బ్రహ్మముడి టుడే ఎపిసోడ్: రాజ్‌కు ముద్దుపెట్టబోయిన యామిని - కావ్య సర్‌ప్రైజ్ - నోరుజారి బుక్కయిన ధాన్యలక్ష్మి
బ్రహ్మముడి సీరియల్ జూన్ 3 ఎపిసోడ్‌లో రాజ్‌ను తీసుకొని రిసార్ట్‌కు వస్తుంది యామిని. రెండు రోజులు అతడితో ఏకాంతంగా గడపాలని ప్లాన్ చేస్తుంది. కానీ అదే రిసార్ట్‌కు కావ్య రావడంతో ఆమె ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. యామినిని రిసార్ట్‌లోనే వదిలేసి కావ్యతో కలిసి బయటకు వెళ్లిపోతాడు రాజ్.
కావ్య నుంచి రాజ్‌ను దూరం చేయడానికి అతడిని రిసార్ట్‌కు తీసుకెళుతుంది యామిని. దారిలో పదే పదే కావ్యను గుర్తుచేసుకుంటాడు రాజ్. ఇష్టపడే వాళ్లతో ఎంత సేపు మాట్లాడినా ...ఇంకా మాట్లాడాలని అనిపిస్తుందని, ఇంకా కాసేపు వాళ్లతో ఉండాలని అనిపిస్తుందని మనసులో అనుకుంటాడు.

నా గుండె నా కోసం కాదు కళావతి కోసమే కొట్టుకుంటుందని రాజ్, రిసార్ట్‌లోకి వెళ్లగానే కళావతికి తన మనసులో ఉన్న ప్రేమను చెప్పేయాలని రాజ్ ఫిక్సవుతాడు. నా గుండెల్లో ఉన్నది నువ్వే అనే నిజం బయటపెడతానని అనుకుంటాడు. మరోవైపు కావ్యను రాజ్ జీవితంలోనే లేకుండా చేస్తానని మనసులో శపథం చేస్తుంది యామిని.
రాహుల్ ప్లాన్...
స్వప్న ఏడు వారాల నగలు కొట్టేసిన రాహుల్...వాటి స్థానంలో గిల్ట్ నగలు తయారు చేస్తాడు. స్వప్న రూమ్‌లోని లాకర్‌లో గిల్ట్ నగలు దాచేసి దొంగతనం తనపై పడకుండా జాగ్రత్త పడాలని అనుకుంటాడు. కానీ కప్ బోర్డ్‌కు లాక్ ఉండటంతో కీ కోసం రూమ్‌లో వెతుకుతుంటాడు.
అప్పుడే అక్కడికి స్వప్న వస్తుంది. ఏం వెతుకుతున్నావని రాహుల్‌ను అడుగుతుంది. పవర్ బ్యాంక్ కోసం వెతుకుతున్నానని అబద్ధం ఆడుతాడు. నిన్ను చూస్తుంటే నాకో ఏదో డౌట్‌గా ఉందని స్వప్న అంటుంది. నీ గురించి తెలిసి నేను పిచ్చి పిచ్చి వేశాలు ఎలా వేస్తానని రాహుల్ భయం ఉన్నట్లుగా నటిస్తాడు.
దొంగ చూపులు..
రాహుల్ బాడీ లాంగ్వేజ్ చూసి ఏదో తప్పు చేశాడని రుద్రాణి గ్రహిస్తుంది. నీ చూపులు దొంగ చూపుల్లా ఉన్నాయని కొడుకుతో అంటుంది. నీ ఓవర్ యాక్షన్ చూడగానే నువ్వేదో చెడ్డ పని చేశావని ఈజీగా తెలిసిపోతుందని రుద్రాణి అంటుంది. రాజ్...యామినితో పెళ్లి జరిగిన తర్వాత స్వరాజ్ గ్రూప్‌కు ఏండీ నువ్వేనని ఇంట్లో వాళ్లను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నానని, అది చెడగొడితే నిన్ను చంపేస్తానని కొడుకుకు వార్నింగ్ ఇస్తుంది. తాను ఏ తప్పు చేయలేదని బుకాయిస్తాడు. నగల గురించి స్వప్నకు తెలిసేలోపే గిల్ట్ నగలను లాకర్‌లో పెట్టేయాలని అనుకుంటాడు.
యామిని రొమాన్స్...
రాజ్‌తో కలిసి రిసార్ట్‌లో అడుగుపెడుతుంది యామిని. రాజ్‌ను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని కలలు కంటుంది. పెళ్లికి ముందే మనం మన లైఫ్‌ను మొదలుపెడదామని రొమాంటిక్‌గా మాట్లాడుతుంది. నీతో గడిపే ఈ రెండు రోజులు నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని రాజ్ చేయిని పట్టుకుంటుంది. కానీ రాజ్ మాత్రం చేయి వదిలించుకొని యామిని దూరంగా జరుగుతాడురాజ్.
మనం కాబోయే భార్యభర్తలం కదా అని యామిని అంటుంది. ఇంకా కాలేదు కదా అని రాజ్ బదులిస్తాడు. యామిని ముద్దు పెట్టబోతుండగా...రాజ్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు. అదే రిసార్ట్‌కు కావ్య వస్తుంది. యామినిని రూమ్‌లోనే వదిలేసి కావ్యను కలవడానికి వెళతాడు రాజ్. ఇప్పుడు తప్పించుకునా నువ్వు మళ్లీ నా దగ్గరకు రావాల్సిందేనని రాజ్‌ను ఉద్దేశించి యామిని అనుకుంటుంది.
సడెన్ సర్‌ప్రైజ్...
కావ్య వచ్చిన విషయం తెలిసినా ఆమెను సడెన్‌గా చూసినట్లు మీరు ఇక్కడ...సడెన్ సర్‌ప్రైజ్ అని రాజ్ అంటాడు. నేను ఇక్కడికి వచ్చిన విషయం తెలిసే మీరు నన్ను కలవడానికే ఇక్కడికి వచ్చారు కదా అని రాజ్‌పై కావాలనే రివర్స్ ఎటాక్ మొదలుపెడుతుంది కావ్య.
నా ఫ్రెండ్‌ను కలవడానికి వచ్చానని రాజ్ బుకాయిస్తాడు. ఇంకా మీరు నా కోసం వచ్చారని అనుకున్నానని కావ్య అంటుంది. మీ కోసం వచ్చానని చెబితే హ్యాపీగా ఫీలయ్యేవారా అని రాజ్ అడుగుతాడు. ఈ రోజు మొత్తం తనతోనే టైమ్ స్పెండ్ చేయాలని కావ్యను కోరుతాడు రాజ్. నా దగ్గర అంత టైమ్ లేదని కావ్య బదులిస్తుంది.
హమ్మయ్య చూడలేదు...
రాజ్, కావ్యలను వెతుక్కుంటూ యామిని కిందికొస్తుంది. యామిని కంట కావ్య పడకుండా ఉండాలని రాజ్ కంగారు పడతాడు. కావ్యను తీసుకొని ఆమె రూమ్‌లోకి వస్తాడు. హమ్మయ్య...చూడలేదు అని రాజ్ అనుకుంటాడు. ఎవరూ చూడలేదని కావ్య అడుగుతుంది. నా ఫ్రెండ్ అని రాజ్ తడబడుతూ సమాధానం చెబుతాడు. యామిని గురించి దాచేస్తాడు.
ధాన్యలక్ష్మి క్లాస్...
లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ అప్పు కనిపిస్తుంది. అప్పు డ్యూటీకి వెళుతుందని అపోహపడిన ధాన్యలక్ష్మి కోడలిపై ఫైర్ అవుతుంది. నీకు పెద్దవాళ్ల మాటంటే లెక్కలేదా, శోభనం అయిన మరుసటి రోజు ఇంట్లో పూజ పెట్టుకుంటారు...అది కూడా తెలియదా అని క్లాస్ ఇస్తుంది.
డ్యూటీకి ఎలా వెళ్తావని అంటుంది. అప్పు డ్యూటీకి వెళ్లడం లేదని, మూడు రోజులు లీవ్ పెట్టిందని అప్పుడే అక్కడికి వచ్చిన కళ్యాణ్...ధాన్యలక్ష్మికి బదులిస్తాడు. నా కళ్ల ముందే లంచ్ బాక్స్ పెట్టుకుంటూ కనిపిస్తే డ్యూటీకి వెళ్లడం లేదని అంటావేమిటని కళ్యాణ్‌పై విరుచుకుపడుతుంది ధాన్యలక్ష్మి.
ప్రాక్టీస్ చేస్తున్నా...
ఇన్నాళ్లు కావ్య నాకు లంచ్ బాక్స్ పెట్టింది...ఇప్పుడు తను లేదు కాబట్టి... లంచ్ బాక్స్ ఎలా రెడీ చేసుకోవాలో ప్రాక్టీస్ చేసుకుంటున్నానని, అంతే కానీ తాను డ్యూటీకి వెళ్లడం లేదని అప్పు అంటుంది. నిజం బయటపడటంతో ఏ కారణంతో... అప్పుకు తిట్టాలో తెలియక అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మిపై ప్రకాశం సెటైర్లు వేస్తాడు.
రాజ్‌తో రెండు రోజులు రిసార్ట్‌లో ఏకాంతంగా గడపాలని యామిని ప్లాన్ చేస్తుంది. కానీ ఆమెను వదిలిపెట్టి కావ్యతో కలిసి బయటకు వెళ్లాలని రాజ్ ప్లాన్ చేస్తాడు. రిసార్ట్‌లో కావ్యను చూసి యామిని షాకవుతుంది. రాజ్, కావ్య కలిసి బయటకు వెళుతుండగా చూస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


