Brahmamudi August 17 Episode: బ్రహ్మముడి- తాత ఆపరేషన్ డబ్బులడిగిన ఐశ్వర్య- అక్క చెంప పగలగొట్టిన ఇందు-ఇంట్లో ఆస్తి గొడవలు

Brahmamudi Serial August 17th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 17వ ఎపిసోడ్‌‌లో చలపతి ఇంటికి రాజు, ఇందు వెళ్తారు. చలపతి చికెన్ కోసం బయటకు వెళ్తాడు. వెంకీని ఇందు నందు గురించి అడుగుతుంది. రాజు కష్టార్జితం డబ్బు ఐదు లక్షలు ఇస్తే చలపతి నమ్మడు. రాజును నానా మాటలు అంటాడు. ఇందును ఐషు 5 లక్షలు అడుగుతుంది.

Published on: Aug 17, 2026, 09:01:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చలపతి ఇంటికి రాజు, నందు వెళ్తారు. ఇంకా గాలికి తిరుగుతున్నాడేమో అని చలపతి సెటైర్లు వేస్తాడు. కొడుకు, కోడలు వచ్చారుగా చికెన్ తీసుకొస్తానని చలపతి వెళ్తాడు. రెండు కిలోలు తీసుకురమ్మని రాజు అంటాడు.

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 17వ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 17వ ఎపిసోడ్

నాన్న నమ్మడు

ఈ డబ్బు విషయం నేను చెబితే నాన్న నమ్మడని రాజు అంటే.. నేనున్నాగా అని ఇందు అంటుంది. వెంకీ డల్‌గా ఉండటం చూసిన ఇందు నందు చెప్పింది గుర్తు చేసుకుంటుంది. వెంకీతో ఏదో దీర్గంగా ఆలోచిస్తున్నావ్. నందు గురించా అని అడుగుతుంది ఇందు. తనగురించి కాదని వెంకీ అంటాడు. నందుతో నీకు ఏదైన గొడవ జరిగిందా, తనవల్ల ఏమైనా హర్ట్ అయ్యావా అని ఇందు అడుగుతుంది.

లేదని వెంకీ అంటే.. మరెందుకు తనకు దూరంగా ఉంటున్నావని ఇందు అడిగితే వెంకీ సైలెంట్‌గా ఉంటాడు. ఏం చెప్పాలో తెలియడం లేదా అని ఇందు అంటుంది. బిజీగా ఉన్నానని వెంకీ అంటాడు. నందు విషయంలో ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే నాకు చెప్పు. నేను సాల్వ్ చేస్తానని ఇందు అంటుంది. నేను నందును ప్రేమిస్తున్నానని వదినకు అర్థమైనట్లుంది. కానీ నేను బయటపడకూడదు వెంకీ అనుకుంటాడు.

నందును అవైడ్ చేయాలని ఉద్దేశం లేదని, ఎప్పుడు ఒకేలా ఉండలేం అని వెంకీ అంటాడు. అయినా ఇందు ప్రశ్నల వర్షం కురిపిస్తుంది ఇందు. దాంతో వెళ్లిపోడవం బెటర్ అని అర్జంట్‌గా మెయిల్ పెట్టాలని వెంకీ ఎస్కేప్ అవుతాడు. తర్వాత తల్లికి డబ్బులు ఇచ్చేందుకు ఇబ్బందిపడతాడు వెంకీ. ఇందు సెటైరికల్‌గా మోటివేట్ చేస్తుంది.

ఎవరిని మోసం చేయలేదమ్మా

తల్లి లక్ష్మికి రాజు డబ్బులు చూపిస్తాడు. ఇంత డబ్బు ఎక్కడదని తల్లి షాక్ అవుతుంది. భయపడుతుంది. ఎవరిని మోసం చేయలేదని రాజు అంటాడు. మీ నాన్నకు ఇవ్వు అని లక్ష్మీ అంటుంది. చలపతి గురించి గొప్పగా చెబుతుంది లక్ష్మీ. దాంతో బయట ఉన్న చలపతి దగ్గరికి వెళ్లిన రాజు డబ్బు గురించి చెప్పేందుకు ఇబ్బందిపడతాడు.

ఏంట్రా నసుగుతున్నావ్ అని చలపతి అంటాడు. అదే నాకు అర్థం కావట్లేదు నాన్న. నిజాయితీగా ఉంటే మాటలే రావట్లేదు. నేను ఇది చేశానని చెప్పలేకపోతున్నా అని రాజు అంటాడు. దానికి చలపతి షాక్ అవుతాడు. ఈరోజు నువ్వు నిజాయితీ అని పలికావంటే నాకు మూడింది, ఎక్కడ భూకంపం వస్తుందో అని భయంగా ఉందని చలపతి అంటాడు.

దాంతో టేబుల్‌పై ఐదు లక్షలు పెడతాడు రాజు. డబ్బు చూసి చలపతి షాక్ అవుతాడు. జీవితంలో నేను మొదటిసారి కష్టపడి సంపాదించిన డబ్బు నాన్నా. తీసుకోండని రాజు అంటాడు. రేయ్ ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావురా ఈ డబ్బు, ఎవరిని మోసం చేసి తీసుకొచ్చావ్ అని రాజుకు షాక్ ఇస్తాడు చలపతి. రాజు ఎంత చెప్పిన చలపతి వినడు.

తిన్నింటి వాసాలు లెక్కపెడతావనుకోలేదు

కొడుకును నానా మాటలు అంటాడు. ఆ ఇంటికి పంపించి తప్పు చేశాం. తిన్నింటి వాసాలు లెక్కపెడతావనుకోలేదని చలపతి అంటాడు. ఇందు చెప్పిన వినడు చలపతి. రాజు ఫీల్ అవుతాడు. ఏంట్రా ఎమోషనా. అమ్మా వీడు మీ కంపెనీలో ఎక్కడో ఓ దగ్గర ఈ డబ్బు నొక్కేసి ఉంటాడు. దీనికి నా పెంపకం అని అందరు నన్ను దెప్పిపొడుస్తారని చలపతి అంటాడు.

చలపతి నానా రచ్చ చేస్తాడు. నేను బతికి ఉండగానే నీ తండ్రిని చంపేశావు కదరా అని చలపతి అంటాడు. దాంతో ఇందు అరిచి నిజం చెబుతుంది. ఇదంతా రాజు కష్టార్జితం అని, స్వరాజ్ గ్రూప్ లాభాల్లో ఉందంటే కారణం మీ కొడుకు అని రాజు గొప్పగా చెబుతుంది ఇందు. తను నాకంటే ఎక్కువ కష్టపడుతున్నాడు. అందుకే నెల జీతం కింద నేనే ఐదు లక్షలు ఇచ్చానని ఇందు చెబుతుంది.

అసలు తన వ్యక్తిత్వాన్ని డబ్బుతో వెలకట్టలేం. నిజం చెప్పాలంటే ఇంతకుముందున్న రాజు వేరు ఇప్పుడున్న రాజు వేరు అని ఇందు అంటుంది. అవును నాన్న నేను మారిపోయాను అని, ఇందు మంచి దారిలో నడిపించిందని రాజు ఎమోషనల్ అవుతాడు. తండ్రిని కాదనకుండా డబ్బు తీసుకోమంటాడు రాజు. నా జీవితం గురించి ఎలాంటి బెంగ పెట్టుకోకండి. మీ సంతోషమే నా సంతోషం అని రాజు ఇంట్లోకి వెళ్తాడు.

బస్తీ వాళ్లను పిలిచి

వెంటే ఇందు వెళ్తుంది. డబ్బును చూస్తూ చలపతి అలాగే ఉండిపోతాడు. అంతా లోపలికి వెళ్తారు. చలపతి సంతోషంగా కన్నీళ్లు పెట్టుకుంటాడు. తర్వాత బస్తీ వాళ్లందరిని పిలిచి రాజు గురించి గొప్పగా చెబుతాడు. ఇదివరకు కంప్లైంట్స్ ఇచ్చినవాళ్లందరికి తన కొడుకు ప్రయోజకుడు అయ్యాడని చెబుతాడు చలపతి. స్వరాజ్ గ్రూప్ కంపెనీలో పని చేస్తున్నాడని అంటాడు చలపతి.

వాడు మహా అయితే సెక్యూరిటీ జాబ్ చేస్తుంటాడు. నెలకు పది వేలు వస్తుంటాయి. దానికే తెగ బిల్డప్ ఇస్తున్నావని హర్ష అంటాడు. సెక్యూరిటీ కాదురా కంపెనీనే వాడి భుజస్కందాలపై నడిపిస్తున్నాడురా. అందుకు వాడికి నెలకు జీతమెంతో తెలుసా.. ఐదు లక్షలు అని చలపతి డబ్బు చూపిస్తాడు. దాంతో బస్తీ వాళ్లంతా షాక్ అవుతారు.

ఇంట్లో ఆస్తి గొడవలు

తర్వాత ఇందును ఐశ్వర్య ఐదు లక్షలు అడుగుతుంది. తాతయ్య ఆపరేషన్ డబ్బులు తప్పా ఇంకేం లేవని ఇందు అంటే.. ఆ డబ్బులే ఇవ్వమని ఐశ్వర్య అంటుంది. ఆ ముసలోడికి ఆపరేషన్ చేయించాల్సిన అవసరం ఏముందని ఐశ్వర్య అంటే అక్క చెంపచెల్లుమనిపిస్తుంది ఇందు. తర్వాత ఐశ్వర్యకు ఇందుపై ఎక్కిస్తారు రేఖ, భ్రమరాంబ. ఆస్తిలో నీకు కూడా సమానమైన హక్కుందంటారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More