రొమాంటిక్ వైబ్‌తో బిగ్ బాస్ రన్నరప్ గౌతమ్ కృష్ణ రెండో మూవీ.. సోలో బాయ్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ఇదే!

బిగ్ బాస్ తెలుగు షోలతో పాపులర్ అయిన గౌతమ్ కృష్ణ తన రెండో సినిమాతో అలరించేందుకు రెడీగా ఉన్నాడు. గౌతమ్ కృష్ణ హీరోగా చేసిన లేటెస్ట్ లవ్ రొమాంటిక్ సినిమా సోలో బాయ్. నవీన్ కుమార్ దర్శకత్వం వహించిన సోలో బాయ్ రిలీజ్ డేట్‌ను తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే..

Jun 9, 2025, 06:35:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ కృష్ణ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు నవీన్ కుమార్ దర్శకత్వం వహించారు. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ సోలో బాయ్ చిత్రాన్ని నిర్మించారు.

రొమాంటిక్ వైబ్‌తో బిగ్ బాస్ రన్నరప్ గౌతమ్ కృష్ణ రెండో మూవీ.. సోలో బాయ్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ఇదే!
రొమాంటిక్ వైబ్‌తో బిగ్ బాస్ రన్నరప్ గౌతమ్ కృష్ణ రెండో మూవీ.. సోలో బాయ్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ఇదే!

రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్

సోలో బాయ్ సినిమాతో గౌతమ్ కృష్ణకు జోడీగా శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా మెరవనున్నారు. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌ మూవీ సోలో బాయ్‌లో పోసాని కృష్ణ మురళి, అనిత చౌదరి, అరుణ్ కుమార్, ఆర్కే మామ, షఫీ, డాక్టర్ భద్రం వంటి ప్రముఖ నటీనటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

రమ్య పసుపులేటితో గౌతమ్

ఇప్పటికే విడుదలైన ‘సోలో బాయ్’ ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్ సినీ లవర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. తాజాగా రిలీజైన పోస్టర్‌లో గౌతమ్.. రమ్య పసుపులేటితో కలిసి కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. ఈ పోస్టర్ యూత్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది.

యూత్‌ఫుల్ కథతో

మూవీ మేకర్స్ సోలో బాయ్ సినిమాను జూలై 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. యూత్‌ఫుల్ కథతో, రొమాంటిక్ వైబ్‌తో, ఎంటర్‌టైన్‌మెంట్ డోస్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఫుల్ ఎంగేజ్ చేయనుందని మేకర్స్ ఆశిస్తున్నారు.

బుల్లితెర ప్రేక్షకులకు

గతంలో 'ఆకాశ వీధుల్లో' చిత్రంతో ఆకట్టుకున్న గౌతమ్ మరోసారి హీరోగా ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయిన గౌతమ్ కృష్ణ ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోనూ మెరిసాడు.

ఫైనల్ వరకు వెళ్లి

బిగ్ బాస్ 8 తెలుగులో తన స్ట్రాటజీస్‌తో, గేమ్‌తో అట్రాక్ట్ చేసిన గౌతమ్ కృష్ణ ఫైనల్ వరకు వెళ్లి రన్నరప్‌గా నిలిచాడు. కానీ, చాలా మంది తెలుగు రాష్ట్రాల ప్రజల అభిమానాన్ని పొందాడు గౌతమ్ కృష్ణ. ఇక ఇదిలా ఉంటే, సోలో బాయ్ టెక్నికల్ విషయానికొస్తే.. సినిమాటోగ్రఫీని త్రిలోక్ సిద్ధు వహించగా.. సంగీతం జుడా సంధ్య అందించారు.

లేడి మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం

అంటే సోలో బాయ్ సినిమాకు లేడి మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించారు. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా ఎస్‌కే నయీమ్ కొరియోగ్రాఫర్‌గా ఆట సందీప్ చేశారు. శ్యామ్ కాసర్ల, పూర్ణా చారి, చైతన్య ప్రసాద్, కళ్యాణ్ చక్రవర్తి పాటలు రచించారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More