బ్రహ్మముడి జూలై 7 ఎపిసోడ్: రాజ్‌కు గుర్తొచ్చిన గతం- సిద్ధార్థ్‌ను వణికించిన రామ్- కావ్య డౌట్- రాహుల్ పాకెట్ మనీ కట్

బ్రహ్మముడి సీరియల్ జూలై 7 ఎపిసోడ్‌లో రాహుల్ బాగోతం ఇంట్లోవాళ్లకు చెబుతుంది స్వప్న. దాంతో రాహుల్ పాకెట్ మనీ కట్ చేసి ఇంట్లో పనోడిగా మారుస్తారు. ఆఫీస్‌లో సిద్ధార్థ్ నాన్న చేసిన ఇల్లీగల్ గోల్డ్ గురించి రామ్ చెప్పి సిద్ధార్థ్ వణికిపోయేలా చేస్తాడు. అది చూసిన కావ్య గతం గుర్తొచ్చిందా అని డౌట్ పడుతుంది.

Jul 7, 2025, 07:23:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఆఫీస్‌లో రాజ్ మాటలకు స్టాఫ్ అంతా భయపడుతున్నట్లు చెబుతారు. శ్రుతిని పిలిచి కొట్టబోతే భయంతో చెంపలు మూసుకుంటుంది. భయం అంటే ఇలా ఉండాలి అని రాజ్ అంటాడు. గాడ్ ప్రామిస్‌గా చెబుతున్నా భయపడుతున్న అని ఎంప్లాయ్ అంటాడు. దాంతో అతని గుండెలపై తల పెట్టి హార్ట్ బీట్ వింటాడు రాజ్.

బ్రహ్మముడి సీరియల్‌ జూలై 7 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జూలై 7 ఎపిసోడ్

రాజ్ సర్ ప్రాంక్

ఇలా ఆఫీస్‌లో విచిత్రంగా, వింతగా ప్రవరిస్తాడు రాజ్. శ్రుతి వీళ్లకు నేనంటే భయం లేకుండా పోయింది. వీళ్లందరిని వెంటనే ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. మీరందరు ఫైర్ అని రాజ్ అంటాడు. ఇంతలో వచ్చిన కావ్య వచ్చి చప్పట్లు కొట్టి సూపర్ సర్ మీరు అని అంటూనే ఉంటుంది. మీరేం కంగారుపడకండి. ఇదంతా రాజ్ సర్ చేసిన ప్రాంక్ అని కవర్ చేసి అందరిని పంపించేస్తుంది కావ్య.

అసలు మీరేం చేస్తున్నారు. ముందు ఇంటికి పదండి అని రాజ్‌ను తీసుకెళ్తుంది కావ్య. నాకు చెప్పకుండా ఆఫీస్‌కు ఎందుకు వెళ్లారు అని కావ్య అడిగితే మిమ్మల్ని ఇంప్రెస్ చేద్దామని రాజ్ అంటాడు. ఇంప్రెస్ కాదు నన్ను ఇరికించడానికి వెళ్లినట్లుందని కావ్య అంటుంది. మీరు నిజమైన బాస్ కాదు అని సిద్ధార్థ్‌కు ఒక్క క్లూ వెళ్లిన మన ప్లాన్ అంతా ఫెయిల్ అయ్యేది అని కావ్య అంటుంది.

మరోవైపు రుద్రాణి కాళ్లపై పడేలా రాహుల్‌ను ఈడ్చిపడేస్తుంది స్వప్న. రాహుల్ మళ్లీ ఏం చేశావ్ అని అపర్ణఅంటుంది. ఇంట్లో తేరగా దొరికేది మేమేగా అని రుద్రాణి అంటుంది. నీ కొడుకు ఏం చేశాడో చెబితే ఇంట్లోవాళ్లంతా చెప్పుతో కొడతారు. ఆరోజు నగలు దొంగలిస్తున్నాడని చెప్పాగా. వాటిని తీసుకెళ్లి ఈయన ఉంచుకున్నదానికి ఇచ్చాడు అని స్వప్న అంటుంది.

రాహుల్ నిర్వాకం బయటకు

ఆరోజు మీకు చూపించిన నగలు గిల్టు నగలు. కట్టుకున్న భార్యను మోసం చేసిన గిల్టు నగలు పెట్టి ఈ నగలను తన గర్ల్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చుకున్నాడు అని స్వప్న అంటుంది. నువ్ చెప్పేది నిజమని ఎలా నమ్మడం అని రుద్రాణి అంటే.. దీన్ని చూస్తే నమ్ముతారా అని రాహుల్ లవర్‌ను తీసుకొచ్చి చూపిస్తుంది అప్పు. జరిగింది మొత్తం చెప్పు అని అప్పు అంటే గర్ల్‌ఫ్రెండ్ చెబుతుంది.

నేనేం అడగలేదు. నా మీద ప్రేమ ఉందని, పెళ్లి చేసుకుంటానని ఏడు వారాల నగలు తీసుకొచ్చి ఇచ్చాడు అని ఆమె చెబుతుంది. తర్వాత తాతయ్య నాకు రాసిచ్చిన ఆస్తి పేపర్స్ కూడా ఇద్దామని చూశాడని స్వప్న చెబుతుంది. దాంతో ఇంట్లోవాళ్లంతా చివాట్లు పెడతారు. రాహుల్ లవర్‌ను పంపించేస్తారు. వాన్ని అదుపులో పెట్టుకోవడం మానేసి నన్ను అంటున్నావా అని స్వప్ననే నిందిస్తుంది రుద్రాణి.

చాల్లే నోర్మూయ్. రాహుల్‌కు ఇక నుంచి పాకెట్ మనీ ఇవ్వడానికి వీళ్లేదు. కంపెనీ నుంచి కూడా ఇచ్చే నెల డబ్బులను క్యాన్సిల్ చేస్తున్నాను. డబ్బులు ఖర్చు చేయకుండా ఉండటమే కాదు ఇంట్లో పనులు కూడా చేయాలి. నాకు తెలియకుండా వాడికి ఎవరైన డబ్బులు ఇచ్చారని తెలిస్తే వాళ్లకు కూడా ఇదే గతి పడుతుంది. రుద్రాణి ముఖ్యంగా నీకు అని ఇందిరాదేవి ఆర్డర్ పాస్ చేస్తుంది.

రాత్రంతా ట్రైనింగ్

ఎంత తిట్టిన పట్టించుకోకుండా ఉన్న నీ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ అని రాహుల్‌ను ఆటపట్టిస్తాడు రాజ్. తర్వాత ఈరోజు రాత్రంతా మీకు ట్రైనింగ్. ఎక్కడికి వెళ్లట్లేదు. మీటింగ్ సక్సెస్ అయ్యేవరకు అంతే అని కావ్య అంటుంది. మరోవైపు రాహుల్‌ను చెంపదెబ్బ కొట్టి ఇంకా మారవా. రోజు రోజుకు దిగజారుతున్నావ్. ఇక చేయడానికి ఏం లేదు. ఇంట్లో పనులు చేస్తూ చిల్లర ఖర్చులు తీసుకో అని రుద్రాణి మండిపడి వెళ్లిపోతుంది.

యామినికి కాల్ చేసి కావ్య ఇంట్లో ఉన్నట్లు, రాత్రికి ఇంటికి రావట్లేదు, రాత్రంతా కళావతితో స్పెండ్ చేస్తున్నా అని రాజ్ చెబుతాడు. దాంతో యామిని షాక్ అవుతుంది. కళావతి ఆఫీస్‌లో సమస్య అట, తన ఎండీ ప్లేసులో నటించడానికి వెళ్తున్నట్లు అని రాజ్ చెబుతాడు. కావ్య అన్న మాటలు తలుచుకుని తనలో తానే మెలికలు తిరిగిపోతాడు. అది చూసిన ఇందిరాదేవి, అపర్ణ ఏమైందని అడుగుతారు.

ఈ రాత్రంతా కళావతి గారు నన్ను తన పక్కనే ఉంచుకోబోతున్నారు అని సిగ్గు పడతాడు రాజ్. అంత టైమ్‌లో నా ప్రేమ గురించి చెప్పొచ్చుగా. ఏదైనా జరగొచ్చుగా అని సిగ్గు పడుతూ వెళ్లిపోతాడు. పాపం వీడిని కావ్య రాత్రంతా పిండేస్తుందని తెలిస్తే ఏమైపోతాడో అని అపర్ణ అంటుంది. రాజ్ తను ఐ లవ్యూ అని చెప్పి ఎండ్ కార్డ్ వేస్తానని కావ్యగదిలోకి వెళ్తాడు.

ఇల్లీగల్‌గా గోల్డ్

మరుసటి రోజు ఉదయం ఆఫీస్‌లో బోర్డ్ మీటింగ్‌లో రాజ్ ఉన్న కండిషన్‌కు కంపెనీ హ్యాండిల్ చేయలేడని, ఎండీని మార్చాలనుకుంటున్నట్లు, గతంలో జరిగిన డీల్స్ గురించి ఏమైనా తెలుసా అని సిద్ధార్థ్ అంటాడు. మీ నాన్న బోర్డ్ మెంబర్‌గా ఉన్నప్పుడు జింబాబ్వే నుంచి ఇల్లీగల్‌గా గోల్డ్ తీసుకొచ్చి మన కంపెనీలో పెట్టడానికి ట్రై చేశారు. ఇప్పటివరకు అది నాకు, మీ నాన్నకు, నీకు, మా తాతయ్యకు నలుగురికి మాత్రమే తెలుసు అని రాజ్ అంటాడు.

రాజ్‌గా ఉన్న రామ్ మాటలకు సిద్ధార్థ్ వణికిపోతాడు. అదంతా విన్న కావ్య ఈ విషయాలు ఈయనకెలా తెలుసు. కొంపదీసి ఈయనకు గతం గుర్తుకువచ్చిందా అని కావ్య అనుకుంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More