బ్రహ్మముడి జులై 17 ఎపిసోడ్: ఇంటి డ్రైవర్‌ను పెళ్లాడిన అపర్ణ కూతురు- సుభాష్ విశ్వరూపం-కావ్యకు రేవతి కథ చెప్పిన ఇందిరాదేవి

బ్రహ్మముడి సీరియల్ జులై 17 ఎపిసోడ్‌లో రేవతి ఎవరు అని ఇందిరాదేవిని కావ్య అడుగుతుంది. దాంతో రాజ్ అక్క రేవతి గురించి కావ్యకు ఇందిరాదేవి చెబుతుంది. రేవతి ఇంటి డ్రైవర్ అయిన జగదీష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని వస్తుంది. దాంతో సుభాష్, అపర్ణ విశ్వరూపం చూపించి ఇంట్లోంచి గెంటేస్తారు.

Published on: Jul 17, 2025 7:22 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రేవతి గురించి అత్తయ్యను అడుగుతానని ఇందిరాదేవితో కావ్య అంటుంది. దాంతో కొంపలు అంటుకుంటాయని ఇందిరాదేవి అంటుంది. తెలిసి తెలియని చేసిన ఆ పొరపాటుకి 15 ఏళ్ల నుంచి బాధపడుతూనే ఉంది. ఆ రేవతి అపర్ణ కూతురు. నా మనవడికి అక్క, నీకు సొంత వదిన. అకారణంగా అన్యాయం అయిపోయిన నా మనవరాలు అని ఇందిరాదేవి అసలు సీక్రెట్ చెబుతుంది.

బ్రహ్మముడి సీరియల్‌ జూలై 17 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జూలై 17 ఎపిసోడ్

రాజ్ కంటే గారాబంగా

రేవతి గారు ఈ ఇంటి ఆడపడుచా. అలాంటి అమ్మాయిని ఎందుకు వదులుకున్నారు. అసలు ఏం జరిగింది అని షాక్‌తో అడుగుతుంది కావ్య. దాంతో జరిగింది నిజం చెబుతుంది ఇందిరాదేవి. ఇంట్లో రేవతిని అల్లారుముద్దుగా చూసుకోవడం, రాజ్ కంటే ఎక్కువగా గారాబం చేయడం చెబుతుంది ఇందిరాదేవి. మహాలక్ష్మీ పుట్టిందని నెత్తిన పెట్టుకుని చూసుకున్నారని చెబుతుంది.

పెళ్లి గురించి కూడా ఆలోచించడం, దగ్గరి బంధువులతో చేస్తే కళ్లముందే ఉంటుందని సుభాష్ ఆలోచించాడు. రేవతి అమ్మనాన్నల అడుగుజాడల్లో నడుస్తుందని అనుకున్నాం. కానీ, రేవతి మొదటిసారి తప్పటడుగు వేసిందని చెబుతుంది ఇందిరాదేవి. అయితే, రేవతి ప్రేమించి పెళ్లి చేసుకున్న జగదీష్ దుగ్గిరాల ఇంటి డ్రైవర్. కాలేజ్‌కు వెళ్తూ జగదీష్‌తో రేవతి ప్రేమాయణం నడిపిస్తుంది.

నేనంటే అమ్మనాన్నలకు చాలా ఇష్టం. నేను చెబితే మన పెళ్లికి ఏ అడ్డు చెప్పరు అని డ్రైవర్ జగదీష్‌ను హగ్ చేసుకుంటుంది రేవతి. ఒకరోజు రేవతి అన్ని రోజులు మా కళ్లు గప్పి చేసింది బయటపడింది. ఇంటికి డ్రైవర్‌ను పెళ్లి చేసుకుని వచ్చిందని ఇందిరాదేవి చెబుతుంది. ఇది కదా అసలైన ట్విస్ట్ అంటే, ఇప్పుడు కూడా రేవతికి మా అన్నయ్య ఆస్తి ఇస్తాడో చూస్తాను అని రుద్రాణి అనుకుంటుంది.

సుభాష్ విశ్వరూపం

తాను డ్రైవర్‌ను పెళ్లి చేసుకుని రావడంపై గొప్పగా చెబుతుంది రేవతి. కానీ, ఇంట్లోవాళ్లంతా తిడతారు. ఈయనతో జీవితం హాయిగా ఉంటుందని పెళ్లి చేసుకున్నా. మీరు అర్థం చేసుకోకపోయినా అమ్మనాన్న బాగా అర్థం చేసుకుంటారని రేవతి అంటుంది. దాంతో కోపంగా డ్రైవర్‌ను లాగిపెట్టి కొడతాడు సుభాష్. అంటే, అల్లుడిని సుభాష్ కొడతాడు.

మీ తల్లిదండ్రుల ఆరోగ్యానికి లక్షలు ఖర్చుపెట్టాను. అడిగినప్పుడల్లా జీతం చెంచాను. దానికి నువ్ చేసింది ఇదా అని తెగ కొడుతూనే ఉంటాడు సుభాష్. రేవతి ఆపితే.. నోర్మూయ్. పరువు పోయే పనులు చేస్తే చంపి పడేస్తా అని వార్నింగ్ ఇస్తాడు సుభాష్. నువ్ నా కూతురు కాలి గూటికి కూడా పనికి రావు అని సుభాష్ విశ్వరూపం చూపిస్తాడు. మధ్యలో రుద్రాణి దూరి మరింత ఆజ్యం పోస్తుంది.

ఈ పెళ్లి చెల్లదు. నువ్ కట్టినతాళి తాళే కాదు అని మళ్లీ సుభాష్ కొట్టబోతుంటే రేవతి తండ్రి చేయి పట్టుకుని ఆపుతుంది. ఇన్నాళ్లు నా మీద చూపించిన ప్రేమ నిజం అనుకున్నా. నా ప్రేమను అర్థం చేసుకుంటారనుకున్నా. కానీ, అందరిలాగే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అని రేవతి అంటే అపర్ణ వచ్చి కూతురిని కొడుతుంది. ఏంటే తండ్రిని ఎదిరిస్తున్నావ్. అన్ని నాన్నను అడిగి చేసిన నువ్వు పెళ్లి విషయంలో పరాయివాడయ్యాడా అని సుభాష్ గొప్పదనం గురించి చెబుతుంది అపర్ణ.

నీకు ఇంట్లో ఉండే హక్కే లేదు

నన్ను అనండి, నా భర్తను అనే హక్కు నీకు లేదు నాన్నకు కూడా లేదు అని రేవతి అంటే మళ్లీ కొడుతుంది అపర్ణ. హక్కుల గురించి మాట్లాడితే అసలు నీకు ఇంట్లో ఉండే హక్కే లేదు. ఈరోజు నుంచి దీనికి ఇంటికి సంబంధం లేదు. ఎలాంటి బంధం లేదు. వీళ్లతో ఎవరు మాట్లాడిన వాళ్లు కూడా ఈ ఇంటితో బంధం కోల్పోతారు. నాకు పుట్టిన కూతురు ఈ క్షణమే చచ్చిపోయినట్లు అనుకుంటాను. వెళ్లిపోండి అంటూ రేవతి, అల్లుడుని బయటకు గెంటేస్తుంది అపర్ణ.

నేను ప్రాణాలతో ఉన్నంతవరకు నువ్ ఈ ఇంటి గడప తొక్కడానికి వీళ్లేదు. ఎవరైనా నీ అమ్మనాన్నల గురించి అడిగితే చనిపోయారని చెప్పు అని అపర్ణ అంటుంది. మరోవైపు రాజ్‌కు శీను గురించి రేవతి చెప్పడంతో తీసుకొస్తానని రాజ్ వెళ్లిపోతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.