తల్లయిన బిగ్ బాస్ ఫేమ్.. కూతురికి శిఖా అనే పేరు.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్

బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల తల్లయింది. సోమవారం (డిసెంబర్ 8) తనకు కూతురు పుట్టిందంటూ పేరు కూడా రివీల్ చేసింది. గతేడాది ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న ఆమె.. ఈ ఏడాది మొదట్లో తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది.

Published on: Dec 8, 2025, 22:21:38 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పలు తెలుగు సినిమాలతోపాటు బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ లో కనిపించిన నటి సోనియా ఆకుల. ఆమె తాజాగా ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడిస్తూ పాప పేరును కూడా రివీల్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

తల్లయిన బిగ్ బాస్ ఫేమ్.. కూతురికి శిఖా అనే పేరు.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్
తల్లయిన బిగ్ బాస్ ఫేమ్.. కూతురికి శిఖా అనే పేరు.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్

సోనియా ఆకులకు కూతురు

బిగ్ బాస్ తెలుగు 8లో కంటెస్టెంట్ గా ఉన్న సోనియా ఆకుల సోమవారం (డిసెంబర్ 8) ఓ పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త, వ్యాపారవేత్త అయిన యశ్ వీరగోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

“08-12-2025.. ఆమె వచ్చింది. మా ప్రపంచం పరిపూర్ణమైంది. మా ప్రేమకు పెట్టిన కొత్త పేరే శిఖా వీరగోని” అనే క్యాప్షన్ తో యశ్ పోస్ట్ చేశారు. అందులో షేర్ చేసిన ఫొటోలో పాప చేయితోపాటు ఆమె పేరును కూడా చూడొచ్చు. కింద సోనియా యశ్ అని ఉంది.

సోనియా ఆకుల గురించి..

సోనియా ఆకుల తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన నటి. 2019లో వచ్చిన జార్జి రెడ్డి మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ ఏడాది కిల్లర్ ఆర్టిస్ట్ అనే థ్రిల్లర్ మూవీలో నటించింది. అయితే గతేడాది బిగ్ బాస్ 8లో పాల్గొని నాలుగో వారం ఆమె ఎలిమినేట్ అయింది. హౌస్‌లో చిన్నోడు, పెద్దోడు అంటూ నిఖిల్, పృథ్వీలతో క్లోజ్‌గా ఉంది. సినిమాల్లో నటించినా రాని పేరు బిగ్ బాస్ లో పాల్గొనడం ద్వారా సంపాదించింది. చివరికి వరకూ ఉంటుందని అనుకున్నా.. నాలుగో వారమే ఎలిమినేట్ అయింది.

బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని ఆమె బయటపెట్టింది. బయటకు వచ్చిన తర్వాత గతేడాది నవంబర్ 20న ఫ్లై హై కన్సల్టెంట్స్ సీఈవో అయిన యశ్‌పాల్ వీరగోనితో నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్ 21న పెళ్లి జరగగా.. ఈ ఏడాది మొదట్లో తాను తల్లి కాబోతున్న విషయం వెల్లడించింది. ఇక ఇప్పుడు ఆమెకు ఓ పాప జన్మించింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More