Actress: నువ్వు నవ్వితే అస్సలు బాగుండవని అన్నాడు.. మిస్ ఇండియా గెలిచినా నవ్వలేదు.. పదేళ్లు అలాగే..: బాలీవుడ్ హీరోయిన్
Actress: బాలీవుడ్ నటి నేహా ధూపియా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ క్యాస్టింగ్ డైరెక్టర్ తనను నవ్వొద్దంటూ చేసిన కామెంట్స్ వల్ల తాను పదేళ్ల పాటు నవ్వకుండా ఉండిపోయానని ఆమె చెప్పింది.
Actress: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉండే కఠినమైన బ్యూటీ స్టాండర్డ్స్, నటీనటులు ఎదుర్కొనే బాడీ షేమింగ్ విమర్శలపై ప్రముఖ నటి నేహా ధూపియా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కెరీర్ ప్రారంభంలో ఒక క్యాస్టింగ్ డైరెక్టర్ చేసిన దారుణమైన వ్యాఖ్య తన ఆత్మవిశ్వాసాన్ని ఎలా దెబ్బతీసిందో, దానివల్ల దాదాపు పదేళ్ల పాటు తను ఫోటోలకు నవ్వడమే మానేశానని ఆమె గుర్తుచేసుకున్నారు.

ఆ ఒక్క మాటతో 10 ఏళ్లు నవ్వడమే మానేశాను
నేహా ధూపియా, ఆమె భర్త అంగద్ బేడీ కలిసి హోస్ట్ చేస్తున్న ‘డబుల్ డేట్’ (Double Date) టాక్ షోకి నటి హుమా ఖురేషి, ఆమె సోదరుడు సాఖిబ్ సలీమ్ అతిథులుగా వచ్చారు. ఈ ఎపిసోడ్ లో నేహా తన కెరీర్ తొలినాళ్లలోని చేదు అనుభవాన్ని పంచుకున్నారు.
ఆడిషన్ చేదు అనుభవం: నేహా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చినప్పుడు ఒక టీవీ షో ఆడిషన్ కోసం వెళ్లారు. అప్పుడు ఒక క్యాస్టింగ్ డైరెక్టర్ కారులో కూర్చుని ఆమెను చూసి నవ్వమనగా.. నేహా నవ్వింది.
క్యాస్టింగ్ డైరెక్టర్ వ్యాఖ్య: "నువ్వు అస్సలు నవ్వకు.. నవ్వితే చాలా దారుణంగా ఉంటావు. నీ ముఖంలో నవ్వనప్పుడే పవర్ ఉంటుంది. నీ నవ్వు నీకు అస్సలు సెట్ అవ్వదు" అని అతను ముఖం మీదే చెప్పేశాడు.
ఈ మాట నేహా మనసును తీవ్రంగా గాయపరిచింది. ఆ తర్వాత ఆమె ‘మిస్ ఇండియా’ టైటిల్ గెలుచుకున్నప్పటికీ, ఆ సమయంలోని ఆమె ఫోటోలను గమనిస్తే ఎక్కడా నవ్వుతూ కనిపించరు. ఈ కామెంట్ నుండి బయటపడటానికి ఆమెకు దాదాపు 8 నుండి 10 ఏళ్లు పట్టిందట. అలాగే మిస్ యూనివర్స్ పోటీల్లో ఓడిపోవడం కూడా ఆమెను మానసికంగా కుంగదీసిందని, కోలుకోవడానికి 10 నెలలు పట్టిందని తెలిపారు.
ట్రోలింగ్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లిన హుమా ఖురేషి
ఇదే షోలో నటి హుమా ఖురేషి కూడా తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకున్నారు. తన రెండో సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో జరిగిన విపరీతమైన ట్రోలింగ్ వల్ల తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని చెప్పారు.
ఆ నెగిటివిటీని తట్టుకోలేక ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోయానని, ఆ తర్వాత థెరపీ తీసుకోవడం, జర్నలింగ్ అలవాటు చేసుకోవడం ద్వారానే ఆ ఒంటిరితనం, మానసిక ఒత్తిడి నుండి బయటపడగలిగానని హుమా వెల్లడించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


