బ్రహ్మముడి జూన్ 24 ఎపిసోడ్: కథను మలుపు తిప్పిన రుద్రాణి- స్వప్నను కత్తితో పొడిచిన రౌడీ- యామిని ఉచ్చులో కావ్య- అపర్ణ డౌట్

బ్రహ్మముడి సీరియల్ జూన్ 24 ఎపిసోడ్‌లో కళావతికి లవ్ ప్రపోజ్ చేయమని రాజ్‌కు యామిని సలహా ఇస్తుంది. కానీ, కావ్యకు కాల్ చేసి హాస్పిటల్‌కు వెళ్లిన మీ అక్క స్వప్నను నేను పంపిన రౌడీలు కిడ్నాప్ చేస్తారు. పారిపోవాలని చూస్తే చంపేందుకు కూడా వెనుకాడరు అని యామిని చెబుతుంది. దాంతో రాజ్ వచ్చినా కావ్య వెళ్లిపోతుంది.

Published on: Jun 24, 2025, 07:13:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్‌తో పెళ్లి ఆగిపోవడంతో లోపలికి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంటుంది యామిని. దాంతో రాజ్‌ను వైదేహి నిందిస్తూ తిడుతుంది. యామినిని మోసం చేస్తున్నట్లు అనిపించింది. అందుకే పెళ్లి వద్దనుకున్నాను అని రాజ్ అంటాడు. ఇంతలో యామిని డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వస్తుంది.

బ్రహ్మముడి సీరియల్‌ జూన్ 24వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జూన్ 24వ తేది ఎపిసోడ్

పెళ్లి అంటేనే ఇష్టం లేదు

నిజంగానే చనిపోవాలనే అనుకున్నా. కానీ, బావ సైడ్ నుంచి ఆలోచించా. బావకు ఈ పెళ్లి అంటేనే ఇష్టం లేదు. కేవలం నాకు ఏమవుతుందో అనే భయంతోనే పెళ్లి ఒప్పుకున్నాడు. బావ మనసులో ఇంకెవరో ఉన్నారు. నాకు కావాల్సింది నీ జాలి కాదు. నీ ప్రేమ. నీ మనసులో ఇంకొకరు ఉంటే నేనెందుకు పెళ్లి చేసుకుంటా. లైఫ్ లాంగ్ బాధపడటం కంటే దూరమవడమే మంచిది అని యామిని అంటుంది.

నీకు ఎవరు ఇష్టమో వాళ్లనే పెళ్లి చేసుకో అని యామిని అంటుంది. సారీ యామిని ఒక రకంగా అంతమంది ముందు అవమానించాను అని రాజ్ అంటాడు. సరే నీ మనసులో ఉంది ఎవరు బావ అని యామిని అడిగితే.. కళావతి అని రాజ్ చెబుతాడు. నీకు మంచి జోడీ అని కొత్త డ్రామా ఆడుతుంది యామిని. వెంటనే వెళ్లి కావ్యకు ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకుంటా అని ప్రపోజ్ చేయి అని యామిని అంటుంది.

థ్యాంక్యూ యామిని అని రాజ్ వెళ్లిపోతాడు. నువ్ నిజంగానే బాగున్నావా. సడెన్‌గా ఇలా మాట్లాడుతున్నావేంటీ అని వేదేహి అడుగుతుంది. ఇప్పుడు కూడా చెబుతున్నా. నేను లైఫ్‌లాంగ్ రాజ్‌తోనే బతుకుతా అని యామిని అంటుంది. నీకు నిజంగా పిచ్చి పట్టినట్లు ఉందని రఘురాం అంటాడు. రాజ్ నో చెప్పగానే చనిపోవాలనుకున్నా. స్లీపింగ్ పిల్స్ వేసుకుందామని తీసుకున్నా అని రుద్రాణి కాల్ చేసింది చెబుతుంది యామిని.

ఆలోచించు అన్న రుద్రాణి

ఇప్పుడు నువ్ చస్తే కావ్య, రాజ్ సంతోషంగా బతుకుతారు. నీ చావు వల్ల ప్రయోజనం ఏంటీ. కావ్య ఒప్పుకుంటుందనే ఇలా చేశాడు. అదే కావ్య రెజెక్ట్ చేస్తే. కావ్య జన్మలో దగ్గరయ్యే అవకాశం లేకుంటే నీ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు నువ్ చేయాల్సింది రాజ్‌ను కావ్య నుంచి దూరం ఎలా చేయాలో ఆలోచించు అని రుద్రాణి చెబుతుంది. రుద్రాణి సలహా ఇచ్చి యామిని సూసైడ్ చేసుకోకుండా ఆపి కథను మలుపు తిప్పుతుంది.

ఇకనుంచి కావ్యకు కౌంట్ డౌన్ మొదలైంది. రాజ్ నుంచి కావ్య పారిపోయేలా చేస్తాను అని యామిని అంటుంది. మరోవైపు స్వప్న రెడీ అవుతుంటే ఎక్కడికి అని రాహుల్ అడుగుతాడు. ఫంక్షన్‌కు వెళ్తే ఏదైనా కొట్టేస్తావా అని స్వప్న అంటుంది. ఒక్కసారి కొట్టేస్తే ఫుల్ టైమ్ దొంగను చేయాలా అని రాహుల్ అంటాడు. హో నువ్ పార్ట్ టైమ్ దొంగవా అని స్వప్న సెటైర్ వేస్తుంది.

హాస్పిటల్‌కు వెళ్దాం పదా అని రాహుల్‌ను అంటుంది స్వప్న. ఇప్పుడెందుకు నీకు ఏమైనా ప్రాబ్లమా అని రాహుల్ అంటాడు. హాస్పిటల్‌లో చిన్న పిల్లలకు పోలియో డ్రాప్స్ వేస్తున్నారు. పదా అని స్వప్వ అంటుంది. అది విన్న రుద్రాణి రాహుల్ రాడు. నాకు వాడితో పని ఉంది. కావాలంటే ఆగి సాయంత్రం వరకు ఆగు అని రుద్రాణి అంటుంది. తాడు బొంగరం లేనిదానివి నీకేం తెలుస్తుందిలే అని స్వప్న ఒక్కత్తే హాస్పిటల్‌కు వెళ్తుంది.

యామిని ఉచ్చులో పడకుండా

స్వప్నతో నువ్వు వెళ్తే ఆ యామిని పన్నని ఉచ్చులో నువ్వు చిక్కుకుంటావని నిన్ను వద్దన్నానురా అని రుద్రాణి అనుకుంటుంది. మరోవైపు కావ్యకు యామిని కాల్ చేస్తుంది. రాజ్ విషయంలో నువ్వే గెలిచావ్. కానీ, ఇకనుంచి నేనే గెలుస్తాను. రాజ్ నిన్ను ఇష్టపడుతున్నాడట. నీకు లవ్ ప్రపోజ్ చేయడానికి వస్తున్నాడు. కానీ, నువ్ రెజెక్ట్ చేయాలి. రాజ్ ఐ లవ్యూ చెప్పగానే నీకు ఆ ఫీలింగ్స్ లేవని రాజ్ ప్రేమను చంపేయాలి అని యామిని అంటుంది.

పీటల మీద పెళ్లి ఆగిపోతే మారుతావనుకున్నా. కానీ, కుక్క తోక వంకరలా చేస్తున్నావ్ అని కావ్య అంటుంది. నా ప్లాన్‌లో నేను ఉన్నాను. హాస్పిటల్‌కు వెళ్లిన మీ అక్క స్వప్నను నా మనుషులు కిడ్నాప్ చేస్తారు. ఒకవేళ నువ్వు వెళ్లడం లేట్ అయితే చంపినా చంపేస్తారు. రాజ్ ఇప్పుడు వస్తే లవ్ రెజెక్ట్ చేయాలి అని యామిని అంటుంది. దాంతో కావ్య కంగారుపడుతుంది.

స్వప్నను పొడిచిన రౌడీ

రాజ్ ఇంటికి వస్తే కావ్య అర్జంట్ వర్క్ ఉందని స్వప్నను వెతకడానికి వెళ్తుంది. స్వప్నను రౌడీ కత్తితో పొడిచి చంపినట్లు చూపిస్తారు. స్వప్న పేరు చెప్పి కావ్య తన ఉచ్చులో పడేస్తుంది యామిని. మరోవైపు యామినినే తనను పంపిందని రాజ్ చెబితే.. యామినిపై అపర్ణ డౌట్ పడుతుంది.అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More