Kriti Sanon Rakhi: ఇలాంటి బట్టలు వేసుకొని కుక్కకు రాఖీ కడతావా?: నటిపై నెటిజన్ల విమర్శలు
Kriti Sanon Rakhi: బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన ఓ యాడ్ దుమారం రేపుతోంది. మోడర్న్ డ్రెస్ వేసుకొని తన పెంపుడు కుక్కకు రాఖీ కడుతూ ఆమె కనిపించడంపై నెటిజన్లు ఆడుకుంటున్నారు. అసలేం జరిగిందో చూడండి.
Kriti Sanon Rakhi: రక్షా బంధన్ పండుగ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నటించిన జువెలరీ బ్రాండ్ 'GIVA' కొత్త యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టిస్తోంది. స్క్రీన్ పై కనిపించే సోదరుడికి రాఖీ కట్టే సన్నివేశంలో కృతి ధరించిన ఇండో-వెస్ట్రన్ బ్రాసియర్ స్టైల్ ఔట్‌ఫిట్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయ పండుగలో ఇలాంటి బోల్డ్ బట్టలు ఏంటి అంటూ బీటౌన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

కృతి సనన్ యాడ్‌లో అసలు ఏముంది?
ప్రముఖ సిల్వర్ జువెలరీ బ్రాండ్ GIVA కోసం కృతి సనన్ ఒక ప్రమోషనల్ యాడ్ ఫిలింలో నటించింది. ఇందులో తన సోదరుడికి ఆమె రాఖీ కడుతుంది. అయితే ఈ యాడ్ లో కృతి వేసుకున్న ఇండో-వెస్ట్రన్ డ్రెస్ ప్రధాన వివాదానికి కారణమైంది. రివీలింగ్ గా ఉన్న బ్రాలెట్ బ్లౌజ్, దానికి జతగా కేప్, స్కర్ట్ ధరించి ఆమె రాఖీ కడుతున్నట్లు చూపించారు.
పండుగ వాతావరణంలో, ముఖ్యంగా సోదరుడికి రాఖీ కట్టే పవిత్రమైన క్షణాల్లో ఇలాంటి బోల్డ్ ఔట్‌ఫిట్ ఏమాత్రం తగినది కాదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. "పూజ ప్లేట్ ఏది? అన్నయ్య ముందు ఇలాంటి బట్టలు వేసుకోవడం ఏంటి?" అంటూ ఎక్స్ వేదికగా కృతిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అదీ కాకుండా తన పెంపుడు కుక్కకు రాఖీ కడుతూ కృతి కనిపించడంతో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి.
నెట్టింట రచ్చ: రెండుగా చీలిపోయిన సోషల్ మీడియా
ఈ వివాదంపై సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం కృతి సనన్ డ్రెస్సింగ్ ఛాయిస్‌ను తీవ్రంగా తప్పుపడుతోంది. "రక్షా బంధన్ సంస్కృతిని, సంప్రదాయాలను ఈ యాడ్ అవమానించేలా ఉంది. బ్రాండ్లు పబ్లిసిటీ కోసం సంప్రదాయాల విలువ తగ్గిస్తున్నాయి" అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.
మరోవైపు కృతి సనన్ అభిమానులు, మోడర్న్ థింకర్స్ ఆమెకు సపోర్టుగా నిలుస్తున్నారు. "సినిమాల్లో బికినీ వేసుకున్నప్పుడు ఈలలు వేసే జనం, ఒక ఫ్యాషన్ ఇండో-వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంటే సంస్కృతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. సోదరుడి ముందు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి వీళ్లెవరు?" అని సపోర్టర్లు ప్రశ్నిస్తున్నారు. మహిళల దుస్తులపై సమాజంలో ఉన్న మైండ్‌సెట్‌ను ఈ ఘటన ప్రతిబింబిస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు.
కృతి సనన్ రీసెంట్ మూవీస్, కెరీర్ ఇలా
బాలీవుడ్‌లో వరుస హిట్లు కొడుతూ పవర్ ఫుల్ హీరోయిన్‌గా ఎదిగిన కృతి సనన్ రీసెంట్‌గా 'కాక్‌టెయిల్ 2' సినిమాలో నటించింది. షాహిద్ కపూర్, రష్మిక మందన్నలతో కలిసి ఆమె నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ స్పందన తెచ్చుకుంది. గతంలో 'మిమి' సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకున్న కృతి.. 'క్రూ', 'తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా' వంటి సినిమాలతో మంచి సక్సెస్ చూసింది.
వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బ్రాండ్ ఎండోర్స్‌మెంట్లలో దూసుకుపోతున్న కృతికి ఈ జువెలరీ యాడ్ రూపంలో ఊహించని వివాదం ఎదురైంది. అయితే ఈ రచ్చపై కృతి సనన్ గానీ, బ్రాండ్ మేనేజ్‌మెంట్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇవ్వలేదు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


