Brahmamudi April 18th Episode: బ్రహ్మముడి.. నందు పిలిచినా ఇంటికి రానన్న ఇందు.. రాజ్ దగ్గరే ఉంటానంటూ.. రేఖకు చక్రి గండం

Brahmamudi April 18th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 18 ఎపిసోడ్ లో ఇందును కనిపెట్టిన నందు ఇంటికి రమ్మని అడిగినా ఆమె రానని మొండికేస్తుంది. మరోవైపు రేఖకు చక్రి నుంచి పెద్ద గండం పొంచి ఉంటుంది.

Published on: Apr 18, 2026, 07:37:44 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahmamudi April 18th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఇందు మరో పెద్ద ట్విస్టే ఇస్తుంది. తాను అనుకున్నది జరిగే వరకూ ఇంటికి రాను అని నందుకి తేల్చి చెబుతుంది. దీంతో అక్కను కనిపెట్టినా నందు ఉత్త చేతులతోనే ఇంటికి తిరిగి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

Brahmamudi April 18th Episode: బ్రహ్మముడి.. నందు పిలిచినా ఇంటికి రానన్న ఇందు.. రాజ్ దగ్గరే ఉంటానంటూ.. రేఖకు చక్రి గండం
Brahmamudi April 18th Episode: బ్రహ్మముడి.. నందు పిలిచినా ఇంటికి రానన్న ఇందు.. రాజ్ దగ్గరే ఉంటానంటూ.. రేఖకు చక్రి గండం

అపర్ణకు ధైర్యం చెప్పిన నందు

బ్రహ్మముడి సీరియల్ శనివారం (ఏప్రిల్ 18) ఎపిసోడ్ అపర్ణను నాన్నమ్మ అంటూ నందు ధైర్యం చెప్పే సీన్ తో మొదలవుతుంది. ఇందును తాను కనిపెట్టి తీసుకొస్తానని హామీ ఇస్తుంది. ఎంతటి నేరస్థుడైనా ఏదో ఒక తప్పు చేస్తాడని, దాని ద్వారా అక్క ఎక్కడుందో తెలుసుకోవచ్చని చెబుతుంది. ఏమీ కాని నువ్వు మాకు ఇంత సాయం చేస్తున్నావంటూ అపర్ణ ఎమోషనల్ అవుతుంది.

ఇందుతో వంట చేయించిన రాజు, లక్కీ

అటు రాజు, లక్కీ.. ఇందుకి భోజనం తీసుకెళ్తారు. కానీ ఆమె మాత్రం తాను తినను అని మొండికేస్తుంది. తనకు ఇంటి భోజనం కావాలని అంటుంది. కుదరదని రాజు అంటే.. తనకు ఏమైనా అయితే చిల్లిగవ్వ కూడా రాదు అని బెదిరిస్తుంది. దీంతో రాజును పక్కకు తీసుకెళ్లి ఆ వంటేదో ఆమెతోనే చేయిద్దామని అంటాడు.

సరే అని ఆమెను కిచెన్ లోకి తీసుకెళ్లి కట్టేస్తారు. ఆమె చెబితే రాజు వంట చేద్దామని ప్రయత్నించినా.. అది కుదరకపోవడంతో ఇందుయే స్వయంగా రంగంలోకి దిగుతుంది. తాను ఎక్కడికి పారిపోనని, కట్లు విప్పాలని అడగడంతో రాజు సరే అంటాడు. దీంతో ఇందు స్వయంగా వంట చేస్తుంది.

ఇందు డ్రెస్సు గుర్తొచ్చి మళ్లీ రాజు ఇంటికి నందు

మరోవైపు అక్క ఎక్కడ ఉంది? నేను ఏదో లాజిక్ మిస్ అవుతున్నానే అని నందు ఆలోచిస్తూ ఉంటుంది. ఫంక్షన్ వీడియో చూస్తే ఏదైనా క్లూ దొరుకుతుందని అనుకొని ఆ వీడియో చూస్తుంది. అందులో ఇందు వేసుకున్న డ్రెస్ చూస్తుంది. సరిగ్గా అదే డ్రెస్ రాజు ఇంటికి వెళ్లినప్పుడు కనిపిస్తుంది. అది గుర్తుకు తెచ్చుకొని కచ్చితంగా ఇందు అక్కడే ఉంటుందని అనిపించి ఆ ఇంటికి మళ్లీ వెళ్తుంది.

ముగ్గురూ కలిసి భోజనం

అప్పటికే వంట చేసి రాజు, లక్కీ ముందు పెడుతుంది ఇందు. కానీ ఆ భోజనం తినడానికి రాజు వెనుకాడతాడు. అందులో ఏమైనా కలిపిందేమో అని అనుమానిస్తాడు. ముందు నువ్వు తిన్న తర్వాతే తింటామని అనడంతో సరే అని ఆమె కూడా తింటుంది. అప్పుడు రాజు, లక్కీ కూడా తింటారు. అప్పటికే ఆ ఇంటికి వచ్చిన నందు.. కిటికీలో నుంచి ఇదంతా చూస్తుంది. ఎలాగైనా ఇందుతో మాట్లాడి ఆమెను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని అనుకుంటుంది.

రేఖ ఇంటికి చక్రి.. డబ్బు డిమాండ్

ఇటు ఇంట్లో రేఖ, భూషణ్, భ్రమరాంబ ఆ కోటి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తుంటారు. సరిగ్గా అప్పుడే చక్రి కూడా ఇంటికి వస్తాడు. దీంతో రేఖ, భూషణ్ మరింత కంగారు పడతారు. వాడు వచ్చినా మన దగ్గర ఏమీ లేదని తెలుసు కదా అని అనుకుంటారు. చక్రి వచ్చి తన డబ్బు తనకు ఇవ్వాలని అంటాడు.

కానీ రేఖ మళ్లీ తన మాటలతో అతన్ని బోల్తా కొట్టించాలని చూస్తుంది. ఇందును విడిపించడానికి ఆ రూ.కోటి ఇస్తే.. వారం రోజుల్లో మొత్తం డబ్బు ఇచ్చేస్తానని అంటుంది. ఈసారి నిన్ను నమ్మి మోసపోనని, మీరు దాచుకున్న బంగారం మొత్తం ఇస్తే డబ్బు ఇస్తానని అనడంతో వాళ్లు షాక్ తింటారు.

నందు రమ్మన్నా రానన్న ఇందు

మరోవైపు ఇందు ఉన్న ఇంట్లోకి నందు వెళ్తుంది. అప్పటికే రాజు, లక్కీ మంచిగా తిని కునుకు తీస్తుంటారు. ఇందును చూసిన నందు వాళ్లు లేచే లోపే ఇంటికి వెళ్దాం పద అని అంటుంది. కానీ ఇందు మాత్రం రానంటుంది. తాను అనుకున్నది సాధించే వరకూ అక్కడికి వెళ్లనని చెబుతుంది. అది అర్థం చేసుకున్న నందు.. నాన్నమ్మ, తాతయ్యలను తాను జాగ్రత్తగా చూసుకుంటానని హామీ ఇస్తుంది.

ఇంట్లో బంగారం అంతా చక్రి ముందు పెట్టినా దాని విలువ రూ.50 లక్షలకు మించి లేదని అంటాడు. దీంతో అపర్ణ దాచిన బంగారం కోసం రేఖ, భ్రమరాంబ డిమాండ్ చేస్తారు. భ్రమరాంబ అయితే ఆమెపై దౌర్జన్యానికి వెళ్తుంది. అప్పుడే నందు వచ్చి అడ్డుకుంటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More