బ్రహ్మముడి జులై 19 ఎపిసోడ్: కోర్టు బోనులో కావ్య- మందలించిన జడ్జ్- శీను అడ్రస్ కనిపెట్టిన రాజ్- కావ్యకు యామిని ఆఫర్!
బ్రహ్మముడి సీరియల్ జులై 19 ఎపిసోడ్‌లో రేవతికి కాల్ చేసి శీనుగాడు కచ్చితంగా వాళ్ల తల్లికి కచ్చితంగా కాల్ చేస్తాడు. ఇవాళ రాత్రి కనిపెట్టి నాకు అడ్రస్ చెప్పు అని అంటాడు. రేవతి అలాగే చేస్తుంది. మరుసటి రోజు ఉదయం రాజ్ వచ్చి అడ్రస్ కనిపెడతాడు. కోర్టులో కావ్యను విచారించాలని పీపీ లాయర్ అంటాడు.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శీనుగాడు వాళ్ల అమ్మ కోసం కచ్చితంగా కాల్ చేస్తాడు. అప్పుడు వాడి సిగ్నల్ కనిపెట్టి అప్పును కాపాడవచ్చు అని రాజ్ అనుకుని రేవతికి కాల్ చేసి సహాయం అడుగుతాడు. శీను కచ్చితంగా వాళ్ల అమ్మకు కాల్ చేస్తాడు. ఈ ఒక్కరోజు వాళ్ల అమ్మతో ఉన్నావంటే వాడు కాల్ చేసింది తెలుస్తుంది. అప్పుడు నాకు చెప్పావంటే వాడిని పట్టుకోవచ్చు అని రాజ్ అంటాడు.
బ్రహ్మముడి సీరియల్ జూలై 19 ఎపిసోడ్
అప్పు-కల్యాణ్ టెన్షన్
సరే అని రేవతి అంటాడు. మరుసటి రోజు ఉదయం కోర్టులో రాజ్, కావ్య, అప్పు, కల్యాణ్ కోర్ట్ హియరింగ్ ఉందని టెన్షన్ పడతారు. రేవతికి కాల్ చేసింది చెబుతాడు రాజ్. ఇంతలో రేవతి కాల్ చేసి రాత్రి శీను కాల్ చేసిన విషయం చెబుతుంది. పడుకున్న రౌడీ రంగా నుంచి ఫోన్ తీసుకుని తల్లికి శీను కాల్ చేస్తాడు. అసలు ఏమైందిరా అని శీను తల్లి అడిగితే నిజంగా కిడ్నాప్ కాలేదు. ఇదంతా నాటకం అని శీను చెబుతాడు.
శీనుతో తల్లి మాట్లాడిన మాటలు విన్న రేవతి రాజ్‌కు చెబుతుంది. రేవతి చెప్పింది రాజ్ చెప్పి పోలీస్‌ల హెల్ప్ కావాలని అడుగితే.. కానిస్టేబుల్ శేషు ఉన్నారని అప్పు చెబుతుంది. దాంతో రాజ్ వెళ్లిపోతాడు. అప్పును కోర్టుకు తీసుకెళ్తారు. ఇంతలో యామిని వచ్చి చప్పట్లు కొడుతుంది. చెల్లికి ధైర్యం చెప్పి నువ్ భయపడుతున్నావ్. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నావా అని యామిని అంటుంది.
నాగ్ రాజ్ కావాలి, నీకు చెల్లెలు కావాలి. ఎక్స్‌చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. నువ్ రాజ్ బావను వదిలేసి నా దగ్గరికి పంపిస్తానని మాటిస్తే ఆ శీను గాడిని తీసుకొచ్చి నీ చెల్లెలు ఎలాంటి తప్పు చేయలేదని చెప్పిస్తానని, లేదంటే జైలులో చీకటి గోడల మధ్య చిప్పకూడు తినేలా చేయిస్తాను. రాజ్ కావాలా, లేక చెల్లెలు జీవితమా అని యామిని ఆఫర్ ఇస్తుంది.
నీకున్న ఆప్షన్ శీనుగాడు
రెండు కావాలి. నీ సాయం లేకుండా నేను చెల్లెలిని కాపాడుకుంటాను అని కావ్య అంటుంది. ఇప్పుడు నీకున్న ఆప్షన్ శీనుగాడు. వాడు ఎక్కడున్నాడో తెలుసా అని యామిని అంటే.. వాడిని పట్టుకునేందుకు ఆయన వెళ్లారు అని కావ్య చెబుతుంది. దాంతో కాస్తా షాక్ అయిన యామిని శీను గాడి చుట్టు ఎలాంటి వాళ్లను పెట్టానో తెలుసా. వాడు ఎక్కడున్నాడో నాకు తప్ప ఎవరికి తెలియదని యామిని అంటుంది.
నాది ధర్మం, నీది అధర్మం. చూస్తూ ఉండూ అప్పును ఎలా కాపాడుకుంటానో అని వెళ్లిపోతుంది. దాంతో భయపడిపోయిన యామిని రౌడీ రంగాకు కాల్ చేసి శీనును జాగ్రత్తగా కనిపెడుతూ ఉండూ అని చెబుతుంది. శీను తన ఫోన్‌ను మెల్లిగా జేబులో పెట్టుకుంటాడు. రేవతితో శీను తల్లి రత్తమ్మ ఇంటికి రాజ్ వస్తాడు. శీను కాల్ చేసింది అడుగుతాడు. ఇప్పుడు వాడు నిజం చెప్పిన శిక్ష పడుతుందిగా రత్తమ్మ అంటుంది.
శీనుకు శిక్ష పడదు. ఫైన్ పడుతుంది. ఆ ఫైన్ కూడా మేమే కట్టేసి బయటకు తీసుకొస్తాం అని రాజ్ అంటాడు. రేవతి కూడా హామీ ఇస్తుంది. ఎక్కడున్నాడో చెప్పలేదు గానీ ఫోన్ చేశాడని చెప్పి మొబైల్ నెంబర్ చూపిస్తుంది. శీనుకు కాల్ చేసి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం, మీ అమ్మకు యాక్సిడెంట్ అయిందని రాజ్ అబద్ధం చెబుతాడు. మేము డిశ్చార్జ్ చేస్తాం. మీరు ఇంటికి వెళ్లండి అని రాజ్ చెబుతాడు.
కేసుపై వాదనలు
శీను వెంటనే బయలుదేరుతున్నా అని వెళ్తుండగా రౌడీ అడ్డుకుంటాడు. కచ్చితంగా వెళ్లాల్సిందే అని శీను వెళ్తుంటే రౌడీ రంగా మెడపై కత్తి పెడతాడు. దాంతో శీను ఆగిపోతాడు. శీను నెంబర్ ట్రేస్ చేయించి రాజ్ అక్కడికి వెళ్లాలనుకుంటాడు. మరోవైపు అప్పు కేసుపై వాదనలు జరుగుతుంటాయి. శీనును ప్రవేశపెట్టమని యామిని సైడ్ న్యాయవాది అంటాడు.
సాక్షి కనిపించట్లేదు అని కానిస్టేబుల్ చెబుతాడు. దాంతో కావ్యను విచారించాలని పీపీ అంటాడు. దాంతో కావ్యను పిలుస్తాడు. కావ్య నువ్వే నీ చెల్లెలిని ఇరికించబోతున్నావ్ అని యామిని అంటుంది. కావ్య వెళ్లి కోర్టు బోనులో నిల్చుంటుంది.
మీరు అప్పు అక్క కావ్యే కదా అని లాయర్ అంటే అందుకేగా పిలిపించారు అని కావ్య అంటుంది. దానికి కోర్టులో అడిగినదానికి మాత్రమే చెప్పాలని జడ్జ్ కావ్యను మందలిస్తాడు. సారీ అని కావ్య చెబుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
News/Entertainment/బ్రహ్మముడి జులై 19 ఎపిసోడ్: కోర్టు బోనులో కావ్య- మందలించిన జడ్జ్- శీను అడ్రస్ కనిపెట్టిన రాజ్- కావ్యకు యామిని ఆఫర్!
News/Entertainment/బ్రహ్మముడి జులై 19 ఎపిసోడ్: కోర్టు బోనులో కావ్య- మందలించిన జడ్జ్- శీను అడ్రస్ కనిపెట్టిన రాజ్- కావ్యకు యామిని ఆఫర్!