Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ వివాదంలో ఇరుక్కున్న నటుడు.. మీరు ఎంత రెచ్చగొట్టినా నా సమాధానం ఇదే అంటూ ఘాటు రిప్లై

Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ వివాదంలో ఇరుక్కున్నారు బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్. గతంలో తాను చేసిన కామెంట్స్ పై వస్తున్న ట్రోల్స్ విషయంలోనూ ఆయన చాలా ఘాటు రిప్లై ఇచ్చారు. తాను మాట్లాడింది ముమ్మాటికీ నిజమే అని స్పష్టం చేశారు.

Published on: Jul 14, 2026, 14:05:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ విరాళాల వివాదంపై బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ అనుపమ్ ఖేర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆలయ డొనేషన్ బాక్సుల్లో జరిగిన అక్రమాలను "చాలా చిన్న విషయం" అని ఆయన అభివర్ణించడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ వివాదం రోజురోజుకూ ముదురుతున్నా ఆయన మాత్రం తన అభిప్రాయం మార్చుకునే ప్రసక్తే లేదని చాలా ఖరాఖండిగా తేల్చి చెప్పారు.

Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ వివాదంలో ఇరుక్కున్న నటుడు.. మీరు ఎంత రెచ్చగొట్టినా నా సమాధానం ఇదే అంటూ ఘాటు రిప్లై (AFP)
Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ వివాదంలో ఇరుక్కున్న నటుడు.. మీరు ఎంత రెచ్చగొట్టినా నా సమాధానం ఇదే అంటూ ఘాటు రిప్లై (AFP)

అయోధ్యలో రేగిన పొలిటికల్ సెన్సేషన్

ప్రస్తుతం అనుపమ్ ఖేర్ అయోధ్య పరిసర ప్రాంతాల్లో తన అప్‌కమింగ్ మూవీ 'శ్రీరామ భూమి' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ టైమ్‌లోనే రామ్ మందిర్ ట్రస్ట్‌లో విరాళాల లెక్కింపులో కొన్ని అక్రమాలు జరిగాయనే వార్తలు బయటకు వచ్చాయి. దీనిపై ఇండియా టుడే ఇంటర్వ్యూలో మాట్లాడిన అనుపమ్ ఖేర్.. దొంగతనం ఎక్కడ జరిగినా తప్పేనని, అయితే దీన్ని మతపరమైన కోణంలో చూడకూడదని కోరారు.

మొఘలుల కాలం నాటి దోపిడీతో పోలిక

ఈ వివాదాన్ని కాస్త పెద్దదిగా చేస్తూ ఆయన గత చరిత్రను గుర్తు చేశారు. "మొఘలుల కాలంలో మన ఆలయాలను ధ్వంసం చేసి, బ్రాహ్మణులను చంపి, వాళ్ల జంధ్యాలను తీసి తూకం వేసినప్పుడు అసలైన దోపిడీ జరిగింది. ఎందరో మొఘల్ రాజులు ఇక్కడికి వచ్చి గుడుల్లోని సంపదనంతా లూటీ చేశారు. ఆలయ ప్రాంగణాల్లోనే మహిళలపై దారుణాలకు ఒడిగట్టారు. అది చాలా పెద్ద సమస్య" అని అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు.

ఆ నాటి దారుణమైన పరిస్థితులనే మన దేశం తట్టుకుని నిలబడిందని ఆయన గుర్తు చేశారు. వాటితో పోలిస్తే ప్రస్తుతం అయోధ్యలో కొందరు వ్యక్తుల అత్యాశ వల్ల జరిగిన ఈ చోరీ చాలా చాలా చిన్న విషయమని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక వర్గం నెటిజన్లు, రాజకీయ నాయకులు ఆయనను టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆలయ పవిత్రతను తక్కువ చేసి మాట్లాడుతున్నారంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.

ట్రోలర్స్‌కు అనుపమ్ ఖేర్ స్ట్రాంగ్ కౌంటర్

తనపై వస్తున్న నెగిటివిటీపై అనుపమ్ ఖేర్ సోషల్ మీడియా వేదికగా ఒక పవర్‌ఫుల్ వీడియో షేర్ చేస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "కొన్ని రోజుల క్రితం రామ్ మందిర్ సందర్శించి నా మనసులో ఉన్న నిజాన్ని మాట్లాడాను. అది కొందరికి నచ్చలేదు. వాళ్ల సొంత ఎజెండాకు నా మాటలు అడ్డొచ్చాయి. దాంతో నన్ను ఎలా టార్గెట్ చేయాలి? ఎలా ట్రోల్ చేయాలి? ఎలా తిట్టాలి? అని ఒక పెద్ద వ్యవస్థ అంతా కలిసి నాపై పడింది" అని వీడియోలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను స్వయంకృషితో పైకి వచ్చిన వ్యక్తినని, దేనికీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. "జనాలకు తమ ఎజెండాకు సరిపోనప్పుడు నిజం అంటే చాలా భయం వేస్తుంది. రామ్ మందిర్ చోరీపై నేను పూర్తి నిజాయితీతో, బాధ్యతతో మాట్లాడాను. ఈ రోజుకూ నా మాటల్లోని ప్రతి పదానికి నేను కట్టుబడి ఉన్నాను. ట్రోలర్స్ అయినా, సోకాల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయినా, లీడర్స్ అయినా సరే.. ఎవరి అరుపులకూ నా అభిప్రాయం మారదు" అని పోస్ట్‌లో రాసుకొచ్చారు.

అనుపమ్ ఖేర్ కెరీర్ ఇలా..

సినిమా ఇండస్ట్రీలో 540 కంటే ఎక్కువ సినిమాల్లో నటించిన అనుపమ్ ఖేర్, ఎప్పుడూ తన బోల్డ్ కామెంట్స్, జాతీయవాద అభిప్రాయాలతో వార్తల్లో ఉంటారు. గతంలో ఆయన నటించిన 'ది కశ్మీర్ ఫైల్స్' మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.340 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది. ఆ సినిమా టైమ్‌లో కూడా ఆయనపై ఇలాగే తీవ్రమైన విమర్శలు వచ్చాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More