Brahmamudi July 22 Episode: బ్రహ్మముడి.. లక్కీ రేఖ కొడుకు అని చెప్పేసిన రాజు.. ఇందు షాక్.. రాజుకు మళ్లీ ఆ పీడకల

Brahmamudi Serial July 22 Episode: బ్రహ్మముడి సీరియల్ జులై 22 ఎపిసోడ్ లో లక్కీని నేరుగా ఇంటికే తీసుకొచ్చిన రాజు.. అతడు రేఖ కొడుకు అన్న నిజాన్ని ఇందుకి చెబుతాడు. అంతేకాదు అందరి ముందే రేఖను ఇరికిస్తాడు. అటు అతనికి మరోసారి చిన్ననాటి యాక్సిడెంట్ కల వస్తుంది.

Published on: Jul 22, 2026, 08:02:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రేఖకు మరిన్ని షాకులు తగులుతాయి. అయితే అన్నింటి కంటే పెద్ద షాక్ లక్కీ ఇంటికి రావడమే. రాజు, నందులతో ఎలా వేగాలో అని టెన్షన్ పడుతున్న రేఖకు లక్కీ రూపంలో మైంబ్ బ్లాక్ అవుతుంది. అటు ఈ నిజం ఇందుకి చెప్పేస్తాడు రాజు.

Brahmamudi July 22 Episode: బ్రహ్మముడి.. లక్కీ రేఖ కొడుకు అని చెప్పేసిన రాజు.. ఇందు షాక్.. రాజుకు మళ్లీ ఆ పీడకల
Brahmamudi July 22 Episode: బ్రహ్మముడి.. లక్కీ రేఖ కొడుకు అని చెప్పేసిన రాజు.. ఇందు షాక్.. రాజుకు మళ్లీ ఆ పీడకల

రేఖ సంగతి తేలుస్తానన్న నందు

రాజు యాక్సిడెంట్ గురించి ఇందు, నందు మాట్లాడుకునే సీన్ తో సీరియల్ బుధవారం (జులై 22) ఎపిసోడ్ మొదలైంది. యాక్సిడెంట్ చేయించింది రేఖే అని తెలుసుకున్న నందు ఆమెపై పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వెళ్లబోతుంది. కానీ ఇందు అడ్డుకుంటుంది.

ఇందులో నువ్వు ఇన్వాల్వ్ కావద్దనే నేను నీకు ఈ విషయం చెప్పాను.. ఇక వదిలెయ్ అని అంటుంది. ఇన్నాళ్లూ రేఖను చూసి భయపడ్డాం.. ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటి అని నందు నిలదీసినా ఇందు మాత్రం వినదు. వద్దని చెప్పి వెళ్లిపోతుంది. నందు మాత్రం రేఖ సంగతి తేలుస్తానని మనసులో అనుకుంటుంది.

రాజు యాక్సిడెంట్ గురించి వెంకీతో మాట్లాడిన నందు

ఆ వెంటనే వెంకీకి నందు ఫోన్ చేస్తుంది. రాజు యాక్సిడెంట్ గురించి ఆరా తీస్తుంది. యాక్సిడెంట్ చేసిన వాడు ఎక్కడున్నాడో కనిపెట్టాలని అంటుంది. అన్నయ్య బాగానే ఉన్నాడు కదా.. ఇక అవన్నీ ఎందుకులే అని వెంకీ అంటాడు. కాదు.. యాక్సిడెంట్ జరిగిందా లేక ఎవరైనా చేయించారా అన్నది వాడిని పట్టుకుంటే కానీ తెలియదు.. ఈ విషయంలో నాకు నీ సాయం అవసరం అని నందు అనడంతో వెంకీ సరే అంటాడు.

శృతిని అవమానించిన ఐశ్వర్య.. క్లాస్ పీకిన నందు, ఇందు

ఆ తర్వాత ఇంటికి శృతి వస్తుంది. మేడమ్ అంటూ పిలుస్తూ లోనికి వస్తుంది. హాల్లో ఉన్న ఐశ్వర్య ఆమెను అవమానించేలా మాట్లాడుతుంది. డబ్బు అవసరం ఉండి.. ఇందు మేడమ్ కోసం వచ్చానని అంటుంది. ముష్టి కోసం గడప బయట ఉండాలి కానీ.. ఇలా నట్టింట్లోకి వస్తావా అని ఐశ్వర్య అంటుంది. అది విన్న నందు ఆమెకు క్లాస్ పీకుతుంది. నీలాగా మరొకరు సంపాదించింది తినడం లేదు.. ఆమె కష్టపడి సంపాదించుకుంటోందని అంటుంది. దీంతో ఐశ్వర్య ఆమెను కొట్టబోతోంది.

అప్పుడే ఎంట్రీ ఇచ్చిన ఇందు ఆమె చేయి పట్టుకుంటుంది. చేయి మరీ అంత దురదగా ఉందా అని ఆమెకు క్లాస్ పీకుతుంది. ఇంకా ఎన్నాళ్లు ఇలా పార్టీలు, పబ్బులంటూ ఖాళీగా తిరుగుతావ్.. అప్పుడప్పుడూ ఆఫీసుకు రా అని అంటుంది. సీఈవో అయిపోయానని పొగరు చూపిస్తున్నావా అని ఐశ్వర్య అంటే.. అవును అని ఇందు సమాధానమిస్తుంది. ఇందు మాటలతో ఐషూ దిమ్మదిరిగి వెళ్లిపోతుంది. ఆమెలో మార్పు రావాలనే ఇలా మాట్లాడానని ఇందు అంటుంది. ఆమె మారే ఛాన్సే లేదని రాజు అంటాడు.

రాజుకు మరోసారి చిన్ననాటి యాక్సిడెంట్ కల..

ఆ తర్వాత రాజు నిద్రలో ఉండగా మరోసారి చిన్నతనంలో జరిగిన యాక్సిడెంట్ కల వస్తుంది. దీంతో అమ్మా అంటూ అతడు నిద్రలో నుంచి భయపడుతూ లేస్తాడు. ఏమైందంటూ ఇందు వచ్చి అడుగుతుంది. యాక్సిడెంట్ జరిగినట్లు కల వచ్చిందని రాజు చెబుతాడు. ఇది మొన్న జరిగింది కాదని, ఎప్పుడో జరిగిందని అంటాడు. దీంతో రాజుకు గతం గుర్తుకు వస్తుందని ఇందు అనుకుంటుంది.

ఆ కల గురించి వివరాలు అడుగుతూ.. అందులో ఉన్నవాళ్ల ముఖాలు గుర్తు పట్టావా అని అడుగుతుంది. లేదు.. కానీ వాళ్లందరూ తనకు చాలా దగ్గరి వాళ్లలా అనిపిస్తుంది.. చిన్నప్పటి నుంచీ ఈ కల నాకు వస్తూనే ఉంది.. కానీ అమ్మానాన్నలు అదో పీడ కల అంటూ కొట్టిపారేస్తున్నారు అని రాజు అంటాడు. దీంతో ఎమోషనల్ అయిన ఇందు.. అసలు నిజం చెప్పలేక రాజుకు నీళ్లు ఇచ్చి పడుకోబెడుతుంది.

రేఖలో మొదలైన టెన్షన్

ఇటు రేఖ ఒంటరిగా కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటుంది. లక్కీ తన కొడుకు అన్న విషయం ఆ రాజు గాడు ఎవరికి చెప్పాడా అని ఆలోచిస్తుంది. ఇందుకి చెప్పాడా.. అపర్ణకు చెప్పాడా.. వాళ్ల తల్లిదండ్రులకు చెప్పాడా.. ఆ లక్కీగాడికే చెప్పాడా అంటూ ఆలోచిస్తూ కూర్చుంటుంది.

వాడిని ఏదో ఒకటి చేయాలి లేదంటే కష్టం అని అనుకుంటుండగా భూషణ్ వచ్చి పిలవడంతో ఉలిక్కి పడుతుంది. ఏమైందని అతడు అడిగితే కంగారు పడుతూ ఏదో కవర్ చేసుకుంటుంది. అసలు విషయం నీకు తెలిస్తే తట్టుకోలేవని మనసులో అనుకుంటుంది.

బ్యాగు పట్టుకొని దుగ్గిరాల ఇంటికి లక్కీ.. భ్రమరాంబ ఎక్స్‌ట్రాలు

లక్కీకి ఫోన్ చేసిన రాజు.. ఈరోజు నీ తల్లి ఎవరో చెప్పేస్తాను.. బ్యాగు పట్టుకొని రేఖ పిన్ని ఇంటికి వచ్చేసెయ్ అని చెబుతాడు. దీంతో లక్కీ దుగ్గిరాల ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. అతన్ని చూసి అందరూ షాక్ తింటారు. ఎందుకు వచ్చావని భ్రమరాంబ అడిగితే తానే రమ్మన్నానని రాజు చెబుతాడు.

ఇలాంటి బస్తీ వాళ్లు ఇంట్లో ఉంటే నాకు సుస్తీ చేస్తుంది.. అతడు ఇక్కడ ఉండటానికి ఒప్పుకోను అని భ్రమరాంబ అంటుంది. అసలు నీకేం అర్హత ఉందని ఇంట్లో ఉన్నావ్.. మీలాగే లక్కీ కూడా ఇక్కడే ఉంటాడని రాజు దిమ్మదిరిగే సమాధానమిస్తాడు. అయినా నువ్వు ఒప్పుకునేదేంటి రేఖ పిన్నీ ఎక్కడ అని అడగ్గానే ఆమె కిందికి వస్తూ లక్కీని చూసి షాక్ తింటుంది.

లక్కీని చూసి రేఖ షాక్.. తల్లి వదిలేసి వెళ్లిందని చెప్పిన రాజు

మన లక్కీ రేఖ పిన్నీ.. గుర్తు పట్టారా అని రాజు అనగానే ఆమె మరింత కంగారు పడుతుంది. అసలు అతన్ని ఎందుకు పిలిచావని భూషణ్ అడుగుతాడు. లక్కీని చిన్నతనంలోనే అతని తల్లి వదిలేసి వెళ్లింది.. తల్లిదండ్రుల ప్రేమ లేకుండా పెరిగాడు.. అందుకే అతన్ని ఇక్కడికి పిలిచాను అని రాజు అంటాడు. అలాంటి తల్లి నాశనమైపోతుందంటూ అపర్ణ, సుభాష్ శాపనార్థాలు పెట్టడంతో రేఖ ముఖం మాడిపోతుంది.

ఈ ఇంటికి పిలిస్తే అతనికి తల్లి ఎలా దొరుకుతుంది అని భ్రమరాంబ అడుగుతుంది. దొరుకుతుంది.. రేఖ పిన్ని ఉంది కదా.. ఆమెనే అడ్రెస్, ఆధార్ కార్డు.. రేఖ పిన్నీయే లక్కీ తల్లి ఎవరో కనిపెడుతుంది అంటూ అందరి ముందూ తనను ఇరికించేలా మాట్లాడటంతో రేఖ నోట మాట రాదు. తర్వాత రాజును పక్కకు తీసుకెళ్లిన ఇందు అసలు లక్కీని ఎందుకు తీసుకొచ్చావని నిలదీస్తుంది.

లక్కీ ఎవరో కాదు రేఖ పిన్ని కన్న కొడుకు అని రాజు చెప్పడంతో ఇందు షాక్ తింటుంది. ఆమెను బలవంతంగా ఒప్పిస్తే లక్కీని సరిగా చూసుకోదు.. అందుకే ఆమె లక్కీని అంగీకరించేలా చేయాలి.. దీనికి నీ సాయం కావాలని అడుగుతాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More