బ్రహ్మముడి జూన్ 20 ఎపిసోడ్: రుద్రాణికి తెలిసిపోయిన అప్పు ప్లాన్- ఎలా దెబ్బకొట్టాలో తెలుసన్న యామిని- పెళ్లి ఆపిన రుద్రాణి

బ్రహ్మముడి సీరియల్ జూన్ 20 ఎపిసోడ్‌లో రౌడీకి యామిని డబ్బు ఇచ్చింది కల్యాణ్ వీడియో తీసినట్లు ఇందిరాదేవి వాళ్లకు అప్పు చెబుతుంది. అది విన్న రుద్రాణి వెళ్లి యామినికి చెబుతుంది. నా ప్లాన్స్ నాకున్నాయని యామిని చెబుతుంది. యామినికి రాజ్ తాళి కట్టబోతుంటే రుద్రాణే పెళ్లి ఆపండని అంటుంది.

Jun 20, 2025, 07:12:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఇష్టమైన వ్యక్తి దూరంగా వెళ్తుంటే ఇంత బాధగా ఉంటుందని తెలియదు అని కావ్యకు చెబుతాడు రాజ్. దాంతో కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీకు నాలాగే ఉంది కదూ. లోలోపల బాధ ఉన్నా పైకి నటిస్తున్నారుగా. నిజమేంటో చెప్పండి అని రాజ్ అంటాడు.

బ్రహ్మముడి సీరియల్‌ జూన్ 20వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జూన్ 20వ తేది ఎపిసోడ్

పెళ్లి చేసుకుంటానంది మీరు

అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా. తెల్లవారితే పెళ్లి. ఇప్పుడు 11 గంటలు. ఈ సమయంలో అమ్మాయిని పిలిచి బాధగా ఉందా అని అడుగుతున్నారు. మీరు పెళ్లి చేసుకుంటే నాకెందుకు బాధగా ఉంటుంది. యామినికి మాటిచ్చింది మీరు. పెళ్లి చేసుకుంటానంది మీరు. నిర్ణయాలన్నీ మీరు తీసుకుని నన్ను ప్రశ్నిస్తున్నారు. మీకు ఏం కావాలో మీకే క్లారిటీ లేనప్పుడు నేనేం చేస్తాను అని కావ్య హిత బోధ చేస్తుంది.

నా లైఫ్‌లో నాకు ఏం కావాలో నాకు క్లారిటీ ఉంది. మీరు మీ మనసుని అడిగి ఓ క్లారిటీ తెచ్చుకోండి. తర్వాత నా దగ్గరికి వచ్చి చెప్పండి అని కావ్య వెళ్లిపోతుంది. కనకం, అపర్ణ, ఇందిరాదేవి ముగ్గురు ఒకేచోట ఉండటం రుద్రాణి, రాహుల్ చూస్తారు. కచ్చితంగా పెళ్లి ఆపేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఏం చేస్తున్నారో చూద్దాం అని రుద్రాణి అంటుంది.

ఇంతలో కల్యాణ్ వచ్చి ప్లాన్ సక్సెస్ అంటారు. యామిని రౌడీకి డబ్బు ఇచ్చేది కల్యాణ్ ఫోన్‌లో రికార్డ్ చేసినట్లు మాట్లాడుకుంటారు. అది ఇందిరాదేవికి చూపిస్తారు. ఈ సాక్ష్యంతో యామిని అరెస్ట్ చేసి లోపల పడేస్తే జీవితాంతం జైలులో ఉంటుందని అప్పు అంటుంది. త్వరగా ఈ విషయాన్ని యామినికి చెప్పాలని రుద్రాణి, రాహుల్ వెళ్తారు. ఇప్పుడే అరెస్ట్ చేయమని కనకం అంటుంది.

నిన్ను అరెస్ట్ చేస్తారు

అలా కాదు అని ఆ రౌడీ యామిని దగ్గర డబ్బు తీసుకుని పారిపోతుంటే పట్టుకుని, వాడు నిజం ఒప్పుకున్నట్లు చేసి వారెంట్ తీసుకుని అరెస్ట్ చేయాలని అప్పు అంటుంది. మరోవైపు రుద్రాణి చెప్పింది యామిని విని షాక్ అవుతుంది. కచ్చితంగా ఈ పెళ్లి ఆపడానికి వాళ్లు నిన్ను అరెస్ట్ చేస్తారు. ఏం చేద్దాం అని రుద్రాణి అంటుంది. ఏం చేయొద్దు మీరు నాకు చెప్పినట్లు వాళ్లకు తెలియనివ్వకండి. ఈ పెళ్లిని వాళ్లు ఆపరు. ఏం చేయాలో నేను చూసుకుంటాను అని యామిని అంటుంది.

ఆ అప్పును ఎలా దెబ్బకొట్టాలో నాకు తెలుసు. నా ప్లాన్స్ నాకున్నాయని యామిని అంటుంది. కావ్య దగ్గరికి యామిని తండ్రి రఘునందన్ వచ్చి మాట్లాడటానికి ట్రై చేస్తాడు. నా కూతురు బాధపడకుండా ఉండాలంటే ఈ పెళ్లి ఆగకూడదు. అది తప్పని తెలిసిన నా కూతురు సంతోషం చేయకతప్పట్లేదు. ఈ పెళ్లి ఆపడానికి ఎలాంటి ప్లాన్స్ చేయొద్దు అని చేతులెత్తి మొక్కుతాడు రఘునందన్.

కూతురు గురించి ఆలోచించినా మీరు ఇంకో ఆడపిల్లకు అన్యాయం చేస్తున్నారని చూడట్లేదు. నాన్న అంటే అండగా ఉండేవాడు. మీది స్వార్థం. దానికి కచ్చితంగా శిక్ష దేవుడే వేస్తాడు. నేను ఏ ప్లాన్ వేయను. కానీ, ఈ పెళ్లి దానంతటా అదే ఆగిపోతుందని కావ్య వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్‌కు బాసింగం కట్టమని కల్యాణ్‌కు ఇస్తుంది కావ్య. త్వరగా రెడీ చేసి తీసుకురమ్మని చెబుతుంది కావ్య.

కావ్య ప్రవర్తనపై

దానికి రాజ్, కల్యాణ్ షాక్ అవుతారు. ఇందిరాదేవి వాళ్లు వస్తారు. కావ్య ప్రవర్తనపై కోప్పడతాడు రాజ్. ఇందిరాదేవికి చెప్పుకుంటాడు. నన్ను కాలర్ పట్టుకుని నిలదీయకుండా ఏం సంబంధం లేనట్లు వెళ్లిపోతుందేంటీ. అసలు కళావతి గారు నిజంగా నన్ను ప్రేమించిందా అని రాజ్ అంటాడు. అంత ఈజీగా అర్థమైతే అది కళావతి ఎందుకు అవుతుందని అపర్ణ అంటుంది.

ఆ దేవుడే ఈ పెళ్లి ఎలా ఆపేస్తాడో చూడండి అని కనకం అంటుంది. యామిని పెళ్లికూతురిలా తయారై వస్తుంది. కావ్య చూసి పక్కకు వెళ్లిపోతుంటే.. నేను ఎలా ఉన్నానో చెప్పమంటుంది. కళలోని మొహానికి ఏ గెటప్ వేస్తే ఏంటీ. పెళ్లి కూతురిలానే ఉన్నావని కావ్య అంటుంది. కాసేపట్లో మా ఇద్దరి పెళ్లి మొత్తం కళ వచ్చేస్తుందని యామిని అంటుంది.

పెళ్లిపీటలపై రాజ్, కావ్య కూర్చొంటారు. కాసేపు రాజ్ దూరమైనట్లు వాళ్లతో కలిసిపోయి నటిద్దాం ఇప్పుడు వాళ్లు వేసిన ప్లాన్‌లో యామిని ఇరుక్కుంటుంది అనుకుంటున్నారు. కానీ, వాళ్లే ఇరుక్కున్నారని యామిని పెళ్లి అయ్యేదాక తెలియదు. అప్పుడు కూడా వాళ్లవైపు ఉన్నట్లు నటిస్తేనే కదా నిన్ను రాజ్ ప్లేసులో కూర్చోబెట్టగలను అని రాహుల్‌తో రుద్రాణి అంటుంది.

పెళ్లి ఆపమన్న రుద్రాణి

పద స్టార్ట్ చేద్దామని వెళ్లి కూర్చొంటారు రుద్రాణి, రాహుల్. మీరు మాత్రం సైలెంట్‌గా కూర్చున్నారేంటీ అని ఇందిరాదేవితో అంటుంది రుద్రాణి. తర్వాత యామిని మెడలో రాజ్ తాళి కట్టబోతుంటే రుద్రాణినే పెళ్లి ఆపండి అని అరుస్తుంది.

యామినిని అరెస్ట్ చేస్తున్నాం. కళావతిని చంపడానికి రఘు అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చారట కదా అని కానిస్టేబుల్ అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. పెళ్లి ఆగిపోయినట్లు చూపిస్తారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More