పెద్ద సెలబ్రిటీల కంటే వారే పెద్దగా అనిపించారు.. అందుకే లక్ష విరాళం.. బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ కామెంట్స్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7, 8 ద్వారా మంచి పేరు తెచ్చుకున్న గౌతమ్ కృష్ణ నటించిన రెండో సినిమా సోలో బాయ్. రీసెంట్‌గాఆపరేషన్ సింధూర్‌లో అమరుడైన తెలుగు జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రుల చేతులమీదుగా సోలో బాయ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి గౌతమ్ కృష్ణ రూ. లక్ష విరాళం అందించాడు.

Jun 20, 2025, 11:32:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గౌతమ్ కృష్ణ. బిగ్ బాస్ తెలుగు 7, 8 రెండు సీజన్లలో మంచి గేమ్ ఆడి ఆకట్టుకున్నాడు. అయితే, గౌతమ్ కృష్ణ హీరోగా చేసిన రెండో సినిమా సోలో బాయ్. పసుపులేటి రమ్య, శ్వేత అవస్తి హీరోయిన్స్. నవీన్ కుమార్ దర్శకత్వం వహించారు.

పెద్ద సెలబ్రిటీల కంటే వారే పెద్దగా అనిపించారు.. అందుకే లక్ష విరాళం.. బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ కామెంట్స్
పెద్ద సెలబ్రిటీల కంటే వారే పెద్దగా అనిపించారు.. అందుకే లక్ష విరాళం.. బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ కామెంట్స్

జవాన్ తల్లిదండ్రుల చేతుల మీదుగా

జూన్19న సోలో బాయ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఆపరేషన్ సింధూర్‌లో అమరుడైన తెలుగు జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రుల చేతుల మీదుగా సోలో బాయ్ ట్రైలర్‌ను విడుదల చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో గౌతమ్ కృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. "మా మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ చిత్ర కథ మధ్య తరగతి కుటుంబాలను ఆధారంగా చేసుకుని తీసిన చిత్రం. నా మొదటి సినిమా అంతగా ఆదరణ పొందని సమయంలో బిగ్ బాస్‌కు వెళ్లే ముందు నన్ను నేను అన్వేషించుకున్నాను. అలా బయట చాలా సాధారణంగా అన్ని ఎమోషన్స్ ఉండేలా ఒక చిత్రం చేయాలని అనుకున్నాను. ఆ విధంగా ఈ చిత్రం మొదలైంది" అని అన్నాడు.

ఎన్నో తరాల పాటు

"ఈ కథ విన్న వెంటనే సతీష్ గారు తనకు ఉన్న ప్యాషన్ ‌ సినిమాను ఓకే చేయడం జరిగింది. ఒక చిన్న సినిమాతో పెద్ద హిట్టు కొడితే అది ఎన్నో తరాల పాటు గుర్తుంటుందని మేము నమ్మాము. మా చిత్రానికి పెద్దవారు ఎవరు పని చేయనప్పటికీ చిత్రంలో కంటెంట్ హీరోగా నిలుస్తుంది. ఈ సినిమాలో నేనే కాదు, నా పాత్ర ఎవరు పోషించినా కూడా సినిమా మంచి హిట్ అవుతుంది. ఎందుకంటే కంటెంట్ అలాంటిది" అని గౌతమ్ కృష్ణతెలిపాడు.

"చిత్ర దర్శకుడు నవీన్ గారు సైలెంట్‌గా ఉండే వ్యక్తి అయినప్పటికీ ఎంతో ప్రతిభావంతులు. ఈ ట్రైలర్‌ను దయచేసి మీరంతా ప్రమోట్ చేయండి. కొత్ తవారిని ఎంకరేజ్ చేయండి" అని గౌతమ్ కోరాడు.

కుటుంబీకులే పెద్దగా

"ఈ కార్యక్రమానికి మురళి నాయక్ కుటుంబాన్ని ముఖ్య అతిథులుగా పిలవడానికి కారణమేంటంటే ఈ చిత్రంలో సబ్జెక్ట్ చాలా బలంగా ఉంటుంది. చాలా చిన్న వయసులో మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ లాంటి వ్యక్తి కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకుని తద్వారా వారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని కోరుకున్నాము. మాకు పెద్ద పెద్ద సెలబ్రిటీల కంటే ఈ కుటుంబీకులే పెద్దగా అనిపించారు. అందుకే వారిని ఆహ్వానించాము" అని గౌతమ్ కృష్ణ చెప్పుకొచ్చాడు.

"నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది ప్రేక్షకులు మాత్రమే. కాబట్టి ఇకపై వీరందరి కోసం ఏదో ఒకటి చేయాలని చాలా బలంగా ఒక నిర్ణయం తీసుకున్నాను. సమవర్తి అనే ట్రస్టు ద్వారా నాకు వచ్చే ప్రతి సంపాదనలోనూ సగం ఆ ట్రస్టుకు అందజేయాలని నిర్ణయించుకున్నాను" అని గౌతమ్ పేర్కొన్నాడు.

భవిష్యత్తులో కూడా

"అలాగే బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బులో సగం ఆ ట్రస్టు ద్వారా ముందుగా ఒక లక్ష రూపాయలు మురళి నాయక్ గారి కుటుంబానికి అందజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఈ ట్రస్ట్ ద్వారా వీలైనంత మందికి నేను సహాయం చేయాలనుకుంటున్నాను. ప్రతి నెల నేను ఆ ట్రస్ట్ ద్వారా చేసే సహాయాన్ని నా సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పెడతాను" అంటూ గౌతమ్ కృష్ణ తన స్పీచ్ ముగించాడు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More