బిగ్ బాస్ అప్‌డేట్‌.. హౌస్‌లోకి వెళ్లాల‌నుందా? రియాలిటీ షోలో టాస్క్‌లు ఆడ‌తారా? అయితే ఇలా అప్లై చేయండి.. ఇవే రూల్స్‌!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి టైమ్ ఆసన్నమవుతోంది.  త్వరలోనే ఈ రియాలిటీ షో కొత్త సీజన్ ను స్టార్ మాలో స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఈ సారి సెలబ్రిటీలతో పాటు కామన్ మ్యాన్ కు కూడా ఎంట్రీ కల్పిస్తున్నారు. అందుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Published on: Jul 5, 2025, 19:51:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మరోసారి తెలుగు ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ రెడీ అవుతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి టైమ్ ఆసన్నమవుతోంది. ఈ సీజన్ ను స్టార్ట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ 9 త్వరలోనే వస్తుందంటూ పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సారి బిగ్ బాస్ సీజన్ లోకి కామన్ వ్యక్తులకు కూడా ఎంట్రీ ఉందని పదే పదే స్పష్టం చేస్తున్నారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (x/JioHotstar Telugu)
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (x/JioHotstar Telugu)

ఎలా అప్లై చేయాలంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. మరోసారి కింగ్ నాగార్జున ఈ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ఈ నేపథ్యంలో జియోహాట్స్టార్ఎక్స్ లో వరుసగా పోస్టులు పెట్టింది. ‘‘ఇంకా వెయిటింగ్ ఎందుకు? వీడియో రికార్డు చేయండి. ఇప్పుడే అప్లై చేయండి. త్వరలోనే స్టార్ మాలో బిగ్ బాస్ సీజన్ 9 రాబోతుంది’’ అని పోస్టు చేసింది.

ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి

బిగ్ బాస్ సీజన్ 9లోకి ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న సాధారణ ప్రజలు ఎలా అప్లై చేసుకోవాలో జియోహాట్‌స్టార్‌ పోస్టు చేసింది. ఈ స్టెప్స్ ఫాలో కావాలి అని పేర్కొంది.

  • ముందుగా bb9.jiostar.com వెబ్ సైట్ ను విజిట్ చేయాలి.
  • మీ పేరును ఎంటర్ చేయాలి.
  • మీ ఫోన్ నంబర్ ను ఎంటర్ చేయాలి.
  • సెండ్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీ మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి.
  • ఒకవేళ ఓటీపీ రానట్లయితే మీ ఫోన్ లో డీఎన్డీ (డు నాట్ డిస్టర్బ్) యాక్టివ్ గా ఉండొచ్చు.
  • అలా అయితే మీ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ కస్టమర్ కేర్ కు కాల్ చేసి డీఎన్డీని డీయాక్టివేట్ చేయమని చెప్పాలి.
  • డీఎన్డీ డీయాక్టివేట్ చేసుకున్న తర్వాత మళ్లీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి, వచ్చిన ఓటీపీ నమోదు చేయాలి.
  • ఆ తర్వాత ఈ మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత వీడియో అప్ లోడ్ చేయాలి. (బిగ్ బాస్ లో ఎందుకు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో అనే విషయంపై 3 నిమిషాలు మించకుండా, 50 ఎంబీ సైజ్ దాటకుండా ఉండే వీడియోను అప్ లోడ్ చేయాలి)
  • టర్మ్స్ అండ్ కండీషన్స్, ప్రైవసీ పాలసీ, కుకీ పాలసీని చదవాలి.
  • మీకు ఓకే అయితే అగ్రీ చేస్తున్నట్లు టిక్ చేయాలి.
  • ఆ తర్వాత యాక్సెప్ట్ డీఎన్సీ కన్సెంట్ ను క్లిక్ చేయాలి.
  • ఒకవేళ మీ ఫోన్ వెరిఫికేషన్ సక్సెస్ ఫుల్ అయ్యి, వీడియో సబ్ మిట్ చేయలేకపోతే.. మళ్లీ తర్వాత ఒకసారి వెబ్ సైట్ ను విజిట్ చేయాలి.
  • మళ్లీ ఫామ్ నింపి, వీడియో పంపించాలి.
  • ఒక్కసారి సబ్ మిట్ బటన్ క్లిక్ చేస్తే ఫైనల్ ఎంట్రీ నమోదు అయినట్లే. ఒక్కసారి సబ్ మిట్ చేశాక.. మళ్లీ మరో ఎంట్రీ చేయడానికి వీల్లేదు.
  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More