బ్రహ్మముడి జూన్ 5 ఎపిసోడ్: కిల్లర్ గ్యాంగ్‌తో రాజ్ గొడవ- అడవిలో ఇరుక్కుపోయిన కావ్య, రామ్- రాహుల్‌ను కాపాడిన ఇందిరాదేవి!

బ్రహ్మముడి సీరియల్ జూన్ 5 ఎపిసోడ్‌లో రిసార్టు నుంచి బయటకు వచ్చి టీ తాగుతుంటారు రాజ్, కావ్య. అక్కడికి యామిని పంపిన కిల్లర్ గ్యాంగ్ వచ్చి గొడవ పడతారు. దాంతో అడవిలోకి పారిపోతారు రాజ్, కావ్య. ఆ విషయాన్ని అపర్ణకు చెప్పడంతో కంగారుపడుతుంది. దాంతో రాజ్, కావ్యను కాపాడతానని రంగంలోకి అప్పు దిగుతుంది.

Published on: Jun 5, 2025, 07:09:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాహుల్ దొంగతనం గురించి ఇంట్లోవాళ్లందరి ముందు బయటపెడుతుంది స్వప్న. రాహుల్ చేసిన తప్పులన్నింటిని రుద్రాణికి చెబుతూ బాధపడుతుంది స్వప్న. స్వప్నను మీరే ఆపండి. గొడవ పెద్దది అయ్యేకొద్ది ఇంట్లో లేనిపోని సమస్యలు మొదలవుతాయి. అవి రాజ్, కావ్యల పెళ్లికి అడ్డం అవుతాయ్ అని ఇందిరాదేవితో అపర్ణ అంటుంది.

బ్రహ్మముడి సీరియల్‌ జూన్ 5వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జూన్ 5వ తేది ఎపిసోడ్

భార్యగా వాడిని మార్చు

రాహుల్ నిజంగా తప్పు చేశాడు. అలా అని గొడవ చేసి లాభం లేదు అని ఇందిరాదేవి అంటే.. అలా అంటారేంటీ అమ్మమ్మ తప్పు చేసినవాడికి శిక్ష పడాలిగా అని స్వప్న అంటుంది. అవును, ఏ శిక్ష వేయాలో భార్యగా నువ్వే చెప్పు. తల్లిగా రుద్రాణి ఫెయిల్ అయింది. భార్యగా వాడిని నువ్వు మార్చు అని ఇందిరాదేవి అంటుంది. కింద పడేసిన నగలన్నింటిని తీసి స్వప్నకు ఇచ్చి ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెబుతుంది అపర్ణ.

హమ్మయ్య ఆ గిల్ట్ నగలు ఎక్కడ కనిపెట్టేస్తారేమో అని భయపడి చచ్చాను. ఈ విషయం బయటకొస్తే నా స్వీటి విషయం కూడా బయటపడేది అప్పుడు అంతా బయటకు గెంటేసేవాళ్లు అని రాహుల్ అనుకుంటాడు. అలా రాహుల్‌ను ఇందిరాదేవి కాపాడుతుంది. కట్ చేస్తే ఇంటి గార్డెన్‌లో రాహుల్‌ చెంప చెల్లుమనిపిస్తుంది రుద్రాణి. సింహాసనంపై కుక్కను కూర్చొన్నట్లు చేశావ్. భార్య నగలు కొట్టేయడం ఏంట్రా. ఇంత చీప్‌గా తయారవుతావా. రాజ్ స్థానంలో కూర్చునేవరకు ఇలాంటివి చేయకురా అని రాహుల్‌కు దండం పెడుతుంది రుద్రాణి.

మరోవైపు రాజ్, కావ్య ఇద్దరు కారులో వెళ్తారు. ఓ చోట టీ కోసం ఆగుతారు. ఇద్దరు టీ కోసం కూర్చుంటారు. ఇంతలో యామిని చెప్పిన కిల్లర్ తన రౌడీ గ్యాంగ్‌తో వస్తాడు. యామిని మేడమ్ చెప్పింది వీళ్ల గురించి. ఇప్పుడు దాన్ని కామెంట్ చేసి రెచ్చగొట్టి దాన్ని ఫినీష్ చేయాలి. రాజ్‌కు ఏమాత్రం డౌట్ రాకూడదు అని ఆ కిల్లర్ అంటాడు. ఆ రౌడీ గ్యాంగ్ కూడా వెళ్లి అక్కడ కూర్చుంటారు.

రౌడీ గ్యాంగ్‌తో గొడవ

టీ కొట్టు వాడిపై టీ పోసి ఇదేం టీ రా అని కిల్లర్ అంటాడు. రాజ్ కోపంగా లేస్తే కావ్య ఆపుతుంది. సైలెంట్‌గా టీ తాగండి. వెళ్లిపోదాం అని కావ్య అంటుంది. అన్నా నువ్ టీ కొట్టగానే అన్నకు కోపం వచ్చిందే అంటూ కామెంట్స్ చేస్తారు. మేడమ్ ఇంత కత్తిలా ఉంది. ఇలాంటి వేస్ట్ గాడికి ఎలా పడింది. ఇక్కడ సైలెంట్‌గా ఉంటాడా ఇంట్లో కూడా సైలెంట్‌గా ఉంటాడా అని వల్గర్ కామెంట్స్ చేస్తారు రౌడీ గ్యాంగ్.

ఏదైనా సాయం కావాలాంటే చెప్పండి మా అన్నయ్య వస్తాడు. వీడిలా సైలెంట్ కాదు అని వాళ్లలో ఒకడు అంటాడు. దాంతో రాజ్ కోపంగా వచ్చి కిల్లర్‌ను కొడతాడు. కావ్య బలవంతంగా రాజ్‌ను తీసుకెళ్లిపోతుంది. దాంతో నవ్వుకున్న రౌడీ గ్యాంగ్ ఫాలో అవుతారు. వాళ్లకు భయపడటమేంటండి అని రాజ్ అంటే.. నాకు గొడవలు అంటే భయం అని కావ్య అంటుంది.

ఓ చోట కారు ఆగిపోతుంది. దాంతో అడవిలోకి రాజ్, కావ్య పారిపోతారు. వాళ్ల వెంటే గ్యాంగ్ వెళ్తుంది. అడవిలోకి వెళ్లారన్న అని ఒకడంటే ఇక్కడ చంపితే ఎవరికి తెలియదు అని కిల్లర్ అంటాడు. కావ్య అలసిపోయి ఆయాసంతో ఓ చోట ఆగుతుంది. ఇలా పారిపోవటం కంటే వాళ్లను కొట్టడం ఈజీ అని రాజ్ అంటాడు. అంతమందిని ఒక్కరు ఎలా హ్యాండిల్ చేస్తారు. ఇదివరకులా లేరుగా. యాక్సిడెంట్ అయి లోయలో అని కావ్య నిజాన్ని పొరపాటుగా చెప్పేస్తుంది.

అడవిలో ఇరుక్కుపోయాం

ఆ లోయలో. ఏంటీ ఆగిపోయారు చెప్పండి అని రాజ్ అంటాడు. యాక్సిడెంట్‌లో కోమాలోకి వెళ్లారుగా. మళ్లీ ఏమైనా అయితే ఎలా అని కావ్య అంటుంది. మనవాళ్లకెవరైనా ఫోన్ చేసి హెల్ప్ అడుగుదామని కావ్య అపర్ణకు కాల్ చేస్తుంది. నేను రామ్ (రాజ్) గారు ఇద్దరం అడవిలో ఇరుక్కుపోయాం అని కావ్య చెబుతుంది. కానీ, అది సిగ్నల్ కారణంగా అపర్ణకు వినిపించదు.

రౌడీ గ్యాంగ్ రావడంతో మళ్లీ పారిపోతారు కావ్య, రాజ్. ఓ చోట బండరాయిలా వెనుక దాక్కుంటారు. ఎక్కడ లేరని రౌడీ గ్యాంగ్ వెళ్లిపోతారు. తర్వాత అపర్ణకు కాల్ చేసి రిసార్టు దగ్గర గొడవ అయిందని, అడవిలోకి పారిపోయామని, కారు కూడా పాడైపోయిందని, అప్పుకు వెంటనే చెప్పండి అని చెప్పిన కావ్య లొకేషన్ పంపిస్తుంది. మళ్లీ రౌడీ గ్యాంగ్ రావడంతో రాజ్, కావ్య పారిపోతారు. కానీ, అక్కడే ఫోన్ పడిపోతుంది.

మరోవైపు అప్పుని పిలిచి కావ్య, రాజ్ వాళ్లను ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని కావ్య చెప్పిదంతా అపర్ణ చెబుతుంది. ముందు వెళ్లి వాళ్లను కాపాడమని, వికారాబాద్ ఫారెస్ట్‌కు వెళ్లారు అని ఇందిరాదేవి, లొకేషన్ పెడతానంది. ఇంకా పెట్టలేదు అని అపర్ణ అంటుంది. దాంతో అప్పు కాల్ ఫోన్ స్విచ్ఛాప్ వస్తుంది. దాంతో ఇందిరాదేవి టెన్షన్ పడుతుంది.

బయలుదేరిన అప్పు

కంగారుపడకండి. అడవిలో ఎక్కడ ఉన్న నేను సేఫ్‌గా తీసుకొస్తాను అని అప్పు బయలుదేరుతుంది. సిగ్నల్ వచ్చే ఒక్క ఫోన్ మిస్ అయింది ఇప్పుడెలా అని కావ్య అంటే.. వాళ్లకు విషయం చెప్పాంగా. ముందు అడవి నుంచి బయటపడాలి అని రాజ్ అంటాడు. ఆ కావ్య అడవి దాటి ప్రాణాలతో బయటపడకూడదు అని కిల్లర్‌కు కాల్ చేసి యామిని చెబుతుంది. ఆ మాటలు రాజ్, కావ్య వింటారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More