బ్రహ్మముడి జూలై 2 ఎపిసోడ్: సొంత అక్కను కలుసుకున్న రాజ్- మేనల్లుడికి మామ స్వరాజ్ పేరు- రామ్‌కు కంపెనీ ఎండీలా ట్రైనింగ్!

బ్రహ్మముడి సీరియల్ జూలై 2 ఎపిసోడ్‌లో కొడుకుకు షూస్ కొనలేని పరిస్థితిని చూసిన రాజ్, కావ్య ఇంటికి వెళ్లి పుట్టినరోజు వేడుకలు చేస్తారు. రాజ్‌కు రేవతి అక్క అవుతుంది. అలా సొంత అక్కను రాజ్ కలుసుకుంటాడు. రేవతి కొడుకు పేరు మేనమామ స్వరాజ్ పేరు పెట్టుకుంటుంది రేవతి. రాహుల్ చీటింగ్ చేసేందుకు ట్రై చేస్తాడు.

Published on: Jul 02, 2025 7:38 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్, కావ్య కారులో వెళ్తుంటారు. దారిలో రేవతి కొడుకుతో కనిపిస్తుంది. కొత్త షూస్ కొనివ్వమని రేవతిని కొడుకు అడుగుతాడు. ఇవాళ నా బర్త్ డే కదా. ఇవాళ నాకు ఆ షూస్ కావాల్సిందే అని పట్టుబడతాడు రేవతి కొడుకు. దాంతో షాప్ అతన్ని షూస్ ధర ఎంతని అడిగితే రూ. 2 వేలు అని చెబితే రేవతి దగ్గర అంత డబ్బు ఉండదు.

బ్రహ్మముడి సీరియల్‌ జూలై 2 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జూలై 2 ఎపిసోడ్

ఆశ ఉన్నవాళ్లకు

తర్వాత వస్తామని కొడుకుని తీసుకెళ్లి పోతుంది రేవతి. ఇప్పుడు అంత డబ్బు లేదు. వచ్చే సంవత్సరం కొనిస్తాను అని రేవతి అంటే.. నువ్ ఎప్పుడు ఇలాగే అంటావ్ కొనివ్వవు. ఇలాగే అబద్ధం చెబుతావ్ అని రేవతి కొడుకు అంటాడు. ఆ మాటలన్నీ విన్న రాజ్ ఆశ ఉన్నవాళ్లకు డబ్బు ఇవ్వడు దేవుడు అని అంటాడు. మనకు డబ్బుంది కాబట్టి మనం కొనిద్దాం. వాళ్లు నాకు తెలుసు. మమ్మల్న ఓసారి కాపాడారు అని కావ్య చెబుతుంది.

అలాంటి మంచి మనిషికి సహాయం చేయడంలో తప్పేలేదని రాజ్ అంటాడు. మరోవైపు తండ్రిని కేక్ తీసుకొచ్చావా అని రేవతి కొడుకు అడుగుతాడు. కుదర్లేదని తండ్రి చెబుతాడు. ఇంతలో రాజ్, కావ్య వస్తారు. రాజ్ అంటూ ఎమోషనల్ అయిన రేవతి వెళ్లి ప్రేమగా హగ్ చేసుకుంటుంది. హగ్ చేసుకుని ఏడుస్తుంది. ఎలా ఉన్నావురా అని రేవతి అడుగుతుంది.

దాంతో షాక్ అయిన కావ్య ఈయన ముందే తెలుసా. హో మీకు మా ఫ్యామిలీ గురించి ముందే తెలుసు కదా అని కావ్య అంటుంది. మీ ఫ్యామిలీ గురించి తెలుసు. నా గురించి ఎలా తెలుసు అని రాజ్ అడుగుతాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది. క్షమించండి. అచ్చం మా తమ్ముడిలా ఉంటే పొరపాటు పడ్డాను. చాలా రోజులకు చూసేసరికి అలాగే అనుకున్నాను రేవతి అంటుంది.

మావయ్య అని పిలవరా

అయితే, నన్ను మీ తమ్ముడే అనుకోండి. నేను కూడా ఇవాళ్టీ నుంచి మిమ్మల్ని అక్క అనే పిలుస్తాను అని రాజ్ అంటాడు. నిజానికి రేవతి, రాజ్ అక్కతమ్ముళ్లే అవుతారు. రాజ్‌కు ముందే అపర్ణకు కూతురు ఉంటుంది. మీకు సర్‌ప్రైజ్ ఇద్దామని, అంటే మీ కొడుకు బర్త్ డే కదా అని రాజ్ గిఫ్ట్స్ ఇస్తాడు. థ్యాంక్స్ అంకుల్ అని రేవతి కొడుకు అంటే అంకుల్ కాదురా మావయ్య అను. ఇంతకీ నీ పేరేంటీ అని రాజ్ అంటాడు.

రాజ్.. స్వరాజ్ అని రేవతి కొడుకు చెబుతాడు. స్వరాజా.. ఈ పేరు ఎక్కడో విన్నానే అని రాజ్ అంటాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకులెండి, బాబు గిఫ్ట్స్ నచ్చాయో లేవో అడగండి అని కావ్య డైవర్ట్ చేస్తుంది. అంటే, రాజ్ అల్లుడుకి తన పేరే పెడుతుంది రేవతి. స్వరాజ్ షూస్ చూసి చాలా సంతోషిస్తాడు. తర్వాత బాబుతో కేక్ కట్ చేయిస్తారు. తర్వాత రాజ్ తనను మావయ్య అని పిలిపించుకుంటాడు.

రాజ్‌కు అల్లుడు స్వరాజ్ కేక్ పెడతాడు. ఈరోజు కూడా వాడు అడిగింది చేయలేకపోయాను అని చాలా బాధపడ్డాను. మీ వల్ల వాడిలో సంతోషం చూశాను అని రేవతి భర్త ఎమోషనల్ అవుతాడు. మీరు నాకు బావ. మీకోసం ఈ బామ్మర్ది ఉన్నాడనుకోండి అని రాజ్ అంటాడు. తర్వాత కావ్య, రాజ్ వెళ్తుంటే అప్పును బోల్తా కొట్టించిన వ్యక్తి అక్కడికి వస్తాడు.

తమ్ముడికి కాల్ చేయండి

ఏంటక్కా మీ ఇంటికి రిచ్ చుట్టాలు వచ్చినట్లున్నారు. ఇలాంటి చుట్టాలు నాకు ఉంటే ఈ బస్తీ వదిలేసి వెళ్లిపోయేవాడిని అని అంటాడు. నోరుమూసుకునిపోరా అని రేవతి వారిస్తుంది. మీకు ఏం అవసరం ఉన్న ఈ తమ్ముడికి కాల్ చేయండి. వచ్చేస్తాను అని రాజ్ అంటాడు. వాన్ని చూడగానే ఒక్కసారిగా గతమంతా నా కళ్లముందు కదలాడిందని ఏడుస్తూ లోపలికి వెళ్లిన రేవతి మళ్లీ ఫొటో చూస్తూ బాధపడుతుంది.

రాజ్‌ను చూసిన తర్వాత కూడా నీకు నిజం చెప్పాలనిపించలేదా. రాజ్ కూడా నిన్ను గుర్తుపట్టలేదు అని భర్త అడుగుతాడు. నేను చేసిన తప్పుకు బంధాలు అని తెగిపోయాయి. దేవుడు నాకు ఎలాంటి శిక్ష వేశాడో చూశారా. వాళ్ల పరువుని రోడ్డు మీద పడేశాను. వాళ్ల ఇంట్లో అడుగుపెట్టే అర్హత నాకు లేదు అని రేవతి అంటుంది. ఒకవేళ వాళ్లు ఒప్పుకుంటే అని భర్త అంటాడు.

నాలో మళ్లీ ఆశలు రేపకండి అని రేవతి అంటుంది. నాకెందుకో రాజ్‌ను చూస్తుంటే మళ్లీ పాత రోజులు వస్తాయనిపిస్తుందని భార్యను హత్తుకుంటాడు భర్త. మరోవైపు రాజ్, కావ్య కారులో వెళ్తుంటారు. రేవతిని కలిసినప్పటినుంచి ఏదో ఉత్సాహం కలుగుతుందని రాజ్ అంటాడు. తర్వాత రాజ్ తన మనసులోని విషయం గురించే అంటే ముందు ఆఫీస్ ప్రాబ్లమ్ పూర్తయ్యాకే ఏదైనా అన్నాగా. రేపటి నుంచి మీకు ట్రైనింగ్. దానిమీద కాన్సంట్రేట్ చేయాలి అని రామ్‌కు చెబుతుంది కావ్య.

నిన్ను కూడా చీట్ చేస్తాను

మరోవైపు రాహుల్‌కు గర్ల్‌ఫ్రెండ్ కాల్ చేసి తాను అడిగిన ప్రాపర్టీ ఏమైంది. నీ వల్ల అవుతుందా అని నిలదీస్తుంది. త్వరలోనే ఆ ప్రాపర్టీ నీకు వస్తుందని రాహుల్ మాటిస్తే అలా అయితే ఈ బేబీ నీ వశం అవుతుందని గర్ల్‌ఫ్రెండ్ కాల్ కట్ చేస్తుంది. నిన్ను ఎలా సొంతం చేసుకోవాలో నాకు తెలుసు. నన్ను చీట్ చేసిన నిన్ను నేను కూడా చీట్ చేస్తాను. తర్వాత నిన్ను నా సొంతం చేసుకుంటాను అని రాహుల్ అనుకుంటాడు.

అర్జంట్‌గా స్వప్న లాకర్‌లో ఉన్న డాక్యుమెంట్స్‌ను డూప్లికేట్ చేసి దానికిస్తా. దాంతో అది నా సొంతం అవుతుంది అని రాహుల్ లాకర్ కీస్ కోసం వెతుకుతాడు. తర్వాత లాకర్ డోర్ పట్టుకుని లాగితే రాదు. స్వప్న వచ్చి దానికి కీ ఉంటే కానీ రాదని చెబుతుంది. అది విని రాహుల్ షాక్ అయిపోతాడు. తర్వాత రామ్‌‌కు తన భర్త రాజ్‌లా, కంపెనీ ఎండీలా ట్రైనింగ్ ఇస్తుంది కావ్య. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

News/Entertainment/బ్రహ్మముడి జూలై 2 ఎపిసోడ్: సొంత అక్కను కలుసుకున్న రాజ్- మేనల్లుడికి మామ స్వరాజ్ పేరు- రామ్‌కు కంపెనీ ఎండీలా ట్రైనింగ్!
News/Entertainment/బ్రహ్మముడి జూలై 2 ఎపిసోడ్: సొంత అక్కను కలుసుకున్న రాజ్- మేనల్లుడికి మామ స్వరాజ్ పేరు- రామ్‌కు కంపెనీ ఎండీలా ట్రైనింగ్!