Brahmamudi August 12 Episode: బ్రహ్మముడి.. దుగ్గిరాల ఫ్యామిలీకి మరో విలన్.. శశిని చితకబాదిన ఇందు, నందు.. మారని ఐషూ తీరు
Brahmamudi Serial August 12th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 12 ఎపిసోడ్ లో దుగ్గిరాల కుటుంబానికి శశి రూపంలో మరో కొత్త విలన్ వస్తాడు. తనను నందు, ఇందు కాపాడారని తెలిసినా ఐశ్వర్య మాత్రం వాళ్లను నమ్మదు.
Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో తమ అక్క ఐశ్వర్యను శశి బారి నుంచి ఇందు, నందు కాపాడతారు. అయినా ఐషూ బుద్ది మాత్రం మారదు. శశిని గుడ్డిగా నమ్మిన ఆమె.. వాళ్లనే తప్పుబడుతూ అతన్నే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెబుతుంది. అటు ఇందుకి శశి గట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.

ఐశ్వర్యతో శశి బర్త్‌డే పార్టీ
ఐశ్వర్యతో కలిసి శశి బర్త్‌డే పార్టీ చేసుకునే సీన్ తో సీరియల్ బుధవారం (ఆగస్ట్ 12) ఎపిసోడ్ మొదలైంది. శశికి ఐషూ ఓ రింగ్ గిఫ్ట్ గా ఇస్తుంది. తానెప్పుడూ ఖరీదైన ఉంగరాలనే పెట్టుకున్నా.. ఇది మాత్రం చాలా స్పెషల్ అని శశి అంటాడు. కేక్ కట్ చేద్దామని అంటాడు. ఇంకా ఎవరూ రాలేదు కదా అని ఐశ్వర్య అంటుంది. ఎవరూ రారు.. అదే సర్‌ప్రైజ్ అని శశి అనడంతో.. ప్రపోజ్ చేయడానికి పెద్ద ప్లానే వేసినట్లున్నావ్ కదా అని ఐషూ మనసులో అనుకుంటుంది.
ఐషూ ఫ్రెండ్‌ను నిలదీసిన ఇందు, నందు
ఇటు ఐషూ ఫ్రెండ్ రేణు.. ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. తనకు ఖరీదైన గిఫ్ట్ ఇస్తేనే తన ఫ్రెండ్ వివరాలు మొత్తం చెబుతానని అవతలి వ్యక్తికి చెబుతుంటుంది. అప్పుడే ఇందు, నందు అక్కడికి వస్తారు. నువ్వు అందరినీ ఇలా ఖరీదైన గిఫ్ట్ ల కోసం మోసం చేస్తుంటావా అని వాళ్లు అడగడంతో రేణు షాక్ తింటుంది. తాను ఎవరినీ మోసం చేయలేదని చెబుతుంది.
అయినా మీరెవరు అని అడగడంతో మేము మా ఐశ్వర్య అక్క కోసం వచ్చాం.. ఆమెను కూడా ఇలా గిఫ్ట్ కోసమే ఆ శశితో కలిపావా అని నందు నిలదీస్తుంది. ఏం కాదు.. వాడు మంచోడు.. కోటీశ్వరుడు.. ఐషూ అంటే ప్రాణం అని రేణు అంటుంది. నందు అటూ ఇటూ వాయించడంతో అసలు నిజం చెబుతుంది. వాడు దుర్మార్గుడని, కన్నేసిన అమ్మాయిలందరినీ వాడుకుంటాడని అంటుంది.
ఐషూ లొకేషన్ కనిపెట్టిన నందు
ఇప్పుడు వాళ్లిద్దరూ ఎక్కడ ఉన్నారని నందు నిలదీస్తుంది. శశి బర్త్ డే పార్టీలో అనడంతో నందు ఫోన్ తీసి సోషల్ మీడియా తెరుస్తుంది. శశి ప్రొఫైల్ లో అసలు ఈరోజు బర్త్ డే కాదు, ఈ నెల కూడా కాదని రేణు గట్టిగా నిలదీస్తుంది.
దీంతో రేణు మొత్తం నిజం చెప్పేస్తుంది. పార్టీ ఎక్కడ జరుగుతుందో మొదట చెప్పని రేణు.. తర్వాత నందు నాలుగు పీకడంతో ఆమెకు లొకేషన్ షేర్ చేస్తుంది. దీంతో రేణుకు మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చి ఇందు, నందు అక్కడికి వెళ్తారు.
శశి బుట్టలో పడిపోయిన ఐశ్వర్య..
ఇటు ఐశ్వర్యను శశి పూర్తిగా బుట్టలో వేసుకుంటాడు. నువ్వంటే ప్రాణమని, ప్రాణంగా ప్రేమిస్తున్నానని అంటాడు. ఐషూకి ఓ రోజ్ ఇచ్చి లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఆమె కూడా ఆ ప్రేమను అంగీకరిస్తుంది. ఈ సందర్భాన్ని డ్రింక్ తో సెలబ్రేట్ చేసుకుందామని శశి అంటాడు.
ఐషూ డ్రింక్‌లో మత్తు మందు కలిపిన శశి
ఆ తర్వాత ఐషూ డ్రింక్ లో శశి మత్తు మందు కలుపుతాడు. ఆమెకు ఆ డ్రింక్ ఇచ్చి తాను కూడా తాగుతాడు. అది తాగగానే ఐశ్వర్య కళ్లు తిరుగుతాయి. ఆ మత్తులోనే ఆమెను లొంగదీసుకోవాలని శశి చూస్తాడు. డ్యాన్స్ చేద్దామంటూ ఆమెను పట్టుకొని అలా అలా బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి బెడ్ పై పడేస్తాడు. ఆమెపై పడి బలవంతం చేయబోతుంటాడు.
శశిని కొట్టి ఐశ్వర్యను కాపాడిన ఇందు, నందు
అప్పుడే ఇందు, నందు అక్కడికి వస్తారు. ఐశ్వర్యను బలవంతం చేయబోతున్న శశిని లాగి పక్కకు నెడుతుంది ఇందు. తర్వాత అతన్ని కొడుతుంది. ఆమెను చూసిన శశి.. వన్ ప్లన్ వన్ ఆఫర్ లాగా భలే దొరికారు అని అంటాడు. వన్ ప్లస్ టూ వద్దా అంటూ నందు ఎంట్రీ ఇస్తుంది. ఐశ్వర్యను తీసుకొని వెళ్లమని ఇందుకి చెప్పి శశిని నందు చితకబాదుతుంది. బయటకు వెళ్తుంటే సెక్యూరిటీ వాళ్లు అడ్డు పడతారు. వాళ్లను కూడా నందు కొడుతుంది. ఇద్దరూ కలిసి ఐశ్వర్యను కాపాడి ఇంటికి తీసుకెళ్తారు.
ఐశ్వర్యను నిలదీసిన ఇంట్లో వాళ్లు
మరుసటి రోజు ఉదయం ఇంట్లో వాళ్లకు జరిగిన విషయం చెబుతారు ఇందు, నందు. కానీ ఐశ్వర్య మాత్రం ఏమీ జరగలేదన్నట్లుగా ఉదయాన్నే మెల్లగా కిందికి వస్తుంది. దీంతో ఇంట్లో వాళ్లందరూ ఆమెను నిలదీస్తారు. అపర్ణ, సుభాష్ తిడతారు. ఇందు, నందు కూడా గట్టిగా నిలదీయడంతో ఐశ్వర్య ఎదురు తిరుగుతుంది. నోటికొచ్చినట్లు మాట్లాడటంతో రాజు జోక్యం చేసుకుంటాడు.
నోరు పారేసుకున్న ఐశ్వర్య
కానీ రాజుపైనా ఐషూ నోరు పారేసుకుంటుంది. నువ్వు మూసుకో రా అంటూ దారుణంగా మాట్లాడుతుంది. హద్దు మీరుతున్నావ్ అని రాజు అనడంతో అపర్ణ జోక్యం చేసుకొని అది తెలియక మాట్లాడింది.. నువ్వు ఊరుకో బాబు అని సర్ది చెబుతుంది. అయినా ఐశ్వర్య మాత్రం వెనక్కి తగ్గదు. అసలు రాత్రి ఏం జరిగింది? మీరు ఏం చేశారు అని అడగడంతో జరిగిన విషయం చెబుతారు. కానీ ఐషూ మాత్రం నమ్మదు.
ఫ్రెండ్‌ను తీసుకొచ్చి ఐషూ నోరు మూయించిన నందు
దీంతో ఆమె ఫ్రెండ్ రేణును నందు తీసుకొస్తుంది. మేము చెబితే నువ్వు నమ్మవనే ముందే నీ ఫ్రెండ్ ని తీసుకొచ్చానని నందు అంటుంది. రేణు వచ్చి శశి గురించి అసలు నిజం చెబుతుంది. అయోమయంలో పడిన ఐశ్వర్య అప్పటికీ నిజాన్ని ఒప్పుకోదు.
శశిని కూడా ఇందు, నందు ఇంటికి తీసుకొస్తారు. అతడు వచ్చి వాళ్లపై రివర్స్ అవుతాడు. వాళ్లు నన్ను కొట్టి నిన్ను తీసుకొచ్చారని, తానేమీ చేయలేదని లేనిపోనివి చెబుతాడు. దీంతో ఐశ్వర్య తాను శశినే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెబుతుంది. బయటకు వెళ్లిన తర్వాత ఇందుకి శశి వార్నింగ్ ఇస్తాడు. నా ఇగోని దెబ్బ తీశారు.. నిన్ను, నీ ఫ్యామిలీని వదలను అని అంటాడు. ఇందు కూడా వెనక్కి తగ్గకుండా అది జరగని పని అని అంటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


