బ్రహ్మముడి జూన్ 26 ఎపిసోడ్: రౌడీ తల బద్దలు కొట్టిన కావ్య- స్వప్న కావ్యలను కాపాడిన రేవతి- అపర్ణతో గతం- నిజం వినేసిన రాజ్

బ్రహ్మముడి సీరియల్ జూన్ 26 ఎపిసోడ్‌లో జీపీఎస్ ట్రాకర్‌తో స్వప్న కోసం వెతికిన కావ్యకు కారు మాత్రం దొరుకుతుంది. స్వప్న ఉండదు. ఓ చోట స్వప్నను కత్తితో రౌడీ పొడవబోతుంటే తల బద్దలు కొట్టి కాపాడుతుంది కావ్య. మిగతా రౌడీలు రావడంతో కావ్య, స్వప్న పారితోపారు. వారి నుంచి రేవతి అనే మహిళ కావ్య స్వప్నను కాపాడుతుంది.

Jun 26, 2025, 07:32:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో స్వప్న కారుకు ఉన్న జీపీఎస్ ట్రాకర్‌ మూలంగా కావ్య ఫాలో అవుతుంది. ఇంతలో రాజ్ కాల్ చేసి నన్ను ఇన్సల్ట్ చేశారు. ఇంటికి వచ్చిన అతిథిని ఎలా చూసుకోవాలి. అలా వెళ్లిపోయారు. ఇంకా రాలేదు అని రాజ్ అంటాడు. నేను ఇప్పుడే రాలేను అని కావ్య అంటే ఏంటీ అంత కంగారుపడుతున్నారు. నా హెల్ప్ కావాల అని రాజ్ అంటాడు.

బ్రహ్మముడి సీరియల్‌ జూన్ 26వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జూన్ 26వ తేది ఎపిసోడ్

రౌడీలు ఏమైనా చేశారా

అదేం వద్దని ఇంటికి వచ్చాక మాట్లాడుతానని కావ్య కాల్ కట్ చేస్తుంది. రాజ్ కాల్ మాట్లాడటం విన్న ఇందిరాదేవి, అపర్ణ వచ్చి ఏం చెప్పిందని అడిగితే.. ఏదో సమస్యలో ఉన్నట్లుంది. తర్వాత చేస్తా అని కాల్ కట్ చేసినట్లు చెబుతాడు రాజ్. దానికి ప్రాబ్లమ్స్ లేనిది ఎప్పుడు అని ఇందిరాదేవి అంటుంది. మరోవైపు స్వప్న కారు దొరుకుతుంది. కానీ, అందులో స్వప్న ఉండదు. ఆ రౌడీలు ఏమైనా చేశారా అని కావ్య టెన్షన్ పడుతుంది.

కట్ చేస్తే స్వప్న వెంట రౌడీలు వెంట పడుతుంటారు. ఇంతలో కావ్యకు కాల్ చేసి మీ అక్కతో ఐదు నిమిషాల్లో హాయ్ చెప్పిస్తానన్నావ్. ఏమైంది. నువ్ పెట్టుకుంది యామినితో. ఇది యామిని వేట. నువ్ జీపీఎస్ ట్రాకర్‌తో కనిపెట్టాలనుకుంది నాకు తెలియదనుకున్నావా. నీ ప్లాన్ తెలిసి నా ప్లాన్ మార్చా. ఇప్పుడెల కాపాడుకుంటావ్ అని యామిని అంటుంది.

చంపేసిన చంపేస్తారు

కాపాడుకుంటా అని కావ్య అంటుంది. నా మనుషులు అసలే రౌడీ వెధవలు. చంపేసిన చంపెస్తారు అని యామిని కాల్ కట్ చేస్తుంది. ఏదొక దారి చూపించు అని కావ్య దేవుడును ప్రార్థిస్తుంది. మరోవైపు స్వప్న వెళ్లి వినాయకుడి విగ్రహం వెనుక దాక్కుంటుంది. కానీ, స్వప్నను ఓ రౌడీ చూసి కత్తి పట్టుకుని తనవైపు వెళ్తాడు. తనను ఏం చేయొద్దని స్వప్న ప్రాధేయపడుతుంది.

అయినా వినని రౌడీ కత్తితో పొడవబోతుంటే కర్రతో రౌడీ తల బద్దలు కొడుతుంది కావ్య. మిగతా రౌడీలను పిలవడంతో అక్కడి నుంచి కావ్య, స్వప్న పారిపోతారు. వారి వెంట రౌడీలు పడతారు. ఒకచోట ఇంట్లోకి వాళ్లను ఒకరు లాగుతారు. రౌడీలు వెళ్లిపోతారు. కంగారుపడొద్దు మీకేం కాదు కావ్య అని ఇద్దరు పేర్లు చెబుతుంది ఆవిడ. అసలు మీరెవరు అని షాక్ అవుతారు కావ్య, స్వప్న.

అపర్ణ ప్రేమ-ద్వేషం

నా పేరు రేవతి. మీ కుటుంబం గురించి తెలియనివారు ఉంటారా అన తాతయ్య గొప్పదనం గురించి చెబుతుంది. తర్వాత రౌడీలు బయటే ఉన్నారు. వాళ్లు వెళ్లే వరకు ఇక్కడే ఉండండి అని రేవతి చెబుతుంది. అపర్ణ గారు ఎలా ఉన్నారు. ఆవిడ ప్రేమను, ద్వేషాన్ని రెండు తట్టుకోలేం అని రేవతి అంటుంది. మీరు మా గురించి బాగా తెలిసినట్లు మాట్లాడుతున్నారు. కానీ, బయటవాళ్లలా లేరని కావ్య అంటుంది.

ఇంట్లోదాన్ని అయితే ఇలా బస్తీలో ఎందుకు ఉంటాను అని రేవతి చెబుతుంది. అయితే, అపర్ణ-రేవతికి ఏదో ఫ్లాష్‌బ్యాక్ (గతం) ఉన్నట్లు తెలుస్తోంది. కావ్య, స్వప్నకు టీ పెట్టి ఇస్తుంది రేవతి. ఇంతలో ఎవరో తలుపు కొట్టేసరికి భయపడతారు. ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో మాకు తెలుసు అని కావ్య అంటుంది. మరోవైపు కావ్య కోసం రాజ్‌తోపాటు అంతా ఎదురుచూచ్తారు.

అప్పు మాటలు విన్న రాజ్

ఇంటికి అప్పు వస్తుంది. అప్పుకు కావ్య కాల్ చేసి జరిగింది అంతా చెబుతుంది. త్వరగా రమ్మని లొకేషన్ షేర్ చేస్తుంది. కిడ్నాప్ కేసు వచ్చిందని అప్పు వెళ్తానంటుంటే ధాన్యలక్ష్మీ తిడుతుంది. దాంతో అప్పుకు ఇందిరాదేవి సపోర్ట్ చేస్తుంది. ప్రకాశం నాలుగో సింహం డైలాగ్ కొడతాడు. దాంతో అప్పు వెళ్లిపోతుంది. తర్వాత యామినిని కొట్టి కిడ్నాప్ గురించి అప్పు మాట్లాడితే ఆ నిజాన్ని రాజ్ వెంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More