విజయ్ దేవరకొండకు రష్మిక కంటే నేనే బాగా కిస్ పెడతా, చచ్చాక పాతేందుకు గొయ్యి తప్పా ఇంకేం లేదు: బ్రహ్మముడి కావ్య కామెంట్స్

బ్రహ్మముడి సీరియల్‌లో కావ్య పాత్రలో అలరిస్తున్న నటి దీపిక రంగరాజు. బుల్లితెరపై పంచులు, ప్రాసలతో ఎంతో నవ్వించే దీపిక రంగరాజు రియల్ లైఫ్‌లో తనకు ఆరడుగుల గొయ్యి తప్పా ఇంకేం లేదని షాకింగ్ విషయం చెప్పింది. అలాగే, రొమాన్స్‌లో ఏమాత్రం మొహమాటం లేదని చెప్పుకొచ్చింది బ్రహ్మముడి కావ్య.

Published on: Jul 11, 2025, 12:10:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్ ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. బ్రహ్మముడిలో కావ్యగా, కళావతిగా అద్భుతమైన నటనతో తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ తెచ్చుకుంది దీపిక రంగరాజు. బుల్లితెర షోలలో నిత్యం నవ్వుతూ పంచులు, ప్రాసలతో అందరిని నవ్వించే దీపిక రంగరాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు చెప్పింది.

విజయ్ దేవరకొండకు రష్మిక కంటే నేనే బాగా కిస్ పెడతా, చచ్చాక పాతేందుకు గొయ్యి తప్పా ఇంకేం లేదు: బ్రహ్మముడి కావ్య కామెంట్స్
విజయ్ దేవరకొండకు రష్మిక కంటే నేనే బాగా కిస్ పెడతా, చచ్చాక పాతేందుకు గొయ్యి తప్పా ఇంకేం లేదు: బ్రహ్మముడి కావ్య కామెంట్స్

జబర్దస్త్ వర్ష యాంకర్‌గా

జబర్దస్త్ బ్యూటి వర్ష హోస్ట్‌గా చేస్తున్న షో కిసిక్ టాక్స్. తాజాగా కిసిక్ టాక్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా దీపిక రంగరాజు అలియాస్ బ్రహ్మముడి కావ్య హాజరు అయింది. ఈ టాక్ షోకి రావడంతో వర్షపై పంచులు వేసి నవ్వించింది దీపిక.

ఆన్‌స్క్రీన్ రొమాంటిక్ సీన్

నవరసాలు చేసి చూపించిన దీపిక రంగరాజు. "ఆన్‌స్క్రీన్‌లో రొమాంటిక్ సీన్ వస్తే ఏ హీరోతో చేస్తావు" అని వర్ష అడిగితే.. "ఏ హీరో అయిన ఓకే. వాళ్లే సిగ్గుపడతారు. అందులో నాకు ఎలాంటి మొహమాటం లేదు" అని దీపిక రంగరాజు తెలిపింది.

రష్మిక కంటే బెటర్‌గా

"విజయ్ దేవరకొండ గారితో కిస్సింగ్ సీన్ చేయాలంటే చేస్తావా" అని వర్ష అడిగింది. "రష్మిక గారు ఏంటీ నేను ఎంత బాగా చేస్తానో తెలుసా" అని విజయ్ దేవరకొండతో రష్మిక కంటే తానే బాగా కిస్ చేస్తాను అన్నట్లుగా చెప్పింది దీపిక రంగరాజు. దాంతో వర్ష పడి పడి నవ్వింది. "ఇంత బ్యూటిఫుల్ స్మైల్‌తో ఉంటావ్ మీ మదరు చాలా లక్కీ నిన్ను కన్నందుకు" అని వర్ష అంది.

సొంత ఇల్లు కొనాలని

"తను చాలా బాధపడుతుంది. నాక ఒక డ్రీమ్ సొంత ఇల్లు కొనాలని" అని దీపిక చెబితే ఇన్ని షోలు చేశావ్ ఇల్లు లేదా అని వర్ష అడిగింది. "అంటే మనం ప్రపంచంలో పుట్టినప్పుడే ప్రభుత్వం మనకు ఇస్తుంది కదా. శ్మశానంలో ఉంటుంది కదా ఆరు ఫీట్ల గొయ్యి. మనం చనిపోతే పాతిపెట్టేందుకు ఒక ఆరడుగుల గొయ్యి ఉంటుంది కదా. అది తప్ప నాకు వేరే లేవు" అని దీపిక రంగరాజు ఏడిపించేసింది.

కార్తీక దీపం సీరియల్ ఆఫర్

దీపిక మాటలకు వర్ష తెగ షాక్ అయింది. అలాగే, కార్తీక దీపం సీరియల్ ఆఫర్ మొదట దీపిక రంగరాజు వద్దకే వెళ్లినట్లు వర్ష చెప్పింది. "నాకు పేరు చెప్పలేదు. కానీ, మొహం నిండా బ్లాక్ మేకప్ వేసుకోవాలని చెప్పారు. అది ఇష్టం లేకే ఒప్పుకోలేదు" అన్నట్లుగా దీపిక రంగరాజు చెప్పింది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More