బ్రహ్మముడి జులై 14 ఎపిసోడ్: రాజ్ శీనుకు గొడవ- మనవరాలి ఇంటికి ఇందిరాదేవి- కూతురు కొడుకును కలిసిన అపర్ణ-మనవడితో అమ్మమ్మ ఆట
బ్రహ్మముడి సీరియల్ జులై 14 ఎపిసోడ్‌లో అప్పును ఇరికించిన శీను కోసం రాజ్, కావ్య వెళ్తుండగా అతనితోనే యాక్సిడెంట్ అవుతుంది. దాంతో శీనుతో రాజ్ గొడవ పడతాడు. రేవతి వాళ్ల బంధువులు అని తెలిసి శీను వెళ్లిపోతాడు. కూతురు కొడుకు స్వరాజ్‌ను కలుస్తుంది అపర్ణ. మనవడిని గారాబం చేస్తూ ఆడుతుంది అమ్మమ్మ.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో అత్తారింటికి దారేది సినిమా సీన్‌లోలాగా రుద్రాణి, రాహుల్ ఎలాంటి పాత్రలు చేసినా ఏదో ఒక కారణం చెప్పి వాళ్లను కొడతారు. తర్వాత రాహుల్, రుద్రాణి కానిస్టేబుల్ వేషం వేస్తారు. అయినా కూడా ఇంట్లోవాళ్లు కొడతారు. ఆంటీ ఎలా ఉందని రాజ్ అంటాడు.

డల్‌గా అప్పు
నిజం తెలుసుకోడానికి ప్రయత్నించమంటే మమ్మల్ని ఇంతలా బలి చేయాలా అని పారిపోతారు రాహుల్, రుద్రాణి. అప్పు డల్‌గా ఉండటం చూసి ఓదార్చుతారు. శీను గాడి అడ్రస్‌ను రాజ్ అడిగితే రెహమత్ నగర్ అని అప్పు చెబుతుంది. దాంతో రేవతి అక్కవాళ్లు అక్కడే ఉంటారుగా. వాడి గురించి అడిగితే తెలుస్తుందిగా అని రాజ్ అంటాడు.
దాంతో రాజ్, కావ్య శీనును వెతకడానికి వెళ్తారు. మరోవైపు ఒళ్లు నొప్పులతా బాధపడుతారు రుద్రాణి, రాహుల్. నిన్ను చంపేయాలని ఉంది మామ్. తగుదునమ్మా అని వెళ్లి తన్నించుకునేలా చేశావ్ అని రాహుల్ అంటాడు. వాళ్లను కచ్చితంగా దెబ్బ కొడతాను చూడు. దెబ్బకు దెబ్బ అంటే ఏంటో చూపిస్తా అని రుద్రాణి అంటుంది. యామినికి కాల్ చేసి శీను కోసం కావ్య, రాజ్ వెళ్లారని రుద్రాణి చెబుతుంది.
ఆ శీను గాడు దొరికితే నువ్వు జైలుకు వెళ్తావ్. వాళ్లకు వాడు దొరకకూడదు అని రుద్రాణి చెబుతుంది. దాంతో టెన్షన్ పడిన యామిని శీనుకు కాల్ చేసి అప్పుకు శిక్ష పడేంతవరకు నా మనిషి రంగా దగ్గర ఉండమని యామిని చెబుతుంది. దాంతో సరే అని శీను కాల్ కట్ చేసేసరికి వెనుకే రేవతి అంటుంది. దాంతో శీను కంగారుపడిపోతాడు. అమ్మ ఎక్కడికి వెళ్లిందని రేవతి అడిగితే మార్కెట్‌కు అని చెప్పి వెళ్లిపోతాడు శీను.
భయపడిన ఇందిరాదేవి
మరోవైపు ఎవరికి కనిపించకుండా ఇందిరాదేవి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే స్వప్న అడుగుతుంది. ఇంతలో అపర్ణ వచ్చి అడుగుతుంది. అబ్బా ఎవరి కంట్లో పడకూడదు అనుకున్నానో దానికంట్లోనే పడ్డాను అని భయపడుతుంది ఇందిరాదేవి. నేను బయటకు వెళ్తున్నాను కలిసి కారులో వెళ్దామని అపర్ణ అంటే.. ఇందిరాదేవి కోప్పడుతుంది.
నీ దారి నా దారి నాది అని ఇందిరాదేవి వెళ్లిపోతుంది. ఎప్పుడు లేనిది కొత్తగా బిహేవ్ చేస్తుందని అపర్ణ అంటుంది. కారులో వెళ్తూ ఆ శీను గాడిని అడ్డంపెట్టుకుని అప్పును కావాలనే ఎవరో ఇరికించారు. అది కూడా మీకు బాగా తెలిసినవాళ్లే అనుకుంటా. అప్పు మీద పగ తీర్చుకోడానికి ఎవరైనా శత్రువులెవరైనా ఉన్నారా అని రాజ్ అంటే అది నాకు ఎలా తెలుస్తుందని కావ్య అంటుంది.
ఇంతలో శీను ఎదురుగా బైక్ మీద వస్తాడు. దాంతో యాక్సిడెంట్ అవుతుంది. శీను, రాజ్ ఇద్దరు గొడవపడతారు. తర్వాత సర్ మీరు మా రేవతి అక్క ఇంటికి వచ్చినవాళ్లు కదా అని సారీ సర్ మీరు అని తెలియక వాగాను. అక్కకు తెలిస్తే నన్ను చంపేస్తుంది. నాదే రాంగ్ రూట్. నాదే తప్పు అని భయపడి వెళ్లిపోతాడు శీను. రాజ్‌కు సర్ది చెప్పి తీసుకెళ్తుంది కావ్య.
ఎన్నోసార్లు అడిగాను
మరోవైపు రేవతి ఇంటికి ఇందిరాదేవి వెళ్తుంది. నానమ్మ అంటూ ఇందిరాదేవిని హత్తుకుంటుంది రేవతి. ఎన్నోసార్లు నీ గురించి మీ అమ్మను అడిగాను. ద్రోహం చేశావని కోపంగా ఉందని ఇందిరాదేవి అంటుంది. నిజమే, మేము చేసింది ద్రోహమే. ఆరోజు నేను ఆ నిర్ణయం తీసుకోకుంటే రేవతి ఆ ఇంట్లో మహారాణిలా ఉండేది అని రేవతి భర్త అంటాడు.
మరోవైపు అపర్ణ కారు డోర్ తీస్తుంటే రేవతి కొడుకు స్వరాజ్‌కు తగిలి కిందపడిపోతాడు. చేతిలో ఐస్‌క్రీమ పడిపోతుంది. అపర్ణ సారీ చెబితే ఐస్‌క్రీమ్ తిరిగి వస్తుందా, ఐస్‌క్రీమ్ కొనివ్వండి అని పిల్లాడు అంటే నీ పేరేంటని అపర్ణ అడుగుతుంది. రాజ్.. స్వరాజ్ అని అపర్ణ మనవడు చెబుతాడు.
అమ్మమ్మగా అపర్ణ
మరోవైపు వాడికి అమ్మమ్మ ఉందని తెలియాలి, వాన్ని గారాబం చేయాలని నానమ్మతో కొడుకు గురించి రేవతి చెబుతుంది. రేవతి చెప్పినట్లుగానే మనవడు స్వరాజ్‌ను అమ్మమ్మ అయిన అపర్ణ గారాబం చేస్తూ ఆడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



