బ్రహ్మముడి జులై 12 ఎపిసోడ్: అప్పును కాపాడేందుకు రుద్రాణి ఐడియా- అత్తారింటికి దారేది సీన్- తల్లీకొడుకులను కొట్టిన రాజ్!
బ్రహ్మముడి సీరియల్ జులై 12 ఎపిసోడ్‌లో ఏడుస్తున్న అప్పును కల్యాణ్ ఓదార్చుతాడు. నువ్వేంటో అమ్మకు అర్థమైంది. త్వరలోనే నిన్ను కోడలిగా ఒప్పుకుంటుందని కల్యాణ్ చెబుతాడు. ఇరికించిన శీనును పట్టుకునేందుకు రాజ్, కావ్య మాట్లాడుతుంటే అప్పును కాపాడేందుకు రుద్రాణి ఐడియా ఇస్తుంది. అత్తారింటికి దారేది సీన్ అవుతుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య, అప్పు గురించి ఆలోచించిన రాజ్ కళావతికి కాల్ చేస్తాడు. ఏం జరిగిందని అడుగుతాడు. బెయిల్ మీద తీసుకొచ్చాను. కానీ, కేసులో నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు అని కేసు గురించి చెప్పి కావాలనే ఇరికించారు అని చెబుతుంది కావ్య. రెండ్రోజుల్లో అప్పును కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ఈలోపు తప్పు చేసినవాళ్లను పట్టుకుని నిజం నిరూపించాలి. లేకుంటే అప్పు జాబ్ పోవడమే కాదు అరెస్ట్ కూడా అవుతుందని కావ్య చెబుతుంది.

యామిని గురించి తెలియాలిగా
ఇద్దరం కలిసి వాళ్లు ఎవరో పట్టుకుందాం. అప్పును కేసులో ఇరికించింది ఎవరైనా సరే వదిలేది లేదని రాజ్ కాల్ కట్ చేస్తాడు. ఇంతలో అపర్ణ, ఇందిరాదేవి ఏమైందని అడిగితే.. రాజ్ హెల్ప్ చేస్తానంటున్నారని, నేనే వద్దంటున్నాని కావ్య చెబుతుంది. ఎందుకని వాళ్లంటే అప్పుని కేసులో ఇరికించింది యామినినే, సిద్ధార్థ్‌ను రెచ్చగొట్టింది యామినినే, ఆయన వస్తే ఆయనకు నిజాలు తెలుస్తాయని భయపడుతున్నానని కావ్య అంటుంది.
దాని పాపాలు పండే టైమ్ వచ్చింది. అందుకే ఇలాంటివన్నీ చేస్తుంది. రాజ్ హెల్ప్ తీసుకో ఏం కాదు. యామిని ఏంటో నా మనవడికి కూడా తెలియని అని ఇందిరాదేవి అంటుంది. మరోవైపు అత్త అన్న మాటలకు అప్పు ఏడుస్తూ ఉంటుంది. కల్యాణ్ రావడంతో హగ్ చేసుకుంటుంది అప్పు. అత్త దగ్గర కల్యాణ్ తనకు సపోర్ట్ చేయడంపై మాట్లాడిన అప్పు పోయిన ప్రాణం తిరిగివచ్చినట్లు అయిందని ఎమోషనల్‌గా చెబుతుంది.
నిన్ను కోడలిగా ఒప్పుకుంటుంది
అమ్మకు కేవలం నువ్ నాతో ఇంట్లో ఉండాలని మాత్రమే. కానీ, నువ్వు ఏంటో అమ్మకు బాగా తెలిసిపోయింది. అందుకే నిన్ను తప్పు పట్టలేదు. త్వరలోనే నిన్ను కోడలిగా మా అమ్మ యాక్సెప్ట్ చేస్తుందనిపిస్తుందని కల్యాణ్ అంటాడు. తర్వాత మరుసటి రోజు అప్పు లంచం తీసుకోలేదన్న విషయం శీను వచ్చి చెబితే తప్పా కోర్టు నమ్మదు అని కల్యాణ్ అంటాడు.
ఇరికించినవాడే ఎలా చెబుతాడు అని స్వప్న అంటుంది. ముందు వాడిని పట్టుకోవాలని కావ్య అంటుంది. ఇంతలో రాజ్ వచ్చి వాడి వెనుక కచ్చితంగా ఎవరో ఉన్నారు. అలాంటి వాళ్లను కచ్చితంగా శిక్షించాలని అంటాడు. ముందు వాడిని పట్టుకుందాం, వాడి వెనుకాల వాళ్ల గురించి తర్వాత ఆలోచిద్దాం అని కావ్య అంటే.. మీరేంటీ కొత్తగా మాట్లాడుతున్నారు. మీలో ఏదో భయం కనిపిస్తుందని రాజ్ అంటాడు.
అప్పు వాడి అడ్రస్ చెప్పి నేను, కావ్య వెళ్లి కలుస్తాం అని రాజ్ అంటాడు. ఇంతలో రుద్రాణి వచ్చి వాడిని పట్టుకోగానే నిజం చెబుతాడా అని పుల్ల వేస్తుంది. మీ ప్రయత్నం మానుకోండని చెబుతుంది. ఇంకా కోర్టు ముందు అప్పుకు సమస్య అవుతుంది. దానికి బదులు నేరం ఒప్పుకుంటే శిక్ష తక్కువ పడుతుంది. ఏదో ఒకరోజు మన ఇంటికి వస్తుందని రుద్రాణి అంటుంది.
కేసు గురించి ఏమైనా తెలుసా
దాంతో అంతా షాక్ అవుతారు. అసలు ఈ కేసు గురించి మీకు ఏమైనా తెలుసా. వాడు ఎలా ఏసీబీని రప్పించాడు, అప్పును ఎలా ఇరికించాడు, కొంచెం అయినా తెలుసా అని రుద్రాణి అంటుంది. సూపర్ ఆంటీ, అప్పును కాపాడటానికి భలే ఐడియా ఇచ్చారు అని రాజ్ అంటాడు. అసలు ఏం జరిగిందో ఇప్పుడే తెలుసుకుందాం. సీన్ రీ క్రియేట్ చేద్దాం. ఇదే పోలీస్ స్టేషన్. అప్పుడు అందరికి ఏం జరిగిందో తెలుస్తుందని రాజ్ అంటాడు.
మమ్మీ వీళ్లు ప్లాన్ చేసి మనల్ని ఇరికించట్లేదుగా అని రాహుల్ అంటే వీళ్లకు అంత సీన్ లేదు. వీళ్లు ఆడిన ఆట ఆడి ఆ శీనును కలవకుండా చేస్తే అప్పుకు శిక్ష పడేలా చేయొచ్చు అని రుద్రాణి అంటుంది. ఈ డ్రామాకు అప్పు అమాయకురాలు అనే టైటిల్ పెడతాడు రాజ్. శీను, అతని ఫ్రెండ్‌గా రాహుల్, రుద్రాణి వస్తారు. ఏసీబీ ఆఫీసర్స్‌గా ఇందిరాదేవి, అపర్ణ వస్తారు.
అప్పును అరెస్ట్ చేయమని రుద్రాణి, రాహుల్ అంటే ఇదంతా ప్లాన్ చేసింది ఎవరు అని ఇందిరాదేవి, అపర్ణ అడుగుతారు. దాంతో మేమే అని రాహుల్, రుద్రాణి అనడంతో అంతా వచ్చి వాళ్లిద్దరిని కొడతారు. దాంతో వాళ్లిద్దరు వేరే క్యారెక్టర్స్ చేస్తామని చెబుతారు.
అత్తారింటికి దారేది సీన్
తర్వాత ఏసీబీ ఆఫీసర్స్‌లో రాహుల్, రుద్రాణి చేస్తారు. అయినా వారిని కొడతారు. ఇలా అత్తారింటికి దారేది సినిమాలో అహల్య అమాయకురాలు సీన్‌లా చేస్తారు. తల్లీకొడుకులను ఇంట్లోవాళ్లతోపాటు రాజ్ కొడతాడు. రుద్రాణి, రాహుల్ ఒళ్లంతా హూనం అవుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



