సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 8 రేటింగ్.. కానీ ఓ ట్విస్ట్

బిగ్‌బాస్ కంటెస్టెంట్ టేస్టీ తేజ నటించిన థ్రిల్లర్ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఐఎండీబీలో 8 రేటింగ్ సాధించిన ఈ సినిమా రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ అయింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ సినిమా ఓటీటీలోకి రావడం విశేషం.

Published on: Jul 11, 2025, 11:05:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ టేస్టీ తేజ నటించిన మూవీ 6 జర్నీ (6 Journey). ఈ సినిమా రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజైంది. అయితే ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి అడుగుపెట్టింది. రిలీజ్ సమయంలో పాజిటివ్ రివ్యూలే వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాని ఈ సినిమాను ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేస్తోంది. ఐఎండీబీలోనూ 8 రేటింగ్ సాధించిన మూవీ ఇది.

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 8 రేటింగ్.. కానీ ఓ ట్విస్ట్
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 8 రేటింగ్.. కానీ ఓ ట్విస్ట్

6 జర్నీ ఓటీటీ స్ట్రీమింగ్

బిగ్బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ టేస్టీ తేజ ప్రధాన పాత్ర పోషించిన ఫారెస్ట్ థ్రిల్లర్ మూవీ 6 జర్నీ. పెద్ద స్టార్లు ఎవరూ లేకపోవడంతో థియేటర్లలో ఈ సినిమాకు రెస్పాన్స్ రాలేదు. మే 9న థియేటర్లలో రిలీజ్ కాగా.. శుక్రవారం (జులై 11) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ అయింది.

చాలా తక్కువ మొత్తానికే ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే ప్రైమ్ వీడియో ఇప్పుడు కూడా సినిమాను ఫ్రీగా స్ట్రీమింగ్ చేయడం లేదు. రూ.149 రెంట్ చెల్లించి సినిమాను చూడాల్సి ఉంటుంది. ఓటీటీలోకి రెండు నెలల తర్వాత వచ్చినా.. ఇప్పటికీ రెంట్ విధానంలో రావడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. అది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన సినిమాను రూ.149 చెల్లించి చూస్తారా అన్నదీ అనుమానమే.

6 జర్నీ మూవీ గురించి..

6 జర్నీ మూవీని బషీర్ ఆలూరి డైరెక్ట్ చేశాడు. ఇందులో టేస్టీ తేజతోపాటు సమీర్ దత్తా, పల్లవి రాథోడ్, రవి ప్రకాశ్ రెడ్డి, రమ్య రెడ్డి, సంజయ్ ఆచార్య, బొర్రా అభిరామ్ లాంటి వాళ్లు నటించారు. ఇదో థ్రిల్లర్ మూవీ. ఇది ఆరుగురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. వాళ్లు ఓ మోసానికి గురైన తర్వాత ఆత్మహత్య చేసుకుందామని ప్లాన్ చేస్తారు.

అయితే ఓ సైకియాట్రిస్ట్ అంతకంటే ముందు చివరిగా గోవా ట్రిప్ వెళ్దామని, తానూ వస్తానని అంటాడు. అయితే ఆ ట్రిప్ వాళ్ల జీవితాలను మార్చేస్తుంది. మధ్యలోనే మొబైల్ రేడియేషనే ఆయుధంగా ఓ మాఫియా వాళ్లను బంధిస్తుంది. ఓ అడవిలో చిక్కుకుపోయిన వాళ్లు తమ ప్రాణాల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే 6 జర్నీ మూవీ స్టోరీ.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More