ఫరా ఖాన్ నా షుగర్ మమ్మీ.. షారుఖ్, సల్మాన్ నా గాడ్‌ఫాదర్స్: అసలు విషయం చెప్పిన బోల్డ్ బ్యూటీ రాఖీ సావంత్
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాఖీ సావంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో ఫరా ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ గురించి మాట్లాడింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాఖీ సావంత్ ప్రస్తుతం తన కొత్త పాట 'జరూరత్' ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల హిందీ రష్‌కు ఇచ్చిన ఓ పాడ్‌కాస్ట్‌లో రాఖీ తనను తాను ఇండస్ట్రీ కూతురిగా అభివర్ణించుకున్నారు. ఫరా ఖాన్‌తో తనకున్న బంధం గురించి ఆమె మనసు విప్పి మాట్లాడారు. ఆ ఫిల్మ్‌మేకర్‌ను తన 'షుగర్ మమ్మీ' అని, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లను తన 'గాడ్‌ఫాదర్స్' అని ఆమె పిలిచారు.

షుగర్ మమ్మీ
ఫరాతో తనకున్న బంధం గురించి అడిగినప్పుడు రాఖీ ఇలా అన్నారు. "ఫరా ఖాన్ నా షుగర్ మమ్మీ, గాడ్‌మదర్. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ నా గాడ్‌ఫాదర్స్. నాకు ఎవరూ లేరు, నేను అనాథను (మై లావారిస్ హున్). ఫరా మేడమ్ నాకు దీపావళికి టీవీ, వాషింగ్ మెషీన్, పాత్రలు, ప్రెజర్ కుక్కర్‌తో సహా ఎన్నో బహుమతులు ఇచ్చారు. మేరేకో మేరా ఘర్ బన్‌వాకే దే రహీ హై (ఆమె నా ఇల్లు కట్టించి ఇస్తున్నారు)" అని రాఖీ తెలిపారు.
పేదల దేవుడు
"మూడున్నర సంవత్సరాల తర్వాత నేను ఇంటికి వచ్చినప్పుడు, నా ఇల్లు మొత్తం చెత్తకుప్పలా మారింది. నివసించడానికి కూడా వీల్లేకుండా పోయింది. వర్షాలకు పూర్తిగా నాశనమైంది. అందుకే ఫరా మేడమ్ కొత్త ఫ్లోరింగ్ వేయించి, ఇల్లు మొత్తం తిరిగి కట్టించి ఇస్తున్నారు. అది ఆమె దయ (మెహర్బానీ హై ఉన్కీ)" అని రాఖీ సావంత్ పేర్కొన్నారు.
సల్మాన్‌ను "గరీబో కా మసిహా (పేదల దేవుడు)" అని పిలుస్తూ రాఖీ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. తనకు ఉద్యోగం లేనప్పుడు బిగ్ బాస్‌లో పని ఇప్పించారని, డబ్బు లేనప్పుడు తన తల్లి క్యాన్సర్ చికిత్సకు అండగా నిలిచారని, తన కోసం కోట్లు ఖర్చు చేశారని ఆమె పంచుకున్నారు.
కుకింగ్ వ్లాగ్
రాఖీ ఇటీవల తన కుకింగ్ వ్లాగ్ కోసం ముంబైలోని ఫరా ఖాన్ ఇంటికి వెళ్లారు. ఆ వ్లాగ్ సమయంలో ఫరా ఏడు బెడ్‌రూమ్‌ల అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారని, దానికి ప్రైవేట్ లిఫ్ట్, ప్రైవేట్ పూల్ కూడా ఉన్నాయని తెలిసి రాఖీ ఆశ్చర్యపోయారు. ఫరా కంటే తనకే ఖరీదైన ఇల్లు ఉందని రాఖీ సరదాగా అన్నారు. ఫరా ఇంటి విలువ కేవలం రూ.15 కోట్లు అయితే, దుబాయ్‌లోని తన ఇంటి విలువ రూ.50 కోట్లు అని చెప్పారు.
దానికి ఫరా బదులిస్తూ తన ఇంటి విలువ అంతకంటే చాలా ఎక్కువ అని, తన బిల్డింగ్‌లోని వాచ్‌మ్యాన్ అపార్ట్‌మెంట్ విలువే రూ.15 కోట్లు ఉంటుందని చెప్పారు. ఆ బిల్డింగ్‌లో తనకు మూడు ఫ్లోర్లు ఉన్నాయని ఆమె వెల్లడించారు. తన వ్లాగ్‌లో భాగంగా ఫరా రాఖీకి అనేక బహుమతులు కూడా ఇచ్చారు.
ఆ సినిమాలో
ఫరా, షారుఖ్‌లతో కలిసి 'మై హూ నా' చిత్రం కోసం రాఖీ పనిచేశారు. ఇది బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. ఆమె బిగ్ బాస్‌లో చాలాసార్లు పాల్గొన్నారు. మొదట సీజన్ 1లో కనిపించి టాప్ ఫైవ్ ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచారు. తర్వాత బిగ్ బాస్ 14లో ఛాలెంజర్‌గా, బిగ్ బాస్ 15లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా తిరిగి వచ్చారు. తెలుగులో 6 టీన్స్ అనే సినిమా కూడా చేశారు రాఖీ.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


