Comedian: కమెడియన్‌కు ఏకంగా రూ.7.35 కోట్ల జరిమానా.. కట్టకపోతే ఆరు నెలల జైలు.. చెక్కు బౌన్స్ కేసులో కష్టాల్లో రాజ్‌పాల్

Comedian: ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ కు కోర్టు భారీ జరిమానా విధించింది. ఒకవేళ అది కట్టలేకపోతే 6 నెలల జైలు తప్పేలా లేదు. ప్రస్తుతం ఇదే కేసులో బెయిల్ పై ఉన్న అతనికి ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చింది.

Published on: Jul 10, 2026, 16:22:52 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Comedian: బాలీవుడ్ సీనియర్ కామెడీ స్టార్ రాజ్‌పాల్ యాదవ్‌కు ఢిల్లీ హైకోర్టు ఊహించని షాకిచ్చింది. ఎప్పటినుంచో సాగుతున్న చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏకంగా రూ.7.35 కోట్ల భారీ ఫైన్ విధిస్తూ జస్టిస్ స్వర్ణ కాంత శర్మ సంచలన తీర్పు ఇచ్చారు. ఒకవేళ ఈ జరిమానా మొత్తం గనుక సకాలంలో చెల్లించకపోతే ఆయన మళ్లీ ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.

Comedian: కమెడియన్‌కు ఏకంగా రూ.7.35 కోట్ల జరిమానా.. కట్టకపోతే ఆరు నెలల జైలు.. చెక్కు బౌన్స్ కేసులో కష్టాల్లో రాజ్‌పాల్ (PTI)
Comedian: కమెడియన్‌కు ఏకంగా రూ.7.35 కోట్ల జరిమానా.. కట్టకపోతే ఆరు నెలల జైలు.. చెక్కు బౌన్స్ కేసులో కష్టాల్లో రాజ్‌పాల్ (PTI)

కోర్టు సీరియస్.. జరిమానా కట్టాల్సిందే!

ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు రాజ్‌పాల్ యాదవ్ ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టుకు ఇచ్చిన హామీలను ఆయన పదే పదే బ్రేక్ చేశారని, అందుకే ఎలాంటి ఊరట ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. మొత్తం ఏడు కేసుల్లో ఒక్కో దానికి రూ.1.05 కోట్ల చొప్పున మొత్తం రూ.7.35 కోట్లు చెల్లంచాల్సిందేనని ఆర్డర్ వేసింది. ఆయన భార్య రాధా యాదవ్‌కు కూడా ప్రతి కేసులో రూ.5 లక్షల కంటే ఎక్కువ ఫైన్ పడింది.

నిజానికి గతంలో ఉన్న ఆరు నెలల జైలు శిక్షను కోర్టు మూడు నెలలకు తగ్గించింది. అయితే ఈ జరిమానా మొత్తం కట్టడంలో విఫలమైతే మాత్రం పాత శిక్షే కొనసాగుతుందని హెచ్చరించింది. ప్రస్తుతం పైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి వీలుగా ఈ తీర్పు అమలును రెండు నెలల పాటు హోల్డ్‌లో పెట్టారు. ఇప్పటికే రాజ్‌పాల్ యాదవ్ డిపాజిట్ చేసిన రూ.2.25 కోట్ల మొత్తాన్ని ఇందులో అడ్జస్ట్ చేస్తామని జడ్జి పేర్కొన్నారు.

ఆ ఒక్క సినిమా ఫ్లాప్‌తో మారిన జీవితం

ఈ గొడవంతా అసలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే.. 2010 ఆ ప్రాంతంలో రాజ్‌పాల్ యాదవ్ కెరీర్ పీక్‌లో ఉంది. 'భూల్ భులయ్యా', 'హంగామా', 'ధోల్' లాంటి సినిమాలతో టాప్ కమెడియన్‌గా దూసుకుపోతున్నారు. అదే క్రేజ్‌తో ఆయన ఫస్ట్ టైమ్ డైరెక్టర్‌గా మారి 'అతా పతా లాపతా' అనే పొలిటికల్ సెటైర్ మూవీ ప్లాన్ చేశారు.

ఈ సినిమా ప్రొడక్షన్ ఖర్చుల కోసం మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి రూ.5 కోట్ల లోన్ తీసుకున్నారు. దాదాపు రూ.11 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 2012లో రిలీజై బాక్సాఫీస్ వద్ద ఘోర డిజాస్టర్‌గా మిగిలింది. థియేటర్ల ద్వారా కేవలం రూ.42 లక్షలు మాత్రమే కలెక్ట్ చేయడంతో రాజ్‌పాల్ యాదవ్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయారు.

సుదీర్ఘ న్యాయ పోరాటం.. బాలీవుడ్ స్టార్స్ సపోర్ట్

అప్పట్లో తీసుకున్న ఆ రూ.5 కోట్లకు వడ్డీలు పెరుగుతూ పోవడంతో ఆ మొత్తం బకాయిలు దాదాపు రూ.9 కోట్లకు చేరింది. లోన్ రీపేమెంట్ కోసం ఇచ్చిన చెక్కులన్నీ బౌన్స్ కావడంతో 2018లోనే మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత సెషన్స్ కోర్టు కూడా ఈ తీర్పును ఖరారు చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టు ఆదేశాల ప్రకారం ఆయన సరెండర్ అయి కొన్ని రోజులు కస్టడీలో కూడా గడిపారు. ఆ తర్వాత రూ.1.5 కోట్లు డిపాజిట్ చేసి తాత్కాలిక బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ కష్టకాలంలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్, సోనూ సూద్ లాంటి వాళ్లు ఆయనకు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం రాజ్‌పాల్ యాదవ్ 'వెల్‌కమ్ టు ది జంగిల్', 'భూత్ బంగ్లా' లాంటి పెద్ద ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More