హిందీలో కాకుండా నేను మొదట తెలుగులోనే సినిమా చేశాను.. 50 ఏళ్ల హాట్ హీరోయిన్ శిల్పా శెట్టి కామెంట్స్
50 ఏళ్ల వయసులోను సూపర్ హాట్ హీరోయిన్ అనిపించుకుంటుంది బాలీవుడ్ బ్యూటి శిల్పా శెట్టి. తెలుగులో వెంకటేష్, మోహన్ బాబు వంటి హీరోలతో జోడీ కట్టిన శిల్పా శెట్టి నటించిన లేటెస్ట్ కన్నడ సినిమా కేడీ ది డెవిల్. ధృవ సర్జా హీరోగా తెరకెక్కిన కేడీ ది డెవిల్ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో శిల్పా శెట్టి కామెంట్స్ చేసింది.
50 ఏళ్ల వయసులోను సూపర్ హాట్ హీరోయిన్ అనిపించుకుంటోంది బాలీవుడ్ గ్లామర్ బ్యూటి శిల్పా శెట్టి. యంగ్ హీరోయిన్స్‌కు సైతం పోటీ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో 90స్ కాలంలో వెంకటేష్, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి జత కట్టి ఆడింది.

చాలా కాలం గ్యాప్ తర్వాత
ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత సౌత్ సినిమాలో నటిస్తోంది శిల్పా శెట్టి. కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న సినిమా కేడీ ది డెవిల్. కన్నడ ప్రిన్స్ ధృవ సర్జా హీరోగా తెరకెక్కన కేడీ ది డెవిల్ టీజర్ రిలీజ్ ఇటీవల జరిగింది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
సాహసవీరుడు సాగర కన్య మూవీ
కేడీ ది డెవిల్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో శిల్పా శెట్టి మాట్లాడుతూ .. "హిందీలో కాకుండా నేను మొదటగా తెలుగులో సినిమాను చేశాను. సాహసవీరుడు సాగర కన్య అని సినిమాను చేశాను. నా సినీ కెరీర్ మొదలైంది తెలుగులోనే. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు వారు నాపై అదే ప్రేమను చూపిస్తున్నారు" అని చెప్పింది.
సంజయ్ దత్ గారితో
"కేడీ ది డెవిల్ సినిమాలో సత్యవతి పాత్రను నాకు ఇచ్చిన డైరెక్టర్ ప్రేమ్ గారికి థాంక్స్. కేవీఎన్ వెంకట్ గారికి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంది. ధృవ, రీష్మాలతో పని చేయడం సంతోషంగా ఉంది. సంజయ్ దత్ గారితో నేను చేసిన ప్రతీ సినిమా హిట్ అయింది. అదే ట్రెండ్ ఇప్పుడు కంటిన్యూ అవుతుందని భావిస్తున్నాను" అని శిల్పా శెట్టి తెలిపింది.
అన్ని కమర్శియల్ అంశాలు
"ఈ కేడీ ది డెవిల్ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ అంశాలున్నాయి. ఈ మూవీని ప్రేమ్ ఎంతో ప్రేమతో తెరకెక్కించారు" అని చెప్పుకొచ్చింది హాట్ బ్యూటి శిల్పా శెట్టి.
యూట్యూబ్‌లో ట్రెండ్
ఇదే ఈవెంట్‌లో కేవీఎన్ ప్రొడక్షన్ బిజినెస్ హెడ్ సుప్రిత్ మాట్లాడుతూ .. "ముంబైలో కేడీ ది డెవిల్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇంత మంచి మాస్ టీజర్‌ను ఇచ్చిన ప్రేమ్ గారికి థాంక్స్" అని అన్నారు.
చాలా తక్కువ
"రేపు కొచ్చి, బెంగళూరు, చెన్నైలో ఈవెంట్లు ప్లాన్ చేశాం. ఎంతో బిజీగా ఉన్నా కూడా మాతో పాటుగా వస్తున్న సంజయ్ దత్ గారికి థాంక్స్. టీజర్‌లో ధృవ సర్ చేసింది చాలా తక్కువ. తెరపై ఆయన అదరగొట్టేస్తారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత వెంకట్ గారికి థాంక్స్" అని సుప్రిత్ చెప్పుకొచ్చారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



