బ్రహ్మముడి జులై 8 ఎపిసోడ్: కావ్య ఒడిలో నిద్రపోయిన రాజ్.. రాహుల్‌తో ఆడుకున్న స్వప్న.. సీక్రెట్ తెలుసుకున్న సిద్ధార్థ్

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (జులై 8) ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కావ్యతో రాజ్ రాత్రంతా గడుపుతాడు. మరోవైపు రాహుల్ తో ఇంటి పని చేయిస్తూ స్వప్న ఆడుకుంటుంది. అటు రాజ్ గతం మరచిపోయిన సీక్రెట్ ను సిద్ధార్థ్ కు చెబుతుంది యామిని.

Published on: Jul 8, 2025, 08:02:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి మంగళవారం (జులై 8) ఎపిసోడ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి. ఫుల్ ట్రైనింగ్ అంటూ కావ్యతోనే రాత్రంతా ఉంటాడు రాజ్. అటు అప్పూని ట్రాప్ లో ఇరికించడానికి యామిని ప్లాన్ చేస్తుంది. ఇటు రాజ్ సీక్రెట్ సిద్ధార్థ్ కు చెప్పడంతో కావ్య ప్రమాదంలో పడుతుంది.

బ్రహ్మముడి జులై 8 ఎపిసోడ్: కావ్య ఒడిలో నిద్రపోయిన రాజ్.. రాహుల్‌తో ఆడుకున్న స్వప్న.. సీక్రెట్ తెలుసుకున్న సిద్ధార్థ్
బ్రహ్మముడి జులై 8 ఎపిసోడ్: కావ్య ఒడిలో నిద్రపోయిన రాజ్.. రాహుల్‌తో ఆడుకున్న స్వప్న.. సీక్రెట్ తెలుసుకున్న సిద్ధార్థ్

కావ్య ఒడిలో రాజ్

బ్రహ్మముడి ఈరోజు (జులై 8) ఎపిసోడ్ కావ్య, రాజ్ కి కంపెనీ బాధ్యతల కోసం ట్రైనింగ్ ఇవ్వడంతో మొదలవుతుంది. కావ్య బెడ్‌పై ఫైల్స్ పడేసి, “రాజ్, ఈ ఫైల్స్ అన్నీ చదవాలి, రేపు బోర్డ్ మీటింగ్‌లో నీవు సిద్ధంగా ఉండాలి” అని చెబుతుంది. రాజ్ నిరాశగా, “ఇన్ని ఫైల్స్? నా వల్ల కాదు, కావ్య!” అని చేతులెత్తేస్తాడు. కావ్య ఓపికగా ఒక్కో ఫైల్ వివరిస్తూ, అలసిపోయి నిద్రలోకి జారుతుంది. అయినా, రాజ్ రాత్రంతా ఫైల్స్ చదివి పూర్తి చేస్తాడు. ఉదయం అపర్ణ, ఇందిరలు వచ్చి చూస్తే, కావ్య ఒడిలో రాజ్ నిద్రపోతూ కనిపిస్తాడు.

ఇందిర ఇద్దరినీ లేపి, “ట్రైనింగ్ అంటే ఇదేనా? ఏం చేస్తున్నారు మీరు?” అని అడుగుతుంది. కావ్య సిగ్గుపడి.. “ఆఫీస్‌కి రెడీ అవ్వాలి!” అని తప్పించుకుంటుంది. రాజ్ గర్వంగా.. “మా మధ్య కెమిస్ట్రీ ఎలా ఉందో చూశారా?” అని అడగ్గా.. “రాత్రంతా నీవు ఫైల్స్‌తో కుస్తీ పడటం మేము చూశాము!” అని ఇందిర సరదాగా చెబుతుంది.

అప్పూ, కల్యాణ్ హనీమూన్ గొడవ

అప్పూ పోలీస్ స్టేషన్‌కి బయల్దేరుతుండగా, యామిని మనుషుల నుంచి ఫోన్ వస్తుంది. “డబ్బులు రెడీ చేశాము, నీ చేతుల మీదే ఇస్తాము” అని చెబుతారు. ఇంతలో కల్యాణ్ వచ్చి, “ఏమైంది?” అని అడుగుతాడు. అప్పూ పోలీస్ స్టేషన్‌లో జరిగిన విషయాలను వివరిస్తుంది. “నువ్వు అందరి సమస్యలు పరిష్కరిస్తావు, కానీ నా సమస్య మాత్రం పట్టించుకోవు” అని కల్యాణ్ అంటాడు. “కొత్తగా పెళ్లైన భర్త భార్యకు దూరంగా ఉండటం ఎంత కష్టమో నీకు తెలుసా? ఫస్ట్ నైట్‌కి ఒప్పుకున్నావు, కానీ హనీమూన్‌కి ఎందుకు ఒప్పుకోవు?” అని అడుగుతాడు.

కళ్యాణ్ రొమాంటిక్‌గా, “కొత్త జంట అంటే భర్త భార్య కొంగు పట్టుకుని తిరగాలి, సాయంత్రం 6 తర్వాత గదిలో ఉండాలి. ఉదయం 10 గంటలకు బయటకు రావాలి” అని చెబుతాడు. అప్పూ రియాక్ట్ అవుతూ.. “నా డ్యూటీ వల్ల లీవ్ దొరకడం కష్టం, సీఐ పర్మిషన్ ఇవ్వడు” అని సమాధానం చెబుతుంది. కల్యాణ్ నిరాశగా.. “హనీమూన్ కూడా కుదరదా?” అని అడుతుతుండగానే.. అప్పూ అతని మాటలను పట్టించుకోకుండా వెళ్లిపోతుంది.

రాహుల్‌తో ఆడుకున్న స్వప్న

రాహుల్ గత కుట్రల కారణంగా ఇంటి పనోడిగా మారిన తర్వాత, స్వప్న అతనికి కఠిన శిక్షలు విధిస్తుంది. చెత్త క్లీన్ చేయించడంతోపాటు కారును కూడా క్లీన్ చేయమని చెబుతుంది. కాస్త రెస్ట్ తీసుకుంటానంటే అతనికి మరిన్ని శిక్షలు వేస్తానని వార్నింగ్ ఇస్తుంది. “ఒక్క కాఫీ ఇవ్వు, స్వప్న” అని అడుగుతాడు. “పని పూర్తయ్యాకే కాఫీ” అని తిరస్కరిస్తుంది. “సెకండ్ సెటప్ పెట్టినప్పుడు ఈ శిక్ష గుర్తులేదా?” అని ఎద్దేవా చేస్తుంది. “బుద్ధి గడ్డి తిని అలా చేశాను, ఇంతలా శిక్షించాలా?” అని రాహుల్ వాపోతాడు. “తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే, శిక్ష శిక్షే” అని గట్టిగా చెబుతుంది.

రాహుల్ అరగంట రెస్ట్ అడుగుతాడు. అప్పుడు స్వప్న స్పందిస్తూ.. బయటి పనోళ్లకు డబ్బు కట్ చేస్తాం, నీకు ఫుడ్ కట్ చేస్తాం.. అరగంట రెస్ట్‌కు టిఫిన్ కట్, గంటకు లంచ్ కట్ అని హెచ్చరిస్తుంది. రాహుల్ షాక్‌తో పని కొనసాగిస్తాడు. రుద్రాణి వచ్చి “కర్మ ఎవరినీ వదిలిపెట్టదు, నీవు చేసుకున్నవి అనుభవిస్తున్నావు” అని చెబుతుంది. రాహుల్, “స్వప్నకు దొరికాను, నేను కలగన్నానా?” అని బాధపడతాడు. రుద్రాణి, “ఆస్తి పిచ్చి ఉన్నవాళ్లకు ఆడదాని పిచ్చి ఉండకూడదు” అని అతనితో అంటుంది.

రాజ్‌ను చూసి ఫ్యామిలీ షాక్

ఇక అటు యామిని.. సిద్ధార్థ్‌కు ఫోన్ చేసి, బోర్డ్ మీటింగ్‌లో కావ్యను అవమానించే పథకం వివరిస్తుంది. కావ్య ఎండీగా పనికిరాదని ప్రూవ్ చేసి, స్వరాజ్ గ్రూప్‌ను నా సొంతం చేసుకుంటా అని సిద్ధార్థ్ చెబుతాడు. యామిని షాకింగ్ విషయం చెబుతుంది. రాజ్ బోర్డ్ మీటింగ్‌కు వస్తున్నాడు అని చెప్పడంతో సిద్ధార్థ్ ఆశ్చర్యపోతూ.. రాజ్ చనిపోయాడు కదా? వాడు ఎలా వస్తాడు అని అడుగుతాడు. యామిని.. రాజ్ బతికే ఉన్నాడు, కానీ అతని గతం మరిచిపోయాడు. కావ్య అతనికి ట్రైనింగ్ ఇస్తోంది అని వివరిస్తుంది.

రాజ్‌కు గతం గుర్తులేకపోతే నేను ఈజీగా హ్యాండిల్ చేస్తా.. కానీ గుర్తొస్తే నా షేర్స్ కూడా లాగేసుకుంటాడు అని సిద్ధార్థ్ భయపడతాడు. మీటింగ్‌లో రాజ్‌ను అవమానిస్తే కావ్య ఓడిపోతుంది.. కంపెనీ నీ సొంతమవుతుంది అని ప్రోత్సహిస్తుంది. పెళ్లిలో కావ్య నన్ను అవమానించింది.. ఇప్పుడు రాజ్, కావ్య ఇద్దరినీ దెబ్బతీస్తా అని సిద్ధార్థ్ చెబుతాడు. ఇటు రాజ్ ఎండీగా రెడీ అయి బోర్డ్ మీటింగ్‌కు బయల్దేరుతాడు. అతని నడక, కాన్ఫిడెన్స్ చూసిన దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ తింటుంది. అంతేకాదు రేపటి ఎపిసోడ్లో వచ్చే ట్విస్ట్ మరో లెవెల్ అని చెప్పాలి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More