బ్రహ్మముడి జూన్ 27 ఎపిసోడ్: అక్కలను కాపాడిన అప్పు- కోటలో రాణిలా రేవతి- రాజ్ కంపెనీ దక్కించుకునేలా యామిని కొత్త స్కెచ్!

బ్రహ్మముడి సీరియల్ జూన్ 27 ఎపిసోడ్‌లో రేవతి దగ్గర ఉన్న కావ్య, స్వప్నలు అప్పు రావడంతో వెళ్లిపోతారు. రేవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కోటల రాణిలా బతకాల్సినదానివి నా వల్ల దూరంగా ఉన్నావని రేవతి భర్త అంటాడు. యామిని ఇంటికి వెళ్లిన అప్పు లాగి చెంపమీద కొడుతుంది. చంపేయాలి అని వార్నింగ్ ఇస్తుంది.

Jun 27, 2025, 07:31:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య కోసం అప్పు వెళ్తుండగా.. కళావతి గురించి రాజ్ అడుగుతాడు. తనకోసమే వెళ్తున్నా. కానీ, చెప్పలేను అని మనసులో అనుకుంటుంది అప్పు. అక్కేం కాల్ చేయలేదని అప్పు చెప్పి వెళ్లిపోతుంది. కళావతి గారు ఎక్కడున్నారు. ఎప్పుడు వస్తారు అని రాజ్ అనుకుంటాడు. రాజ్‌ను కావ్యకు కాల్ చేయమని ఇందిరాదేవి వాళ్లు అంటారు.

బ్రహ్మముడి సీరియల్‌ జూన్ 27వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జూన్ 27వ తేది ఎపిసోడ్

విరబూసిన రోజా పూవు

మళ్లీ డిస్టర్బ్ చేయలేను. తను మంచి మనసుకి, మంచి మాటకు ఎవరైన మంత్రముగ్ధులు అయిపోవాల్సిందే. కళావతి గారు విరబూసిన రోజా పూవు. నేను చాలా అదృష్టవంతుడిని అని రాజ్ గొప్పగా చెబుతాడు. ఇప్పటికే లేట్ అయింది నేను వెళ్తాను అని రాజ్ అంటాడు. ఇంకో గంట ఆగితే కళావతి వస్తుందని అపర్ణ చెబుతుంది. ఇలాంటి టెన్షన్‌లో లవ్ ప్రపోజ్ చేయడం ఎందుకు రేపో, ఎల్లుండో చెబుతాను అని రాజ్ వెళ్లిపోతాడు.

మొత్తానికి యామిని మొదటి మెట్టు ఎక్కేసింది. పాపం ఆ కావ్య, స్వప్న పరిస్థితి ఎలా ఉందో అని రుద్రాణి మనసులో అనుకుంటుంది. ఇంతలో కావ్య, స్వప్న ఉన్న ఇంటి తలపును ఎవరో కొడతారు. ఆ రౌడీలు వచ్చినట్లున్నారు. మీరెళ్లి లోపల దాక్కోండి అని రేవతి తలుపు తీస్తుంది. డోర్ తీసి చూస్తే రేవతిభర్త వస్తాడు. దాంతో లోపల ఉన్న కావ్య వాళ్లను రేవతి పిలుస్తుంది.

కావ్య వాళ్లను చూసి రేవతి భర్త చూసి షాక్ అవుతాడు. వీళ్లు అని అంటుంటే రేవతి ఆపి జరిగింది చెబుతుంది. ఇంతలో అప్పు వచ్చి కావ్యకు కాల్ చేస్తుంది. దాంతో రేవతికి కావ్య, స్వప్న ఇద్దరూ థ్యాంక్స్ చెప్పి. మీరే లేకుంటే బతికేవాళ్లం కాదని అంటారు. అప్పు దగ్గరికి కావ్య, స్వప్న వెళ్తారు. అది చూసిన రౌడీలు పోలీసులు ఉన్నారని వెనక్కి తగ్గుతారు. రేవతి గురించి అప్పుకు చెబితే ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేనంటుంది అప్పు.

ఏడుస్తూ వెళ్లిపోయిన రేవతి

తీర్చుకుంటే తీరిపోయేది కాదు మన రుణం అని రేవతి అంటుంది. కావ్య వాళ్లు వెళ్లిపోతారు. అలా అక్కలను అప్పు కాపాడుతుంది. ఇక రేవతి ఏడుస్తూ వెళ్లిపోతుంది. యామినికి రౌడీ కాల్ చేసి జరిగింది చెబుతాడు. నాకు కావాల్సింది జరిగింది అని చెప్పిన యామిని కావ్య రాజ్ నీకు లవ్ ప్రపోజ్ చేయకుండా ఆపాలనుకున్నాను ఆపాను అని అనుకుంటుంది. ఇంట్లోకి వెళ్లిన రేవతి ఓ ఫొటో తీసి ఏడుస్తుంటుంది.

మన గురించి కావ్యకు ఎందుకు చెప్పలేదని భర్త అంటే మనం చేసిన తప్పు గురించి చెప్పమంటారా, తెగిన బంధం గురించి చెప్పమంటారా అని రేవతి అంటుంది. ఇదంతా నా తప్పే. నేను చేయడం వల్లే మీరు దూరమయ్యారు. నేను నీ జీవితంలోకి రాకుంటే ఆ కోటలో రాణిలా ఉండేదానివి. నీకు ఆ సంతోషం ఇవ్వలేకపోయాను. ఈ బాధ నేను జీవితాంతం మోయాల్సిందే అని భర్త అంటాడు.

మరోవైపు స్వప్న పడిన బాధ గురించి చెబుతుంది. ఇప్పుడు యామిని గురించి ఆలోచించాలి అంటుంది స్వప్న. మన ముగ్గురితో పెట్టుకుంటే నరకానికి టికెట్ కొనుక్కున్నట్లే అని చూపించాలని అప్పు అంటుంది. దాన్ని లోపల వేసి కుళ్లబొడిచేయ్. అది నాకు చావు భయం చూపించింది అని స్వప్న అంటుంది. కావ్య వద్దని, టైమ్ చూసుకుని చేద్దామంటుంది.

సైలెంట్‌గా ఉండండి

యామిని రెచ్చగొట్టింది కదా అని రెచ్చిపోతే ఇరుక్కుంటాం. నేను చెప్పేవరకు సైలెంట్‌గా ఉండండి అని కావ్య అంటుంది. ఇంతలో ఇల్లు వస్తే కావ్య, స్వప్న దిగుతారు. అప్పు పని ఉందని బయటకు వెళ్లిపోతుంది. ఇంత చేసినదానికి బుద్ధి చెప్పాలిగా అని యామిని ఇంటికి అప్పు వెళ్తుంది. ఇంటికొచ్చిన కావ్యపై ఇందిరాదేవి, అపర్ణ కోప్పడతారు. తిడతారు.

రాజ్ వస్తే తుర్రుమని వెళ్లిపోయావ్ అని చెడామడా తిడతారు. దాంతో ఇందులో కావ్య తప్పేం లేదని, తనను కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారని జరిగింది చెబుతుంది స్వప్న. ఇదంతా చేసింది యామినినే అని కావ్య అంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ప్రకాశం అంటే కావ్య ఆపుతుంది. మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. కేసు నిలబడదని కావ్య చెబుతుంది.

యామిని ఆయన ముందు మంచిదానిలా నటిస్తుంది. అలాగే చేయనివని అని కావ్యవెళ్లిపోతుంది. యామిని ఇలా చేస్తుందని, పెళ్లి అయ్యేవరకు ఇలాంటి ఆటలు ఆడుకుంటుందని అర్థమైందని రాహుల్ అంటాడు. యామిని ఇంటికి వెళ్లిన అప్పు లాగి పెట్టి కొడుతుంది. నువ్ చేసిన పనికి చంపిన తప్పులేదు. నువ్ చేసింది నాకు తెలియదనుకుంటున్నావా అని అప్పు అంటుంది.

రాజ్ కంపెనీ దక్కించుకునేలా

తర్వాత రాజ్ కంపెనీ బోర్డ్ మెంబర్స్‌లో ఒకరితో యామిని డీల్ ఫిక్స్ చేసుకుంటుంది. రాజ్ కంపెనీ తనకు వచ్చేలా స్కెచ్ వేసి ప్లాన్ చెబుతుంది యామిని. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More