బిగ్ బాస్ తెలుగు 9 విజేతగా కల్యాణ్ పడాల- రన్నరప్‌గా తనూజ గౌడ- మళ్లీ మిస్ అయిన లేడి విన్నర్!
Bigg Boss Telugu 9 Winner And Runner Up Today Grand Finale Highlights: బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్ ఎవరో ఇవాళ (డిసెంబర్ 21) జరిగే గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో తేలిపోనుంది. బిగ్ బాస్ 9 తెలుగు విన్నర్, ప్రైజ్ మనీ, రెమ్యూనరేషన్, గ్రాండ్ ఫినాలే గెస్ట్, వచ్చే స్టార్ సెలబ్రిటీలు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.
రాత్రి 7 గంటలకు ప్రారంభం అయిన బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో విజేత ఎవరో ప్రకటించనున్నారు.

సెప్టెంబర్ 7న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ఇవాళ అంటే డిసెంబర్ 21న ముగియనుంది.
...Read Moreమిస్ అయిన లేడి విన్నర్
కల్యాణ్ పడాల బిగ్ బాస్ తెలుగు 9 విజేతగా నిలిచాడు. రన్నరప్‌గా తనూజ గౌడ సరిపెట్టుకుంది. ఎంతోమంది తనూజ టైటిల్ కొడుతుందని టీవీ సీజన్‌కు మొదటి లేడి విన్నర్ అవుతుందని ఆశించారు. కానీ, మళ్లీ లేడి విన్నర్ మిస్ అయి సామాన్యుడికి ట్రోఫీ చేరింది.
బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్ కల్యాణ్ పడాల
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ విజేతగా కల్యాణ్ పడాల నిలిచాడు. తనూజ పుట్టస్వామి రన్నరప్‌గా నిలిచింది. కల్యాణ్‌కు హోస్ట్ నాగార్జున ట్రోఫీ అందించారు. తనకు ధైర్యం ఇచ్చింది తనూజ అని ఈ సందర్భంగా కల్యాణ్ తెలిపాడు.
ప్రైజ్ మనీ 35 లక్షలే
డీమాన్ పవన్ రూ. 15 లక్షల సూట్‌కేస్ తీసుకోవడం బిగ్ బాస్ ప్రైజ్ మనీ తగ్గిపోయిందని హోస్ట్ నాగార్జున తెలిపారు. ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ విన్నర్‌కు వచ్చేది కేవలం రూ. 35 లక్షలు మాత్రమే అని చెప్పారు.
నాగార్జున ప్రశంసలు
స్టైజీపైన పవన్‌ను తెగ పొగిడారు హోస్ట్ నాగార్జున. తండ్రికి అనారోగ్యం ఉందని తెలిసిన రోజు బాధగా ఉన్న టాస్క్‌లు మాత్రం అదరగొట్టేవాడని, టాస్కుల్లో పవన్‌ను చూసి భయపడేవారని నాగార్జున ప్రశంసించారు.
పవన్‍కు 15 లక్షలు
హౌజ్‌లోకి రవితేజ సిల్వర్ సూట్‌కేస్‌తో ఎంట్రీ ఇచ్చాడు. 15 లక్షలు డీమాన్ పవన్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే, డబ్బు తీసుకోకుంటే టాప్ 3గా పవన్ ఉత్త చేతులతో ఎలిమినేట్ అయ్యేవాడు. రవితేజ రూపంలో పవన్‌కు అదృష్టం వరించిందని నాగార్జున అన్నాడు.
ఇమ్మాన్యూయెల్ ఎలిమినేట్
హౌజ్‌లోకి వెళ్లిన నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి ఇద్దరు జబర్దస్త్ ఇమ్మాన్యూయెల్‌ను ఎలిమినేట్ చేసి తీసుకొచ్చారు. టాప్ 4 కంటెస్టెంట్‌గా నిలిచిన ఇమ్మాన్యూయెల్ ఎమోషనల్ అయ్యాడు. అతన్ని నాగార్జున ప్రశంసించారు.
రోబో డాగ్‌తో నవీన్ పోలిశెట్టి
బిగ్ బాస్ స్టేజీ మీదకు నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి ఎంట్రీ ఇచ్చారు. వారి దగ్గరికి రోబో డాగ్ రోగ్‌ను తీసుకొచ్చారు నాగార్జున. టాప్ 4లో ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు నవీన్ పోలిశెట్టికి సహాయంగా హౌజ్‌లోకి రోబో డాగ్‌ను పంపించారు.
సంజన ఎలిమినేట్
టాప్ 5 ఫైనలిస్ట్‌గా సంజన గల్రానీ ఎలిమినేట్ అయింది. హీరో శ్రీకాంత్ ద్వారా సంజనను ఎలిమినేట్ చేయించారు.
కల్యాణ్ ఎమోషనల్
టాప్ 5 నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసి తీసుకురావాలని హీరో శ్రీకాంత్‌కు నాగార్జున చెప్పాడు. ఒక్కొక్కరి పేరు చెబుతూ అందరూ సేఫ్ అన్నాడు శ్రీకాంత్. ఈ క్రమంలో కల్యాణ్ పడాల ఎమోషనల్ అయ్యాడు.
డీమాన్‌ను పొగిడిన శ్రీకాంత్

బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లిన హీరో శ్రీకాంత్ కామన్ మ్యాన్‌గా వచ్చిన డిమాన్ పవన్ ఆటను తెగ పొగిడాడు. తను చేసిన ప్రతి పని గురించి గొప్పగా చెప్పాడు.
డీమాన్‌ను పొగిడిన శ్రీకాంత్

బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లిన హీరో శ్రీకాంత్ కామన్ మ్యాన్‌గా వచ్చిన డిమాన్ పవన్ ఆటను తెగ పొగిడాడు. తను చేసిన ప్రతి పని గురించి గొప్పగా చెప్పాడు.
సంజనా గల్రానీ గురించి
సినిమా రంగం నుంచి వచ్చిన సంజన, హౌస్‌లో ఎదురైన ఎన్నో విమర్శలను తట్టుకుని, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఫినాలే రేసులో నిలిచారు.
చాంపియన్ ట్రైలర్ ప్లే
బిగ్ బాస్ స్టేజీ మీదకు శ్రీకాంత్ కొడుకు హీరో రోషన్, మలయాళ బ్యూటీ అనస్వర రాజనే ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరు నటించిన చాంపియన్ సినిమా ట్రైలర్‌ను ప్లే చేశారు.
సింగర్ మంగ్లీ డ్యాన్స్
స్టేజీ మీదకు సింగర్ మంగ్లీ ఎంట్రీ ఇచ్చింది. లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్ బాయిలోన బల్లి పలికే పాటపై డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో సింగర్ మంగ్లీ ఆకట్టుకుంది.
టైటిల్ ట్రోఫీ
బిగ్ బాస్ తెలుగు 9 ట్రోఫీని అందరికి నాగార్జున చూపించారు. ఆ తర్వాత ఎక్స్ కంటెస్టెంట్స్‌తో ఎవరు విన్ అవుతారో గెస్ చేయమని నాగార్జున అడిగారు. ఒక్కొక్కరు ఒకరి పేరు చెప్పారు.
నాగార్జున ఎంట్రీ
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే ప్రారంభమైపోయింది. స్టేజీ మీదకు నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. టాప్ 5 ఫైనలిస్టుల తల్లిదండ్రులతో నాగ్ మాట్లాడారు. ఒక్కొక్కరి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఇమ్మాన్యుయేల్ గురించి
‘జబర్దస్త్’ కమెడియన్‌గా అందరినీ నవ్వించే ఇమ్మాన్యుయేల్.. హౌస్‌లో తనదైన చతురతతో, వినోదాన్ని పంచుతూ టాప్ 5లో చోటు సంపాదించుకున్నారు.
తనూజ పుట్టస్వామి గురించి
బుల్లితెర ప్రేక్షకులకు ‘ముద్ద మందారం’ పార్వతిగా సుపరిచితురాలైన తనూజ, తన సహజమైన ఆటతో ఫైనలిస్టుగా నిలిచారు. ఈసారి లేడీ విన్నర్ అయ్యే అవకాశం ఆమెకు మెండుగా ఉంది.
కల్యాణ్ పడాల గురించి
ఆర్మీ సోల్జర్‌గా, సామాన్యుల కోటాలో అడుగుపెట్టిన కల్యాణ్.. తన నిజాయితీతో కోట్లాది మంది మనసు గెలుచుకున్నారు. ప్రస్తుతం విన్నర్ రేసులో ఆయన ముందు వరుసలో ఉన్నారు.
105 రోజుల ప్రయాణం
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఉత్కంఠభరితమైన ముగింపుకు చేరుకుంది. 105 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత కల్యాణ్ పడాల, పవన్, సంజనా గల్రానీ, తనూజ పుట్టస్వామి, మరియు ఇమ్మాన్యుయేల్ ఫైనలిస్టులుగా నిలిచారు.
తుది అంకానికి బిగ్ బాస్ తెలుగు 9 సీజన్
తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ సీజన్ 9 ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. దాదాపు 15 వారాల పాటు సాగిన ఈ రసవత్తర పోరులో ఎంతో మంది కంటెస్టెంట్లు వచ్చి వెళ్లగా.. చివరికి ఐదుగురు మాత్రమే విజేత రేసులో నిలిచారు. కింగ్ నాగార్జున తనదైన శైలిలో నడిపించిన ఈ సీజన్, ఈసారి ఎన్నడూ లేనంత ఎమోషనల్ అప్‌స్ అండ్ డౌన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది.

E-Paper






