బ్రహ్మముడి జులై 11 ఎపిసోడ్: కోర్టుకు అప్పు- ఏసీబీ ఆఫీసర్ షాక్- యామినిపై రివర్స్ అయిన రాజ్- మనవరాలి ఇంటికి ఇందిరాదేవి!

బ్రహ్మముడి సీరియల్ జులై 11 ఎపిసోడ్‌లో అప్పుకు కావ్య బెయిల్ తీసుకొస్తుంది. అప్పు గురించి తెలుసుకున్న ఏసీబీ ఆఫీసర్ షాక్ అవుతాడు. కావ్య కావాలనే నీ ప్రపోజల్ నుంచి తప్పించుకుంటుంది అని అన్న యామినిపై రాజ్ సీరియస్ అవుతాడు. అప్పును నిర్దోషిగా నిరూపిస్తానని ఇంట్లోవాళ్లతో చెబుతుంది కావ్య.

Published on: Jul 11, 2025 7:50 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో యామిని ట్రాప్‌లో పడిన అప్పు లంచం తీసుకుంటున్నట్లుగా ఏసీబీకి దొరుకుతుంది. దాంతో పోలీస్ యూనిఫామ్ తీసి బాధగా ఇస్తుంది. ఇదంతా లంచం తీసుకోకముందు ఉండాలి అని ఏసీబీ ఆఫీసర్ అంటాడు.

బ్రహ్మముడి సీరియల్‌ జూలై 11 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జూలై 11 ఎపిసోడ్

బెయిల్ తీసుకొచ్చిన కావ్య

నిజమనేది బయటపడినప్పుడు ఈ యూనిఫామ్ నా దగ్గరికి వస్తుందని అప్పు అంటుంది. ఎఫ్ఐఆర్ పూర్తి అయిందని కానిస్టేబుల్ శేషు చెబితే ఇంకెందుకు సెల్‌లో పెట్టమని ఆఫీసర్ అంటాడు. దాంతో కానిస్టేబుల్ ఇబ్బందిపడతాడు. దాంతో అప్పునే సెల్‌లోకి వెళ్తుంది. ఇంతలో కావ్య వచ్చి బెయిల్ తీసుకొచ్చినట్లు చెబుతుంది.

లాయర్ బెయిల్ ఇస్తాడు. దాంతో షాక్ అయిన ఆఫీసర్ బెయిల్ ఎలా వచ్చింది. ఇలాంటి కేసులో రాదుగా అని అంటాడు. సమాజంలో మంచి పేరు ఉండి. గతంలో నేర చరిత్ర లేకుంటే బెయిల్ వస్తుందని లాయర్ అంటాడు. అంతగొప్ప బ్యాక్‌గ్రౌండ్ ఉందా అని ఏసీబీ ఆఫీసర్ అంటే నా చెల్లెలు దుగ్గిరాల ఇంటి కోడలు అని కావ్య చెబుతుంది.

దాంతో మరింత షాక్ అయిన ఏసీపీ ఆఫీసర్ అంత స్టేటస్ ఉండి చీప్‌గా లంచం తీసుకోవడం ఏంటీ అని అంటాడు. నిజనిజాలు కోర్టులో తెలుస్తాయి. మీరు చేసిన తప్పేంటే ప్రూవ్ చేయాలిగా అని అప్పును కావ్య తీసుకెళ్తుంది. ఆవిడకు నిజంగా అంత సీన్ ఉందా అని కానిస్టేబుల్‌తో ఏసీపీ ఆఫీసర్ అంటాడు.

మేమెలా నమ్ముతాం సార్

మీరు పట్టుకున్నారు, చెప్పారు కాబట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. కోట్లల్లో ఆస్తి ఉన్న అప్పు మేడమ్ కేవలం పోలీస్ జాబ్‌పై ఇష్టంతో వచ్చారు. అలాంటి ఆవిడ తప్పు చేసిందంటే మేమెలా నమ్ముతాం సార్ అని కానిస్టేబుల్ శేషు అంటాడు.

సారీ అప్పు ఇదంతా నా వల్లే జరిగింది. నా మీద జరిగిన అన్యాయం చేస్తుందని నువ్ యామిని మీదకు వెళ్తే నా మీద కోపంతో తను నీ జాబ్ పోయేలా చేసిందని కావ్య అంటుంది. నువ్ చెప్పిన కూడా నేనే జాగ్రత్తగా లేను. ఇద్దరు వెధవలు చెప్పిన కట్టుకథను నమ్మాను. ఇది నాకు ఒక లెస్సన్ లాంటిది. పోలీస్ అంటే ఎవరిని నమ్మకూడదు అని ఇవాళ తెలుసుకున్నాను. ఆ యామినిని వదలకూడదు అని అప్పు అంటుంది.

యామిని ఇదంతా చేసినట్పు ప్రూవ్ చేయాలని కావ్య అంటుంది. మరోవైపు రాజ్ ఇంట్లోకి వస్తే యామిని కావ్య లవ్ ప్రపోజల్ గురించి అడుగుతుంది. అప్పు అరెస్ట్ గురించి చెబుతాడు రాజ్. అప్పు అరెస్ట్ అవడం నాకు నమ్మబుద్ధి కావట్లేదు. కావ్య కావాలనే నీ నుంచి తప్పించుకుంటున్నట్లుంది. ఇప్పటికీ రెండుసార్లు జరిగింది అని యామిని చెబుతుంది.

రివర్స్ అయిన రాజ్

దాంతో యామినిపై రివర్స్ అవుతాడు రాజ్. తన గురించి నీకేం తెలుసు. ఇదంతా నా ముందే జరిగింది. తనకు తప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఎదుటి వాళ్ల కష్టాన్ని చూసి హేళన చేయకూడదని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు రాజ్. ఇంతలో వైదేహి వచ్చి అన్నీ తెలిసి అల్లుడిగారిని అడిగి ఎందుకు తిట్లు తింటున్నావ్ అని అంటుంది.

ఫ్యూచర్‌లో మనం చేసే విషం ఇంజెక్ట్ ఎక్కాలంటే ఇలాంటివి చేయడం, తిట్లు తినడం తప్పదు. మళ్లీ కావ్యకు ప్రపోజ్ చేస్తాడు. అవి క్యాన్సిల్ అయ్యేలా చేస్తాం. అది అర్థం కానీ బావ అయోమయంలో ఉంటాడు. అప్పుడు మనం విడగొట్టడం కాదు వాళ్లే విడిపోతారు అని యామిని అంటుంది. దాంతో తల్లి మురిసిపోతుంది.

మరోవైపు అప్పు లంచం తీసుకుంటూ దొరికిపోయిందని ఇంట్లో రచ్చ చేస్తుంది రుద్రాణి. ఉద్యోగం నుంచి తీసేశారని, కోర్టు నుంచి జైలుకు వెళ్తుందని రుద్రాణి అంటుంది. దాంతో అప్పును ఇందుకే జాబ్ చేయొద్దన్నానని ధాన్యలక్ష్మీ రెచ్చిపోతుంది. ఇంత ఆస్తి ఉండి చీప్‌గా లంచం తీసుకోవడం ఏంటని రుద్రాణి అంటుంది.

కొంతమంది ఇరికించారు

ఇంతలో అప్పు, కావ్య వస్తారు. రుద్రాణి అడిగితే కావ్య వారిస్తుంది. దాంతో ధాన్యలక్ష్మీ అడుగుతుంది. నా చెల్లెలు ఏ తప్పు చేయలేదు. కొంతమంది ఇరికించారు అని కావ్య అంటుంది. తప్పు చేశారా లేదా అన్నది కాదు ఇంటి పరువు పోడానికి అవకాశం వచ్చిందిగా. ఆడపిల్ల కాబట్టి ఇరికించారు. అందుకే ఎలాంటి జాబ్‌లు చేయకూడదు అని ధాన్యలక్ష్మీ అంటుంది.

అప్పు నిర్దోషి అని ఎలా నిరూపిస్తావ్ అని రుద్రాణి అంటుంది. ఒకవేళ సాక్ష్యం దొరక్క అప్పు జైలుకు వెళ్తే దుగ్గిరాల ఇంటి పరువు పోతుంది. అప్పుడు ఏం చేస్తావని ధాన్యలక్ష్మీ నిలదీస్తుంది. బావగారు మీరే ఏదోటి చేసి కేసు నుంచి తప్పించండి. ఈ జాబ్‌లు వద్దని ఇంట్లో కూర్చొపెట్టండని ధాన్యలక్ష్మీ అంటుంది. అందరి ముందు నా చెల్లెలు నిర్దోషి అని నిరూపిస్తాను. అలా కాకుంటే నా చెల్లెలు మీరు కోరిన కోడలిగా ఇంట్లోనే ఉంటుందని కావ్య అంటుంది.

సరే, రెండు రోజులే కదా ఎదురుచూస్తాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. అప్పును స్వప్న ఓదారుస్తుంది. తర్వాత రేవతిఇంటికి ఇందిరాదేవి వెళ్తుంది. అంటే, మనవరాలి ఇంటికి ఇందిరాదేవి వెళ్లింది. నానమ్మా అంటూ ప్రేమగా హగ్ చేసుకుంటుంది రేవతి. అంతలోనే రాజ్, కావ్య వస్తారు. అది తెలిసి షాక్ అవుతారు రేవతి, ఇందిరాదేవి.