Aamir Khan: ఆమిర్ ఖాన్ ఇలాంటోడు అనుకోలేదు.. అభిమానుల కానుకలు చెత్త కుప్పలోకి.. ఆర్ట్‌ను గౌరవించలేదు: ఫ్యాన్ వీడియో వైరల్

Aamir Khan: బాలీవుడ్ 'మిస్టర్ పర్ఫెక్షనిస్ట్' ఆమిర్ ఖాన్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు ఎంతో ఇష్టంగా పంపిన పెయింటింగ్‌లు, స్కెచ్‌లు ముంబైలోని ఒక తుక్కు సామానుల దుకాణంలో దర్శనమివ్వడమే దీనికి కారణం.

Published on: May 1, 2026, 13:01:33 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Aamir Khan: ప్రేమతో ఇచ్చే బహుమతి విలువైనదా కాదా అనేది ముఖ్యం కాదు. దాని వెనుక ఉన్న భావం ముఖ్యం. కానీ బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ విషయంలో ఇది రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. తన అభిమానులు ఎంతో సమయం వెచ్చించి, ప్రాణం పెట్టి గీసిన పెయింటింగ్ లను ఆమిర్ ఖాన్ ఆఫీసు చిత్తు అమ్ముకునే దుకాణానికి అమ్మేసిందనే వార్త ఇప్పుడు దుమారం రేపుతోంది.

Aamir Khan: ఆమిర్ ఖాన్ ఇలాంటోడు అనుకోలేదు.. అభిమానుల కానుకలు చెత్త కుప్పలోకి.. ఆర్ట్‌ను గౌరవించలేదు: ఫ్యాన్ వీడియో వైరల్ (AFP/ Instagram @logokuhe)
Aamir Khan: ఆమిర్ ఖాన్ ఇలాంటోడు అనుకోలేదు.. అభిమానుల కానుకలు చెత్త కుప్పలోకి.. ఆర్ట్‌ను గౌరవించలేదు: ఫ్యాన్ వీడియో వైరల్ (AFP/ Instagram @logokuhe)

స్క్రాప్ యార్డ్‌లో ఆమిర్ పెయింటింగ్స్

సత్య స్వాగత్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ముంబైలోని బెహ్రామ్ బాగ్ మార్కెట్‌లో తిరుగుతుండగా.. ఒక పాత సామాన్ల షాపులో వరుసగా ఉన్న ఆమిర్ ఖాన్ పెయింటింగ్‌లు చూసి షాక్‌కు గురయ్యారు. ఆ షాపు యజమానిని అడగగా.. "ఇవన్నీ ఆమిర్ ఖాన్ ఆఫీస్ నుంచి వచ్చిన తుక్కు" అని సమాధానం ఇచ్చాడు.

దీనికి సంబంధించిన వీడియోను సత్య స్వాగత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. "ఇది చూసి నా మనసు వికలమైంది. ఎంతో మంది కళాకారులు తమ ఫేవరెట్ స్టార్ కోసం ఎంతో కష్టపడి ఈ పెయింటింగ్‌లు గీసి ఉంటారు. వాటిని ఇలా గౌరవం లేకుండా చెత్తకుప్పలో పడేయడం సమంజసం కాదు" అని ఆవేదన వ్యక్తం చేశారు.

నెటిజెన్ల మధ్య భిన్నాభిప్రాయాలు

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు హీరోకి మద్దతుగా కామెంట్స్ చేశారు. "ఒక స్టార్ హీరోకు రోజుకు వేల సంఖ్యలో బహుమతులు వస్తుంటాయి. వాటన్నింటినీ భద్రపరచడానికి ఆఫీసుల్లో లేదా ఇంట్లో స్థలం సరిపోదు కదా? అంతమాత్రాన వారిని తప్పుబట్టడం సరికాదు" అని వాదిస్తున్నారు.

మరోవైపు విమర్శించే వాళ్లూ ఉన్నారు. "స్థలం లేకపోతే ఫ్రేములను తీసివేసి కేవలం పేపర్లను భద్రపరచవచ్చు. కానీ ఇలా బహిరంగంగా తుక్కు కొట్టుకు అమ్మేయడం కళాకారులను అవమానించడమే. అందుకే సెలబ్రిటీలను దేవుళ్లలా ఆరాధించడం మానేయాలి" అని మరికొందరు మండిపడుతున్నారు.

షాపు యజమాని ఏమన్నాడంటే?

ఆ వీడియోలో సత్య స్వాగత్ మరొక విషయాన్ని కూడా ప్రస్తావించారు. తాను ఒక పెయింటింగ్‌ను కొందామని వెళ్తే.. ఆ షాపు యజమాని.. "బాబు.. ఈ ఫ్రేమ్ కొత్తగా ఉంది. లోపల ఉన్న ఫోటో పడేసి నీ ఫోటో పెట్టుకో, తక్కువ ధరకే ఇస్తా" అని అన్నారట. ఒక కళాకారుడికి ఇది ఎంత పెద్ద అవమానమో ఆలోచించాలని సత్య కోరారు.

అయితే ఈ పెయింటింగ్‌లు నిజంగా ఆమిర్ ఖాన్ కార్యాలయం నుంచే వచ్చాయా? అనే దానిపై ఆమిర్ ఖాన్ టీమ్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More