బ్రహ్మముడి జూన్ 21 ఎపిసోడ్: పెళ్లిలో మాట మార్చిన కిల్లర్- వీడియో డిలీట్- కొంపముంచిన రాహుల్- అప్పును తప్పుబట్టిన రాజ్!

బ్రహ్మముడి సీరియల్ జూన్ 21 ఎపిసోడ్‌లో యామిని పెళ్లికి పోలీసులు కిల్లర్ రఘును తీసుకొస్తారు. వారిని చూసి ఆపండి అని రుద్రాణి అరుస్తుంది. కళావతిని యామిని చంపడానికి ప్రయత్నించిందని అప్పు చెబుతుంది. కానీ, కిల్లర్ రఘు మాత్రం మాట మార్చి యామిని ఎవరో తెలియదంటాడు. యామిని డబ్బు ఇచ్చిన వీడియో డిలీట్ అవుతుంది.

Jun 21, 2025, 07:25:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో పెళ్లి ఆపడం లేదా అని రుద్రాణి నువ్వెందుకు ఆపడం లేదు అని ఇందిరాదేవి అంటుంది. అంత బలగం ఉంటే నా కొడుకును ఎప్పుడో ప్రయోజకుడిని చేసేదాన్ని అని రుద్రాణి అంటుంది. కావ్య ఏంటీ సైలెంట్‌గా ఎందుకు ఉంది. నీ మొగుడికే పెళ్లి జరుగుతుందని తెలుసా అని రుద్రాణి అంటుంది.

బ్రహ్మముడి సీరియల్‌ జూన్ 21వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జూన్ 21వ తేది ఎపిసోడ్

బ్రహ్మముడి పురాణం

నేను పెళ్లి ఆపడం లేదు. కానీ, ఈ పెళ్లి జరగదు అని కావ్య అంటుంది. ఏంటీ అదెలా అని రుద్రాణి అంటుంది. అయిపోయింది. రుద్రాణి పని అయిపోయింది. ఆ బ్రహ్మముడి పురాణం చెబుతుంది కావ్య అని అపర్ణ అంటుంది. అలాగే, రాహుల్, రుద్రాణికి కావ్య తన బ్రహ్మముడి వల్లే రాజ్ పెళ్లి ఆగిపోతుందని చెబుతూనే ఉంటుంది. రుద్రాణి తిక్క బాగా కుదిరింది అని అపర్ణ అంటుంది.

అప్పు, కల్యాణ్ పోలీసుల కోసం ఎదురుచూస్తుంటారు. కానిస్టేబుల్‌ శేష్‌కు కాల్ చేసి త్వరగా రమ్మని అప్పు చెబుతుంది. మాంగళ్య ధారణ కానివ్వండి అని రాజ్‌‌కు తాళి ఇస్తాడు పంతులు. రాజ్ మాత్రం కావ్యను చూస్తూ ఉంటాడు. ఇంతలో పోలీసులు వస్తారు. అది చూసిన రుద్రాణి రాహుల్‌కు చెబుతుంది. ఇంకెందుకు లేట్ మనవాళ్లకు సపోర్ట్ చేస్తున్నట్లుగా యాక్టింగ్ మొదలుపెట్టు అని రాహుల్ అంటాడు.

యామినికి రాజ్ తాళి కట్టబోతుంటే ఆపండి అని రుద్రాణి అరుస్తూ లేస్తుంది. అవ్వదు ఈ పెళ్లి అవ్వదు. ఇప్పటివరకు కనకమే అనుకున్న ఇప్పుడు కొత్త క్యారెక్టర్ వచ్చిందని పంతులు అనుకుంటాడు. మనం చేయాల్సిన పని రుద్రాణి చేస్తుందేంటీ అని అపర్ణ అంటుంది. పోలీసులు వచ్చినట్లు రుద్రాణి చెబుతుంది. యామినిని అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు పోలీసులు చెబుతారు.

చంపాలని చూడటం నేరమే

నేనేం చేశాను అని యామిని అంటుంది. ఒక మనిషిని చంపడమే కాదు చంపాలని చూడటం కూడా నేరమే. అటెంప్ట్ మర్డర్ కేస్ కింద అరెస్ట్ చేస్తున్నాం. రెండు రోజుల క్రితం వికారాబాద్ ఫారెస్ట్‌లో కళావతిని చంపించడానికి రఘు అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చారట కదా అని కానిస్టేబుల్ అంటాడు. కళావతిని యామినికి చంపాల్సిన అవసరం ఏంటని రుద్రాణి అంటుంది.

ఇలాంటి లాజిక్‌లు మాట్లాడితే పళ్లు రాలిపోతాయ్. వియ్యపురాలివని చూడను అని కనకం వార్నిగ్ ఇస్తుంది. కట్టు కథలను అల్లితే నమ్ముతామా అని వైదేహి అంటుంది. కారణం ఉంది. మీతో సరదాగా గడపాలని అనుకున్న యామిని నువ్వు మా అక్కతో వెళ్లడం చూసింది. అది తట్టుకోలేకపోయింది యామిని అని అప్పు చెబుతుంది. చూశాను అని యామిని అంటుంది.

రామ్ దూరంగా ఉండటానికి కారణం కళావతి అని తెలిసి ఫినీష్ చేయాలనుకుందని అప్పు చెబుతుంది. దాంతో అంతా యామిని తిడతారు. కళావతిని నువ్ చంపాలని చూశావా అని రాజ్ అడుగుతాడు. తనెందుకు చెబుతుంది. ఆమె ఎవరికి డబ్బులిచ్చిందో ఆ వ్యక్తే నిజం చెప్పడానికి వచ్చాడని రఘును తీసుకొస్తారు. యామిని గురించి చెప్పమని అప్పు అంటే.. యామిని ఎవరు. నాకు తెలియదు. ఇదే మొదటి సారి చూస్తున్నాను అని కిల్లర్ రఘు మాట మార్చేస్తాడు.

మాయమైన వీడియో

నిన్న యామిని నీకు కోటి రూపాయలు ఇవ్వడం చూశాను అని అప్పు అంటుంది. కొట్టి బెదిరించి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిస్తున్నావ్ అని యామిని అంటుంది. నువ్ వాడికి కోటి రూపాయలు ఇవ్వడం వీడియో తీశాను అని కల్యాణ్ అంటాడు. కానీ, ఆ ఫోన్‌లో వీడియో ఉండదు. వీడియో కనిపించట్లేదు అని అప్పు చెబుతుంది. దాంతో యామిని సంతోషిస్తుంది.

కల్యాణ్, అప్పుపడుకున్నప్పుడు రాహుల్ వెళ్లి వీడియో డిలీట్ చేసింది గుర్తు చేసుకుంటారు. అలా రాహుల్, రుద్రాణి కొంపముంచుతారు. వీడియో ఏది. డిలీట్ అయిపోయిందా. మళ్లీ కొత్త కథ చెప్పి రామ్‌ను నమ్మించ అని యామినిఅంటుంది. ఇప్పటివరకు నన్ను హంతకురాలిలా చూశారు. ఇప్పుడు మాట్లాడండి అని యామిని అంటుంది.

ఏంటిది అప్పు. అసలు నువ్వు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావ్ అని రాజ్ అప్పును తప్పుబడతాడు. అప్పు వేసిన ప్లాన్ బెడిసికొట్టడంతో సైలెంట్‌గా ఉండిపోతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడిసీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More