి సపోర్ట్ చేసిన ఆనంద్, కృష్ణకి థాంక్స్. ఏడాది పాటుగా మేము శ్రమించి ఈ పాటను తెరకెక్కించాం. పవన్ కళ్యాణ్, అనన్య మా పాటను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లారు" అని చెప్పారు.

కృష్ణ, రిద్ధి చక్కగా నటించారు
"వల్లభ అన్నతో నేను నాలుగేళ్లుగా పని చేస్తున్నాను. ఆయన నాకెంతో సపోర్ట్ చేశారు. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నా టీమ్, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్ తరంగ్‌కి థాంక్స్. కృష్ణ, రిద్ధి చక్కగా నటించారు. ఈ పాట మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది. మే 1న మా పాట రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి" అని సంగీత దర్శకుడు ఎస్ఎస్ వర్ధన్ తెలిపారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


