బిగ్ బాస్ నుంచి ఇద్దరు సీరియల్ నటులు ఎలిమినేట్- నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా రెమ్యూనరేషన్ ఇదే- ఇద్దరికీ 5 లక్షల తేడా!
బిగ్ బాస్ 9 తెలుగు నుంచి పదో వారం ఇద్దరు సీరియల్ నటులు నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా ఎలిమినేట్ అయ్యారు. అక్టోబర్ 12న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చిన వీరిద్దరు ఒకేవారం డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా ఎలిమినేట్ అయ్యారు. మరి వీరి రెమ్యూనరేషన్, ఎవరికి ఎంత ఎక్కువ అనే విషయాలు తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 9 రణరంగం అన్నట్లుగానే సాగుతుంది. కంటెస్టెంట్ల ఆట తీరు ఎలా ఉన్న సీజన్‌లో మాత్రం ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అలా వరుసగా రెండు వారాలు బిగ్ బాస్ తెలుగు 9లో డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది.

డబుల్ ఎలిమినేషన్
బిగ్ బాస్ 9 తెలుగు పదో వారం కూడా డబుల్ ఎలిమినేషన్ జరిగిన విషయం తెలిసిందే. నాగార్జున వేసిన బిగ్ బాస్ బాంబ్ కారణంగా ఈ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నిఖిల్ నాయర్ ఎలిమినేట్ అయ్యాడు. బుల్లితెర సీరియల్ గృహలక్ష్మీతో పాపులర్ అయ్యాడు నిఖిల్ నాయర్.
గృహలక్ష్మీ సీరియల్‌లో
గృహలక్ష్మీ సీరియల్‌లో ప్రేమ్ పాత్రలో నిఖిల్ నాయర్ ఆకట్టుకున్నాడు. దాంతో నిఖిల్‌కు మంచి రెమ్యూనరేషన్ అందినట్లు సమాచారం. నిఖిల్ నాయర్ బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు వారానికి రూ. 2.5 లక్షల పారితోషికం ఇచ్చినట్లు టాక్. అక్టోబర్ 12న లాంచ్ అయిన బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ 2.Oతో వైల్డ్ కార్డ్‌గా నిఖిల్ హౌజ్‌లోకి అడుగుపెట్టాడు.
5 వారాల రెమ్యూనరేషన్
ఈ లెక్కన ఐదు వారాల పాటు బిగ్ బాస్ తెలుగు 9లో నిఖిల్ ఉన్నాడు. అంటే, 5 వారాలకు గాను నిఖిల్ నాయర్ రూ. 12.5 లక్షలు బిగ్ బాస్ ద్వారా సంపాదించినట్లు తెలుస్తోంది. నిఖిల్ లాగే అక్టోబర్ 12న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన మరో సీరియల్ నటుడు గౌరవ్ గుప్తా.
గీత ఎల్ఎల్‌బీ సీరియల్‌తో
గీత ఎల్ఎల్‌బీ సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకున్న గౌరవ్ గుప్తాకు వారానికి రూ. 1.5 లక్ష పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. అంటే, వారం రెమ్యూనరేషన్‌ను బట్టి చూస్తే గౌరవ్‌కు నిఖిల్ కంటే లక్ష రూపాయలు తక్కువ అని తెలుస్తోంది.
నిఖిల్ నాయర్ కంటే
నిఖిల్ లాగే బిగ్ బాస్ 9 తెలుగు హౌజ్‌లో ఐదు వారాలు ఉన్న గౌరవ్ గుప్తా మొత్తంగా ఏడున్నర లక్షల రూపాయలు సంపాదించినట్లు తెలుస్తోంది. అయితే, ఇలా మొత్తం సంపాదనను బట్టి చూస్తే నిఖిల్ నాయర్ కంటే గౌరవ్ గుప్తా రూ. 5 లక్షలు తక్కువ రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.
నాగార్జున ప్రశంసలు
కాకపోతే, నిఖిల్ నాయర్‌కు స్టేజీ మీదకు రాగానే ప్రశంసలు కురిశాయి. బాగా ఆడావంటూ హోస్ట్ నాగార్జున మెచ్చుకున్నారు. బీబీ రాజ్యంలో కెప్టెన్సీ టాస్క్‌లో నిఖిల్ నాయర్ క్లోజ్ ఫ్రెండ్ సంజన సపోర్ట్ చేసుంటే అతను ఎలిమినేట్ అయ్యేవాడు కాదు. నిఖిల్‌ను కాకుండా తనూజకు సపోర్ట్ చేసింది సంజన. దాంతో తనూజ కెప్టెన్సీ అయిన విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


