బిగ్ బాస్ బ్యూటి శుభశ్రీ రాయగురు నిశ్చితార్థ వేడుక.. నటుడు సాయి కుమార్ రెస్పాన్స్ ఇదే!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్ శుభశ్రీ రాయగురు త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. ప్రముఖ నిర్మాత అజయ్ మైసూర్‌తో శుభశ్రీ రాయగురు నిశ్చితార్థం చేసుకుంది. జూన్ 6న శుభశ్రీ రాయగురు-అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నటుడు సాయి కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Jun 7, 2025, 06:25:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ తెలుగు టీవీ షో ద్వారా క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో శుభశ్రీ రాయగురు ఒకరు. మోడల్, నటి, లాయర్ అయిన శుభశ్రీ రాయగురు బిగ్ బాస్తెలుగు సీజన్ 7 ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు సంపాదించుకుంది. పలు సినిమాల్లో నటిగా కూడా అలరించింది. కొంతకాలం లాయర్‌గా ప్రాక్టీస్ చేసిన ఈ బ్యూటి సినిమాలపై ఇంట్రెస్ట్‌తో హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది.

బిగ్ బాస్ బ్యూటి శుభశ్రీ రాయగురు నిశ్చితార్థ వేడుక.. నటుడు సాయి కుమార్ రెస్పాన్స్ ఇదే!
బిగ్ బాస్ బ్యూటి శుభశ్రీ రాయగురు నిశ్చితార్థ వేడుక.. నటుడు సాయి కుమార్ రెస్పాన్స్ ఇదే!

త్వరలో శుభశ్రీ పెళ్లి

అయితే, త్వరలో శుభశ్రీ రాయగురు పెళ్లి పీటలు ఎక్కనుంది. ప్రముఖ నిర్మాత అజయ్ మైసూర్‌తో శుభశ్రీ రాయగురు నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు సాయికుమార్, యువ హీరో, బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్, బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు పాల్గొని ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మెజెస్టీ ఇన్ లవ్ సాంగ్ లాంఛ్

ఎంగేజ్‌మెంట్, మెహందీ, సంగీత్, రిసెప్షన్ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ నిశ్చితార్థ వేడుకలో అజయ్ మైసూర్, శుభ శ్రీ రాయగురు కలిసి చేసిన 'మెజెస్టీ ఇన్ లవ్' అనే కవర్ సాంగ్‌ను లాంఛ్ చేశారు. నటుడు సాయి కుమార్ వాయిస్‌తో ఈ పాట ప్రారంభం కావడం ఆకర్షణగా నిలిచింది.

ఆస్ట్రేలియాలో వివాహం

మెజెస్టీ ఇన్ లవ్ సాంగ్‌ను సిద్ధార్థ్ వాట్కిన్స్ స్వరపర్చి సింగర్ సాహితీ చాగంటితో కలిసి పాడారు. ఈ పాట రూపకల్పన సమయంలోనే శుభశ్రీ, అజయ్ మనసులు కలిసి ప్రేమించుకున్నారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని నిశ్చయించుకున్నారు. జూలైలో అజయ్ మైసూర్, శుభశ్రీ వివాహం ఆస్ట్రేలియాలో జరగనుంది.

మంచి మిత్రులు

శుభశ్రీ రాయగురు ఎంగేజ్‌మెంట్‌పై నటుడు సాయి కుమార్ మాట్లాడారు. "అజయ్ మైసూర్ నాకు మంచి మిత్రులు. మా ఇంటికి వచ్చి వారి ఎంగేజ్‌మెంట్ కోసం ఆహ్వానించారు. ఈ జంట చిరకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా" అని సాయి కుమార్ శుభాకాంక్షలు అందజేశారు.

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సందడి

శుభశ్రీ-అజయ్ నిశ్చితార్థ వేడుకలో హీరో సోహైల్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఫ్రెండ్స్, ఇతర సెలబ్రిటీలు సందడి చేశారు. మెజెస్టీ ఇన్ లవ్ సాంగ్‌కు పనిచేసిన టీమ్ కూడా ఈ వేడుకల్లో పాల్గొని పాట పాడి వీక్షకులను అలరించారు.

అజయ్ మైసూర్ సినిమాలు

ఇదిలా ఉంటే, అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, 10th క్లాస్ డైరీస్ వంటి చిత్రాలతో పాటు పలు షార్ట్ ఫిలింస్, 50కి పైగా మ్యూజిక్ అల్బమ్స్‌లో అజయ్ మైసూర్ నటించారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More