బ్రహ్మముడి జులై 10 ఎపిసోడ్: శత్రువు గాలి తీసిన రాజ్- తోక ముడిచిన సిద్దార్థ్- కావ్యకు యామిని శిక్ష- రాజ్‌కు కళావతి హగ్

బ్రహ్మముడి సీరియల్ జులై 10 ఎపిసోడ్‌లో కంపెనీ బోర్డ్ మీటింగ్‌లో సిద్ధార్థ్ అడిగిన ప్రశ్నలకు ధీటుగా రాజ్ సమాధానాలు చెబుతాడు. సిద్ధార్థ్ చేసిన ఇల్లీగల్ గోల్డ్ స్మగ్లింగ్ గురించి కూడా చెబుతాడు. దాంతో సిద్ధార్థ్ తోకముడుస్తాడు. అప్పును అరెస్ట్ చేయించానని, ఇదే నేను వేసే శిక్ష అని కావ్యతో యామిని చెబుతుంది.

Published on: Jul 10, 2025, 07:07:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఆఫీస్‌లో బోర్డ్ మీటింగ్ జరుగుతుంది. కంపెనీ లాభాల్లో లేదని, మీరు కంపెనీ ఎండీగా తొలగిపోవాలని సిద్ధార్థ్ అంటాడు. ఇప్పటివరకు అంతగా లాభాలు లేకపోవచ్చు. ఇప్పుడు నేను వచ్చానుగా, ఇంకేంటీ అని రాజ్ అంటాడు.

బ్రహ్మముడి సీరియల్‌ జూలై 10 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జూలై 10 ఎపిసోడ్

సెకండ్ క్లాస్ పిల్లాడు

మీ హెల్త్ కండిషన్ సరిగ్గా లేదని ఇంటర్నల్‌గా తెలిసింది. మీకు అసలు కంపెనీలో జరిగిన డీల్స్ గుర్తున్నాయా అని సిద్దార్థ్ అంటే స్వరాజ్ గ్రూప్ కంపెనీ స్టార్ట్ చేసిన తేది నుంచి, రాజ్ ఎండీగా చేపట్టిన రోజుల గురించి రాజ్ చెబుతాడు. అవి సెకండ్ క్లాస్ పిల్లాడు కూడా చెప్పగలడు అని సిద్ధార్థ్ అంటాడు.

దాంతో రాజ్ ఎండీగా ఉన్నప్పుడు పెంచిన లాభాల గురించి, సిద్ధార్థ్ వాళ్ల నాన్న 2018లో బోర్డ్ మెంబర్‌గా ఉన్నప్పుడు చేసిన ఇల్లీగల్ గోల్డ్ స్మగ్లింగ్ గురించి చెబుతాడు. దాంతో సిద్ధార్థ్ అవాక్కవుతుడు. ఇల్లీగల్ గోల్డ్ తీసుకొచ్చి కంపెనీలో పెట్టాలని చూస్తే బోర్డ్ మెంబర్‌గా తీసేస్తే వచ్చి కాళ్లు మా తాతయ్య కాళ్లు పట్టుకున్నాడు. దాంతో మళ్లీ బోర్డ్ మెంబర్‌గా ఉంచారు.

ఇప్పుడు ఆయన స్థానంలో నువ్వు ఉన్నావ్. ఈ విషయం నాకు, మీ నాన్నకు, మా తాతకు, నాకు మాత్రమే తెలుసు. ఇది కూడా సెకండ్ క్లాస్ పిల్లాడు చెబుతాడా. ఇక నువ్ తీసుకొచ్చిన 500 కోట్ల ప్రాజెక్ట్ బోగస్ కంపెనీ, పేపర్‌లో తప్పా నిజంగా లేదు అని రాజ్ అంటాడు. దాంతో అంతా షాక్ అయి సిద్ధార్థ్‌ను నిలదీస్తారు. మా అందరిని చీటింగ్ చేయాలని చూశావా అని అంటారు.

చీటింగ్ చేయాలని చూశాడు

మీ అందరిని కాదు. కళావతిని. తనను ఎండీ నుంచి తొలగించేందుకు చీటింగ్ చేయాలని చూశాడు అని రాజ్ అంటాడు. దాంతో సిద్ధార్థ్ ఏం చేయలేక ఆలోచించి.. మా నాన్న చేసింది నాకు తెలియదు. నేను కూడా అలాగే చేస్తున్నాను అనుకున్నాడు. కానీ, నాకు ఆ కంపెనీ గురించి పూర్తిగా తెలియదు. ఇప్పుడు రాజ్ ఎండీగా వచ్చాడు కాబట్టి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రాజ్ కంపెనీని లాభాల్లోకి తీసుకొస్తాడని నాకు నమ్మకం ఉందని సిద్ధార్థ్ అంటాడు.

మన సర్ సిద్ధార్థ్ గాలి తీశారని మేనేజర్‌తో శ్రుతి అంటుంది. ఇక అంతా లేచి రాజ్‌కు చప్పట్లు కొడతారు. రాజ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిన శత్రువు అయిన సిద్ధార్థ్ పక్కనే ఉన్న కావ్యతో రాజ్ గురించి తెలుసు గానీ నిన్ను అంచనా వేయలేకపోయాను అని తోకముడుస్తాడు. మరోవైపు నాకు తెలియని విషయాలు కూడా ఈయనకు ఎలా తేలిసాయని కావ్య అనుకుంటుంది.

కాసేపటికి మీకు అంతా గుర్తింది కదా. నా దగ్గర ఇంకెందుకు నటిస్తున్నారు. సిద్ధార్థ్ వాళ్ల నాన్న గురించి మీకెలా తెలుసు అని కావ్య అడుగుతుంది. మీరు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మీరే చెప్పి ఉంటారు అని రాజ్ అంటాడు. నేను చెప్పనవి కూడా ఈయనకు గుర్తొస్తున్నాయా అని ఆలోచిస్తుంది కావ్య. మరోవైపు సుభాష్‌కు కంపెనీ బోర్డ్ మీటింగ్, రాజ్ గురించి కాల్ వస్తుంది.

ఆశలన్నీ చచ్చిపోయాయి

బోర్డ్ మీటింగ్ సక్సెస్ అయిందని సుభాష్ ఇంట్లోవాళ్లకు సంతోషంగా చెబుతాడు. అదంతా తెలిసిన రుద్రాణి, రాహుల్ షాక్ అవుతారు. దీని గురించి తర్వాత ఆలోచిస్తారు. కంపెనీ యామిని చేతుల్లోకి వెళితే నా పెళ్లాం నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నా. కానీ, నా ఆశలన్నీ చచ్చిపోయాయని రాహుల్ కోపంగా వెళ్లిపోతాడు. మరోవైపు కావ్య చేతులు పట్టుకుని తన మనసులో మాట చెప్పాలని చూస్తాడు రాజ్.

కానీ, ఇంతలో కావ్యకు యామిని కాల్ చేస్తుంది. నా ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బీ ఉంది. నేను రాజును కాదు మారణహోమాన్ని. ప్లాన్ బీ సక్సెస్ అయ్యాను. నిన్ను కొట్టాల్సిన చోట కొట్టాను. అప్పుడు ఇప్పుడు సస్పెండ్, అరెస్ట్ అయింది. లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయేలా నేనే చేశాను. ఇక జీవితంలో నీ చెల్లెలు పోలీస్ డ్రెస్ వేసుకోదు. ఇదే నేను నీకు వేస్తున్న శిక్ష. మొదటిసారి నీకు ఓటమి అంటే ఎలా ఉంటుందో పరిచయం చేశాను. ఒంటరితనమే మిగులుతుంది అని యామిని చెబుతుంది.

తర్వాత రాజ్‌కు అప్పు అరెస్ట్ అయిందని చెప్పి కావ్య వెళ్లిపోతూ ఆగుతుంది. తిరిగి వచ్చి రాజ్‌ను మనసారా హత్తుకుని కావ్య వెళ్లిపోతుంది. అంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More