బ్రహ్మముడి జూలై 3 ఎపిసోడ్: కావ్యకు తెలీకుండానే ఆఫీస్‌కు ఎండీగా వెళ్లిన రాజ్- కళావతి ప్లాన్‌ను తనకే తిప్పికొట్టిన యామిని!

బ్రహ్మముడి సీరియల్ జూలై 3 ఎపిసోడ్‌లో రామ్ దుగ్గిరాల ఇంటికి వస్తాడు. రామ్‌కు రాజ్‌లా ఎలా ఉండాలో కావ్య ట్రైనింగ్ ఇస్తుంది. అదంతా రుద్రాణి చూస్తుంది. తన నగలకు మెరుగు పెట్టించమని అప్పుకు ఇస్తుంది స్వప్న. కావ్యకు తెలియకుండానే ఆఫీస్‌కు ఎండీలా వెళ్తాడు రాజ్. అది తెలిసి కావ్య షాక్ అవుతుంది.

Published on: Jul 3, 2025, 07:10:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాహుల్ స్వప్న రూమ్ లాకర్ తెరిచేందుకు వెతికితే స్వప్న వచ్చి దానికి కీ కావాలనంటుంది. ఈ సారి ఏం కొట్టేయాలని ప్లాన్ చేశావ్, ఏం దొంగతనం చేయాలనుకుంటున్నావ్ అని స్వప్న తిడుతుంది. నేను వచ్చింది కొట్టేయడానికి కాదు చార్జర్ కోసం అని పక్కన ఉన్న చార్జర్ తీసుకుని వెళ్లిపోతాడు రాహుల్.

బ్రహ్మముడి సీరియల్‌ జూలై 3 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జూలై 3 ఎపిసోడ్

త్వరగా మూడు ముళ్లు

నా దొంగమొగుడు మళ్లీ ఏదో కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నాడని స్వప్న అనుకుంటుంది. రాహుల్ మాత్రం హమ్మయ్య తప్పించుకున్నాను. లేకుంటే స్వప్న చేతిలో చచ్చుండేవాన్ని అని అనుకుంటాడు. మరోవైపు రాజ్, కావ్య ఏం మాట్లాడుకున్నారో తెలీదు. వీళ్లిద్దరికి త్వరగా మూడు ముళ్లు వేస్తే అయిపోతుందని అపర్ణ అంటుంది. ఇంతలో రాజ్ ఫుల్ జోష్‌తో వస్తాడు.

ఇందిరాదేవి పిలిచి నిన్న ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది. తినేసి పడుకున్నా. యామిని వండింది. అంతగా బాగాలేదు. కళావతి గారు వండినట్లు ఎవరు వండరు. మీరు చాలా లక్కీ అని కావ్య వంటను పొగుడుతాడు రాజ్. కావ్యతో బయటకు వెళ్లడం గురించి ఇందిరాదేవి అడిగితే రాజ్ సిగ్గుపడుతూ చాలా మాట్లాడుకున్నాం. కావ్య తన ప్రేమ ఒప్పుకున్నట్లుగా మాట్లాడుతాడు.

ఈ రెండు రోజులు

దాంతో త్వరగా పెళ్లి ఏర్పాట్లు చేయాలి. ముహుర్తం పెట్టించాలని, నా కొడుకు పెళ్లి హైదరాబాద్ మొత్తం మాట్లాడుకునేలా చేయాలి అని ఇందిరాదేవి, అపర్ణ అంటారు. దాంతో మేము మాట్లాడుకుంది పెళ్లి గురించి కాదు. ఆఫీస్‌లో ఏదో సమస్య అట దాని గురించి అని రాజ్ చెబుతాడు. ఈ రెండు రోజులు నేను ఆఫీస్‌లో ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇస్తారట. ఆఫీస్ సమస్య అయిపోయాక తన లవ్ గురించి చెబుతుంది అని రాజ్ అంటాడు.

ఇంతలో కావ్య వచ్చి నన్ను వచ్చి కలవమన్నాను కదా వీళ్లతో ముచ్చట్లు ఏంటీ అని రాజ్‌ను దబాయించి పట్టుకెళ్తుంది. ఇద్దరు ఏడు అడుగులు వేసినట్లుగా చూపిస్తారు. అదేమో పూర్తిగా పని రాక్షసి పని పేరు చెప్పి వీన్ని పూర్తిగా నలిపేస్తుందేమో అని ఇందిరాదేవి అంటుంది. మరోవైపు అప్పుకు స్వప్న తన నగలు ఇచ్చి, మెరుగు పెట్టించి తీసుకురా, బ్యాంక్ లాకర్‌లో పెట్టాలనుకుంటున్నాను. అక్కడే సేఫ్‌గా ఉంటాయి అని స్వప్న చెబుతుంది.

రాహుల్ దొంగతనం

రాహుల్ మీద డౌట్‌గా ఉందా అని అప్పు అంటుంది. నాకు అలాంటి మొగుడు దొరికాడు మరి. నువ్వెళ్లి నగలకు మెరుగు పెట్టించి తీసుకురా అని అప్పుకు నగలు ఇస్తుంది స్వప్న. దీంతో రాహుల్ నగలు దొంగతనం చేసింది బయటపడే అవకాశం ఉంది. రామ్‌కు సూట్ ఇచ్చి వేసుకోమంటుంది. రామ్ సూట్ వేసుకుని వస్తాడు. అచ్చం మీ బాస్‌లా ఉన్నా కదా అని రామ్ అంటాడు.

చూడటానికి ఒరిజినల్ ఫోన్, నకిలీ ఫోన్ రెండు ఒకేలా ఉంటాయి. వాడితేనే కదా తెలిసేది అని కావ్య అంటే ఏం వాడతారు అని రామ్ అంటాడు. మీ బాడీ లాంగ్వెజ్‌ను కావ్య అంటుంది. రామ్ నడిచింది కావ్యకు నచ్చకపోవడంతో ట్రైనింగ్ ఇస్తుంది. ఎలా నడవాలో చెబుతుంది. దాంతో అమ్మో నాకు భయమేస్తుందని రాజ్ అంటాడు. తర్వాత కావ్య నడిచి చూపిస్తుంది.

తర్వాత రాజ్ నడిచేదానికి వంకలు పెడుతుంది కావ్య. అసలు ఇలా ఎలా ఉంటారండి. ఇలాంటి వ్యక్తితో ఎలా వేగుతున్నారు అని రామ్ అంటే.. ఒక్కరోజే భరించలేకపోతున్నారు. ఇన్నాళ్లుగా నేను టార్చర్ ఎలా అనుభవిస్తున్నానో మీరే అర్థం చేసుకోకండి అని కావ్య అంటుంది. తర్వాత డిన్నర్ టేబుల్‌పై రాజ్ ఎలా తింటాడో రామ్‌కు చెబుతుంది కావ్య.

ఏదో పోలీస్ ట్రైనింగ్

ముష్టోడు తిన్నట్లు చూపిస్తూ ఇలా తినాలా అని రామ్ వెటకారంగా అంటాడు. రాజ్‌కు కావ్య ట్రైనింగ్ ఇవ్వడం రుద్రాణి చూస్తుంది. రాజ్‌కు ఏదో పోలీస్ ట్రైనింగ్ ఇస్తున్నట్లు ఇస్తుంది. ఇదంతా ఎందుకు చేస్తుంది. తెలుసుకోవాలి అని రుద్రాణి అనుకుంటుంది. ఆ తర్వాత కావ్యకు తెలియకుండానే రాజ్ ఆఫీస్‌కు ఎండీలా వెళ్లిపోతాడు. స్టాఫ్ అందరితో మాట్లాడాలని అంటాడు.

ఆ విషయాన్ని కావ్యకు కాల్ చేసి శ్రుతి చెబుతుంది. అయితే, కావ్య ప్లాన్ తెలిసిన యామిని రాజ్‌తోనే ఇలా తిప్పికొడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More