Brahmamudi April 4th Episode: బ్రహ్మముడి.. ఘనంగా ఇందు బర్త్‌డే.. సంతకం పెట్టనివ్వనన్న రాజు.. నిర్ణయం మార్చలేరన్న ఇందు

Brahmamudi April 4th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 4 ఎపిసోడ్ లో ఇందు బర్త్ డే సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి రేఖ ప్లాన్ చేస్తుంది. అదే సమయంలో ఆమెను కిడ్నాప్ చేయకుండా ఎవరూ అడ్డుకోలేరని రాజు అనుకుంటాడు.

Published on: Apr 4, 2026, 07:09:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahmamudi April 4th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఓవైపు ఇందు సెలబ్రేషన్స్, మరోవైపు ఆమె కిడ్నాప్ ప్లాన్స్ రెడీ అయిపోతాయి. తాను ఓ నిర్ణయం తీసుకున్నానని, దానిని ఎవరూ మార్చలేరని ఇందు అంటుంది. ఆమె కిడ్నాప్ ను ఎవరూ అడ్డుకోలేరని రాజు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

Brahmamudi April 4th Episode: బ్రహ్మముడి.. ఘనంగా ఇందు బర్త్‌డే.. సంతకం పెట్టనివ్వనన్న రాజు.. నిర్ణయం మార్చలేరన్న ఇందు
Brahmamudi April 4th Episode: బ్రహ్మముడి.. ఘనంగా ఇందు బర్త్‌డే.. సంతకం పెట్టనివ్వనన్న రాజు.. నిర్ణయం మార్చలేరన్న ఇందు

గాయాలతో ఇంటికి వెంకీ.. రాజుకు సాహు వార్నింగ్

బ్రహ్మముడి సీరియల్ శనివారం (ఏప్రిల్ 4) ఎపిసోడ్ రాజు ఇంట్లో సాహు ఉండే సీన్ తో మొదలవుతుంది. రాజు తల్లి లక్ష్మీ వండిన చేపల పులుసు తింటాడు సాహు. అదే సమయంలో గాయాలతో ఉన్న వెంకీ ఇంటికి వస్తాడు. అతన్ని చూసి అందరూ కంగారు పడతారు.

అప్పుడు రాజు, లక్కీలను బయటకు తీసుకెళ్లిన సాహు.. అది తన పనే అని అంటాడు. ఇప్పుడు తమ్ముడి మీదికి కారు వచ్చింది.. డబ్బులు చెప్పిన సమయానికి రాకపోతే నీ ఫ్యామిలీ మీదికి బుల్డోజర్ వస్తుంది అని బెదిరించి వెళ్లిపోతాడు. దీంతో రాజు, లక్కీ ఆందోళన పడతారు.

ఇందుని కిడ్నాప్ చేయాలన్న ఐశ్వర్య

తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేయడానికైనా రాజు సిద్ధమవుతాడు. ఏ దారీ కనిపించకపోవడంతో కిడ్నాప్ కోసం సిద్ధమవుతాడు. వెంటనే ఐశ్వర్యకు ఫోన్ చేయాలని చెబుతాడు. ఇంతలోనే ఎందుకు మనసు మార్చుకున్నారని ఆమె అడుగుతుంది. నీ అవసరాలు నీకు ఉన్నట్లే.. మా అవసరాలు మాకున్నాయి.. ఇంతకీ ఎవరిని కిడ్నాప్ చేయాలో చెప్పు అని ఐశ్వర్యతో అంటాడు రాజు. ఇందు ఫొటో చూపించడంతో షాక్ తింటాడు.

సంతకం పెట్టనివ్వనన్న రాజు

ఇందు మీ ఇంట్లోనే ఉంటుంది కదా.. ఆమెను కిడ్నాప్ చేయడమేంటి అని రాజు అంటాడు. అయినా ఆమె మిడిల్ క్లాస్ అమ్మాయిలా ఉంది.. ఆమెను కిడ్నాప్ చేస్తే వచ్చేది ఏంటని అడుగుతాడు. రేపు ఆమె పుట్టిన రోజు.. ఆ రోజు ఒక్క సంతకం పెడితే.. కోట్ల ఆస్తి మా ఆంటీ సొంతం అవుతుంది.

అందువల్ల ఇందుని కిడ్నాప్ చేస్తే ఎంత అడిగినా ఇస్తుంది.. మీకు ఏ రిస్కూ ఉండదు.. ఎందుకంటే ఆ డబ్బు ఇచ్చే వ్యక్తి పక్కనే నేను ఉంటూ మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తానని ఐశ్వర్య అంటుంది. ఒకవేళ ఆమె సంతకం పెట్టేస్తే అని లక్కీ అడుగుతాడు. ఆ తర్వాత ఇందు ఉన్నా, పోయినా మా ఆంటీ పట్టించుకోదు అని ఐశ్వర్య అంటుంది. అలా అయితే ఆమెను సంతకం పెట్టనివ్వను అని రాజు తేల్చి చెబుతాడు.

ఐశ్వర్య మాటలతో భ్రమరాంబ షాక్

ఇంటికి వచ్చిన తర్వాత ఐశ్వర్య వింతగా మాట్లాడటం చూసి అందరూ షాక్ తింటారు. రేపటి నుంచీ నీ జీవితమే మారిపోతుంది.. చివరిగా ఓ కాఫీ పెట్టివ్వు.. నీ కాఫీని చాలా మిస్ అవుతాను అని ఐశ్వర్య ఏదేదో మాట్లాడటంతో భ్రమరాంబలో అనుమానం వస్తుంది. ఎందుకలా మాట్లాడుతున్నావని అడగడంతో రేపటి నుంచి ఇందుయే కదా ఈ ఇంటికి మహారాణి అని ఐశ్వర్య కవర్ చేసుకుంటుంది.

ఫామ్ హౌజ్‌లో ఇందు బర్త్‌డే ప్లాన్ చేసిన రేఖ

అప్పుడే రేఖ కూడా వస్తుంది. ఇందుకి మరిన్ని బట్టలు తీసుకొస్తుంది. అంతేకాదు ఫామ్ హౌజ్ లో ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా ఏర్పాటు చేశానని చెబుతుంది. అది విని అపర్ణ సీరియస్ గా చూస్తుంది. నేనేం చేసినా మీరు అలాగే చూస్తారని రేఖ అంటుంది. అపర్ణ, ఇందు వెళ్లిపోయిన తర్వాత రేపు అందరి ముందు ఇందు సంతకం పెట్టేలా చేస్తానని రేఖ అంటుంది. చాటుగా వేలిముద్ర వేయించుకునే కంటే.. అలా అందరి ముందూ ఆస్తి రాయించుకుంటే బాగుంటుంది కదా అని భ్రమరాంబ, భూషణ్ లతో చెబుతుంది.

కిడ్నాప్ కోసం రాజు, లక్కీ ప్లాన్

మరోవైపు ఇందుని ఎలా కిడ్నాప్ చేయాలా అని రాజు, లక్కీ ఆలోచిస్తుంటారు. అప్పుడే ఐశ్వర్య ఫోన్ చేసి బర్త్ డే ఇంట్లో కాదు ఫామ్ హౌజ్ లో చేస్తున్నారు.. అక్కడ మీ పని ఈజీగా అవుతుంది.. మిమ్మల్ని ఎవరూ గుర్తు పట్టకుండా చూసుకోండి అని చెబుతుంది. మమ్మల్ని గుర్తు పట్టేలోపే ఆమెను ఎత్తుకెళ్లిపోతాం.. ఎవరూ ఆపలేరు అని రాజు అంటాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More