బ్రహ్మముడి జూన్ 16 ఎపిసోడ్: రాజ్ మనసు మార్చేసిన కనకం- ఎంగేజ్‌మెంట్ రింగ్స్ కొట్టేసిన కనకం- కావ్య మాటలకు తడబడిన యామిని!
బ్రహ్మముడి సీరియల్ జూన్ 16 ఎపిసోడ్‌లో యామిని హారతి ఆరిపోయేలా కనకం చేస్తుంది. దోషం, పెళ్లి ఆపేయాలని చెప్పిన పంతులు పెద్ద ట్విస్ట్ ఇచ్చి ఎంగేజ్‌మెంట్ జరిపించి మళ్లీ ముహుర్తం పెడతానంటాడు. దాంతో రాజ్ దగ్గరికి వెళ్లిన కనకం అల్లుడి మనసు మార్చేస్తుంది. యామినికి కావ్య ఉపదేశం ఇస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నాకు యామినిని చంపాలని ఉంది. కానీ, మన ముందున్న లక్ష్యం పెళ్లి ఆపడం. కాబట్టి పంతులు చెప్పినట్లు చేయమని కనకంకు చెబుతుంది ఇందిరాదేవి. అమ్మవారి పూజ చేసిన పంతులు పూజ పూర్తి అయింది. హారతి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోమ్మని యామినికి చెబుతాడు పంతులు. అలాగే, హారతి మీద అందరి దృష్టిని ఉంచమని అది ఆర్పేయమంటూ కనకం వాళ్లకు హింట్ ఇస్తాడు పంతులు.

పంతులు చిరాకు
అది అర్థం చేసుకున్న కనకం ఫ్యాన్ దగ్గరికి వెళ్లి హారతి ఆర్పేందుకు ట్రై చేస్తుంది. కానీ, ఏం చేసిన ఫ్యాన్ పని చేయదు. యామిని హారతి ఇచ్చి కింద పెట్టబోతుంటే పంతులు ఆపి అన్ని విఘ్నాలు తొలగిపోవాలంటే మరో మూడు సార్లు హారతి ఇవ్వమని చెబుతాడు. అలా ఎక్కడ వినలేదు అని వేదేహి ప్రశ్నిస్తే పంతులు చిరాకు పడతాడు. అందరికి సమాధానం ఇచ్చుకుంటూ పోలేను అని కోప్పడతాడు.
దాంతో యామిని మరోసారి అమ్మవారికి హారతి ఇస్తుంది. ఇంతలో ఫ్యాన్ పని చేస్తుంది. ఆ ఫ్యాన్‌ను హారతి వైపుకు పెడుతుంది కనకం. దాంతో హారతి ఆరిపోతుంది. దీపం ఆరిపోయిందని ఇందిరాదేవి అంటుంది. అప్పుడు కర్ర విరిగింది, ఇప్పుడు దీపం ఆరిపోయింది. విడ్డూరంగా లేదు అని అపర్ణ అంటుంది. ముత్తైదువులు మీరేం మాట్లాడరా అని ఇందిరాదేవి అంటుంది.
అయ్యయ్యో ఇలా జరగకూడదు. అరిష్టం. పెళ్లి ఆపేయండి అని వాళ్లు అంటారు. పదే పదే ఇలా జరిగితే ఏదో దోషం ఉన్నట్లేగా అని ఇందిరదాదేవి అంటుంది. నా సాయశక్తుల నేను ప్రయత్నించాను. కానీ, ఈ పెళ్లి జరగడం ఆ అమ్మవారికి కూడా ఇష్టం లేనట్టుంది. ఈ పెళ్లి ఇక్కడితే ఆపేయడం వధువరులు ఇద్దరికి మంచిది అని పంతులు భయంతో అంటాడు.
అమ్మవారే పెళ్లి ఆపేసింది
ఇంతదాకా వచ్చాక పెళ్లి ఆపేయడం ఏంటని వైదేహి అంటుంది. పెళ్లి ఆపేస్తేనే వధువరుల ప్రాణాలకు క్షేమం. అందుకేనేమో ఇదివరకు యాక్సిడెంట్ అయిందని పంతులు అంటాడు. అమ్మవారే పెళ్లి ఆపేసింది. ఇక నా మనవడు, మనవరాలిని ఎవ్వరు వేరు చేయలేరు అని ఇందిరాదేవి సంతోషిస్తుంది. కానీ, అలా పెళ్లి ఆపేయండి అని అంటాను అనుకున్నారా. లేదు, ఎలాగైనా పెళ్లి జరిపిస్తాను అని పంతులు పెద్ద ట్విస్ట్ ఇస్తాడు.
దాంతో కనకం వాళ్లు షాక్ అవుతారు. మీరు జరిపించినా నిశ్చితార్థం ముహుర్తంలోనే అరిష్టం ఉంది. అందుకే మళ్లీ నిశ్చితార్థం చేయించి అక్కడ మళ్లీ పెళ్లికి ముహుర్తం పెడతాను. అప్పుడు వాళ్ల పెళ్లికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. అప్పుడు ఎన్ని దుష్ట గ్రహాలు అడ్డు వచ్చిన పెళ్లిని ఆపలేవు అని పంతులు అంటాడు. అయితే, భార్యతో కనకం వాళ్లు పెళ్లి ఆపేయమనడం గురించి పోన్‌లో మాట్లాడుతాడు పంతులు.
ఆ మాటలు యామిని వింటుంది. పెళ్లి ఆపాలని అంటున్నారు అని కోపంగా అంటుంది. వాళ్లు భయపెట్టారు. మీరు చెప్పింది చేస్తాను అని పంతులు అంటాడు. అయితే ఈ పెళ్లి ఆగకుండా జరగాలి అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది యామిని. అదంతా గుర్తు చేసుకుంటుంది యామిని. చెప్పాను కదా ఈ యామిని కుళ్లుకుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్. పంతులును బెదిరించి మాట మార్చేలా చేసింది అని కనకం అంటుంది.
యామిని సెటైర్లు
నిశ్చితార్థం చేయించి మళ్లీ కాస్తా అటు ఇటుగా ముహుర్తం పెడతాను అని పంతులు అంటాడు. దాంతో దుగ్గిరాల కుటుంబంపై సెటైర్లు వేస్తుంది యామిని. పూజ అయిపోయిందని అంతా వెళ్లిపోతారు. కావ్యను ఆపిన యామిని దీపాలు ఆర్పడం, కర్రలు విరగొట్టడం ఏంటీ. ఇంత చీప్‌గా ఆలోచించడం ఏంటీ అని అంటుంది. నేను ఆపాలనుకుంటే క్షణం పట్టదు అని కావ్య అంటుంది.
నువ్ స్వార్థంగా ఆలోచిస్తున్నావని నీకు తెలిసి రావాలి. నువ్ ఒక కథ అల్లింది నిజం కాదా. ప్రేమించకపోతే చచ్చిపోతానని బెదిరించడం నిజం కాదా. నీ ప్రయత్నంలోనే నిజాయితీ లేనప్పుడు అది సక్సెస్ అవుతుందని ఎలా అనుకుంటున్నావ్. మా వాళ్లు ఏదో కంగారుపడి ప్రయత్నాలు చేస్తున్నారు. నేను మాత్రం ఆపను. ఈ పెళ్లి జరగదు అని కావ్య ఉపదేశం ఇస్తుంది.
ఓవర్ కాన్ఫిడెన్స్. ఇదివరకే నేను నిన్ను ఓడించాను అని యామిని అంటుంది. అంతా జరగొచ్చు కానీ, నీ మెడలో తాళి కట్టడానికి అరక్షణం ముందు ఆయన మనసులోకి నేను వస్తే చాలు పెళ్లి ఆగిపోవచ్చు అని కావ్య చెప్పేసి వెళ్తుంది. నువ్ ఇలాంటి పిచ్చి ఊహళ్లో ఉండటమే నాకు కావాల్సింది అని యామిని అనుకుంటుంది. అంతా సర్వనాశనం అయిపోయిందని, యామినికే మన ప్లాన్ తెలిసిపోయిందని అపర్ణకంగారుపడుతుంది.
కళావతి ప్రేమిస్తుందని
నా కంఠంలో ఉండగా యామిని మెడలో నా అల్లుడితో తాళి కట్టించను. ఇప్పుడున్న ఏకైక మార్గం అల్లుడి మనసు మార్చేయడం. నేను అల్లుడి గారి మనసు మార్చేస్తాను అని కనకం వెళ్తుంది. రాజ్ దగ్గరికి కనకం వెళ్లి అల్లుడు గారు అని పిలుస్తుంది. మీరు ఎవరో నాకు తెలియదు అని రాజ్ షాక్ అవుతాడు. దాంతో కళావతి నా కూతురు అని చెబుతుంది కనకం.
నా పేరు కనకం అయిన నాకు కన్నీళ్లు మిగిలేలా ఉన్నాయి. మిమ్మల్నే ప్రాణం అనుకుంది నా కూతురు. అలాంటి నా కూతురు కళ్లముందే మీరు పెళ్లి చేసుకుంటే అదెలా తట్టుకుంటుంది. తన మనసులో ఏముందో మీకు చెప్పుకోలేకపోతుంది అని కనకం అంటుంది. తెలుసు. కళావతి నన్ను ప్రేమిస్తుందని తెలుసు. కానీ, పరిస్థితులు అనుకూలించనప్పుడు ఏం చేస్తాం అని రాజ్ అంటాడు.
యామిని చస్తానని బెదిరించిందని తెలుసు. ఒకవేళ నా కూతురుని మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం వస్తే చేసుకుంటారా అని కనకం అంటే చేసుకుంటాను అని రాజ్ అంటాడు. ఆ దేవుడికి కూడా కళావతిని మిమ్మల్ని విడదీయడం ఇష్టం లేనట్లుంది. యాక్సిడెంట్, కర్ర విరగడం, హారతి ఆరిపోవడం ఇన్ని అపశకునాలు జరుగుతున్నాయంటే మీ పెళ్లి నా కూతురుతోనే జరుగుతుంది అని అంటుంది.
వేదేహి కిందపడేలా
దాంతో రాజ్ సంతోషిస్తాడు. అలా కావ్యతోనే పెళ్లి జరుగుతుందని రాజ్ మనసు మార్చేసి వెళ్లిపోతుంది కనకం. మరోవైపు యామిని, రాజ్ నిశ్చితార్థం జరిపిస్తుంటారు. ఉంగరాలు తీసుకురమ్మని వైదేహికి పంతులు చెబుతాడు. దాంతో వేదేహి తీసుకువస్తుంది. కానీ, ఫ్లొర్ మ్యాట్ కిందకు జరిపి వైదేహి కిందపడేలా చేస్తుంది కనకం. వెళ్లి వైదేహిని పట్టుకుని రింగ్స్ బాక్స్‌కు బదులు ఖాలీగా ఉన్న డబ్బా పెడుతుంది కనకం.
ఉంగరాలు కొట్టేస్తుంది కళావతి తల్లి కనకం. రింగ్స్ బాక్స్ తీసి చూస్తే ఉంగరాలు లేవని పంతులు చెబుతాడు. ఈ పెళ్లి జరగడం కంటే ఆగిపోవడమే ఎక్కువైంది. దోషాలు పోవాలని నిశ్చితార్థం జరిపిస్తే అది కూడా ఆగిపోయేలా ఉందని ధాన్యలక్ష్మీఅంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



