Govinda Wife: ముందు ఆ రూ.200 కోట్లు కాపాడుకో.. మొత్తం నీ పేరు మీదికి మార్చుకో: గోవింద భార్యకు బాలీవుడ్ సెక్స్ బాంబ్ సలహా

Govinda Wife: బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ నటుడు గోవిందా భార్య సునీత అహూజాకు దిమ్మదిరిగే సలహా ఇచ్చింది. విడాకుల కేసు వెనక్కి తీసుకొని మంచి పని చేశావంటూనే.. ముందు ఆ రూ.200 కోట్ల ఆస్తిని కాపాడుకో అని చెప్పడం విశేషం.

Published on: Aug 21, 2026, 15:24:05 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Govinda Wife: బాలీవుడ్ ఐకానిక్ కామెడీ కింగ్ గోవిందా, ఆయన భార్య సునీతా అహుజాల విడాకుల డ్రామాలో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం ఫ్యామిలీ కోర్టులో వేసిన విడాకుల పిటిషన్‌ను సునీత ముంబై బాంద్రా ఫ్యామిలీ కోర్టులో సడన్‌గా వెనక్కి తీసుకోగా.. ఈ వివాదంలో డ్రామా క్వీన్ రాఖీ సావంత్ ఎంట్రీ ఇచ్చి సంచలన వ్యాఖ్యలు చేసింది. "రూ. 200 కోట్ల ఆస్తిని ముందు కాపాడుకో" అంటూ సునీతకు రాఖీ ఇచ్చిన ఫోన్ కాల్ సలహా వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

Govinda Wife: ముందు ఆ రూ.200 కోట్లు కాపాడుకో.. మొత్తం నీ పేరు మీదికి మార్చుకో: గోవిందా భార్యకు రాఖీ సావంత్ సలహా
Govinda Wife: ముందు ఆ రూ.200 కోట్లు కాపాడుకో.. మొత్తం నీ పేరు మీదికి మార్చుకో: గోవిందా భార్యకు రాఖీ సావంత్ సలహా

రెండో పెళ్లి ప్లాన్.. అందుకే విడాకుల కేస్ విత్‌డ్రా

ముంబైలో ఫొటోగ్రాఫర్ల ముందే సునీతా అహుజాకు రాఖీ సావంత్ స్పీకర్ ఫోన్ కాల్ చేసింది. ఈ సంభాషణలో విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి గల కారణాన్ని సునీత ఓపెన్‌గా బయటపెట్టింది.

గోవిందా, ఆయన కొత్త సినిమా హీరోయిన్ కోమల్ రాణి స్వర్ణకార్‌ను పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారనే సమాచారం రావడం వల్లే తాను విడాకుల కేస్ విత్‌డ్రా చేసుకున్నట్లు సునీత ఆడియో కాల్‌లో స్పష్టం చేసింది. తాను విడాకులు ఇస్తే వాళ్లు పెళ్లి చేసుకుంటారని, అందుకే ఆ ఛాన్స్ ఇవ్వకుండా కేస్ ఉపసంహరించుకున్నానని చెప్పింది.

"రూ. 200 కోట్ల ఆస్తి నీ పేరున రాసేసుకో"

సునీత మాటలు వినగానే రాఖీ సావంత్ ఆమెకు ఒక ప్రాక్టికల్ మైండ్ బ్లోయింగ్ సలహా ఇచ్చింది. "నువ్వు పర్సనల్ గొడవలన్నీ పక్కన పెట్టి గోవిందాకు ఉన్న రూ. 200 కోట్ల ప్రాపర్టీస్‌పై ఫోకస్ చెయ్" అంటూ రాఖీ ఉచిత సలహా ఇచ్చింది.

"వేరే ఎవరో వచ్చి ఆ ఆస్తిని ఎగరేసుకొని వెళ్లక ముందే లీగల్‌గా అంతా నీ పేరు మీదికి, పిల్లల పేరు మీదికి మార్పించుకో. ప్లీజ్ నా మాట విను" అంటూ రాఖీ హెచ్చరించింది. ఇంట్లో ఉండే భార్య ఎప్పుడూ తప్పు చేయదని, తాను సునీత వైపే ఉంటానని రాఖీ బహిరంగంగా మీడియా ముందు ప్రకటించింది.

'షుగర్ డాడీ' కామెంట్స్.. గోవిందా సీరియస్ రియాక్షన్

ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో గోవిందా, యంగ్ నటి కోమల్ రాణి కలిసి కనిపించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై సునీత తీవ్రంగా స్పందిస్తూ గోవిందాని 'షుగర్ డాడీ' అని సంబోధించింది. తన కూతురు వయసు ఉన్న అమ్మాయితో డ్రెస్సింగ్ సెన్స్ లేకుండా తిరుగుతున్నాడని మండిపడింది.

ఈ వ్యాఖ్యలపై గోవిందా కూడా ఘాటుగానే స్పందించాడు. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తాను 'రూపా' (Roopa) అనే సినిమాతో కమ్‌బ్యాక్ ఇస్తున్నానని, ఇలాంటి సమయంలో తన ఇమేజ్‌ను, బిజినెస్‌ను దెబ్బతీయవద్దని భార్యను వేడుకున్నాడు. పేద కుటుంబాల నుంచి వచ్చే కొత్త నటులను అవమానించవద్దని కోరాడు.

ఏడేళ్ల తర్వాత గోవిందా కమ్‌బ్యాక్ మూవీ

1990ల కాలంలో బాలీవుడ్‌ను తన డ్యాన్స్, కామెడీ టైమింగ్‌తో ఊపేసిన గోవిందా, చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నాడు. తన సొంత బ్యానర్‌లో 'రూపా' అనే లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఈ సినిమా ద్వారానే కోమల్ రాణి స్వర్ణకార్ కథానాయికగా పరిచయం కాబోతోంది. సినిమా సెట్స్‌పైకి వెళ్లే టైమ్‌లోనే ఈ రేంజ్ పర్సనల్ కాంట్రవర్సీలు, రూ. 200 కోట్ల ఆస్తుల వివాదం రచ్చకెక్కడంతో బాలీవుడ్ సినీ వర్గాలు షాక్ అవుతున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More