...
...
Next Story

బ్రహ్మముడి మే 30 ఎపిసోడ్: దొంగను పట్టుకున్న అప్పు- అత్తకు క్షమాపణలు- రాజ్‌తో యామిని శోభనం- కావ్య మెడకు ఉరితాడు!

బ్రహ్మముడి సీరియల్ మే 30 ఎపిసోడ్‌లో కట్టు విడిపించుకున్న రాజ్, కావ్య దొంగ చార్లెస్‌ను పట్టుకుని కట్టేస్తారు. అప్పుకు అప్పజెబుతారు. దాంతో అప్పు ఎస్సై జాబ్ సేఫ్ అవుతుంది. మరోవైపు కావ్యకు రాజ్ చెప్పే లవ్ ప్రపోజల్‌ను యామిని అడ్డుకుంటుంది. తనతో రాజ్‌కు ఫస్ట్ నైట్ జరిగేలా ప్లాన్ చేస్తుంది.

Published on: May 30, 2025, 07:49:29 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్, కావ్యలను ఛార్లెస్ తాడుతో కట్టేస్తాడు. చార్లెస్ కళ్లుగప్పి టేబుల్‌పై ఉన్న ఫోన్ తీసుకుని అప్పుకు మెసేజ్ పెడతాడు రాజ్. అది చూసిన అప్పు కారు ఆపమని, చార్లెస్ గాడు అటు ఇటు తిరిగి మన ఇంటికి వెళ్లాడట. అక్క, బావను రూమ్‌లో లాక్ చేశాడట అని చెబుతుంది. దాంతో కల్యాణ్ కారు రివర్స్ చేస్తాడు.

కావాలనే పట్టుకున్నారా

బ్రహ్మముడి సీరియల్‌ మే 30వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ మే 30వ తేది ఎపిసోడ్

అప్పుకు మెసేజ్ పెట్టాను అని రాజ్ చెబితే.. వాళ్లు కంగారులో ఇంట్లోంచి వస్తే దొరికిపోతారు అని కావ్య అంటుంది. అలా జరగకుండా ఉండాలంటే వీడిని కట్టేయాలి అని తాళ్లను వదిలించుకుంటాడు రాజ్. అది చూసి షాక్ అయిన కావ్య అంటే ఇంతసేపు కావాలనే పట్టుకుని ఉన్నారా అని అంటుంది. చాలా కష్టపడ్డానండి అని రాజ్ అంటే.. కనిపిస్తుంది మీ కష్టం అని కావ్య అంటుంది.

జాంగిరీలు తింటున్న చార్లెస్‌ నోట్లో యాపిల్ పెట్టి వాడు తెచ్చిన తాడుతో కట్టేస్తారు రాజ్, కావ్య. ఇది చీటింగ్ సార్ అని చార్లెస్ అంటే.. ఏరా మా ఇంటికే వచ్చి మిమ్మల్ని కట్టేయడం ఏంట్రా అని కావ్య అంటుంది. అప్పుకు కాల్ చేసి చార్లెస్‌ను పట్టుకున్నామని, గార్డెన్‌లోకి వచ్చేయండి వీడిని కిందపడేస్తాం అని రాజ్ అంటాడు. చార్లెస్‌ను ఓ సంచిలో మూటగడతారు. పోలీస్ కానిస్టేబుల్స్‌తో అప్పు కల్యాణ్ వస్తారు.

ఇంటిపై నుంచి కిందకు చార్లెస్‌ను తోసేస్తారు రాజ్, కావ్య. చార్లెస్‌కు అప్పు వార్నింగ్ ఇస్తుంది. చార్లెస్‌ను పోలీసులు పట్టుకెళ్తారు. దాంతో అప్పు ఎస్సై జాబ్ సేఫ్ అవుతుంది. ఇంట్లోకి వెళ్లేందుకు అప్పు, కల్యాణ్ ప్రయత్నిస్తుంటారు. ఓ తాడు తీసుకొచ్చిన అప్పు పైకి వేస్తాను. దీన్ని పట్టుకుని పాకుకుంటూ మన గదిలోకి వెళ్లిపోవాలి అని అప్పు చెబుతుంది. అలా వెళ్లడం గురించి ఇద్దరు మాట్లాడుకుంటుంటే.. మే ఐ హెల్ప్ యూ అంటూ ప్రకాశం వస్తాడు.

నిలదీసిన కుటుంబం

అత్త నువ్ లేనిపోని గొడవలు పెట్టకు. అప్పు అరెస్ట్ చేసిన దొంగ తప్పించుకున్నాడు. వాడిని పట్టుకోకుంటే అప్పు జాబ్ పోయేది అని కల్యాణ్ అంటాడు. పనికిరాని చేజింగ్‌లో నా కొడుకుని తీసుకెళ్లింది. వాడికి జరగరానిది జరిగి ఉంటే అని ధాన్యలక్ష్మీ అంటుంది. నేను చేసింది తప్పే. కల్యాణ్‌ను తీసుకెళ్లకుండా ఉండాల్సింది. నన్ను క్షమించండి అత్తయ్య అని చేతులెత్తి మొక్కుతుంది అప్పు.

చేతులెత్తి మొక్కితే సరిపోతుందా. ఆ దొంగ దగ్గర రివాల్వర్ ఉంటే. అది నేరుగా కల్యాణ్‌కు తగిలి ఉంటే అని రుద్రాణి మరింత భయపెడుతుంది. నువ్ ఇంకా ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టకు అని ఇందిరాదేవి తిడుతుంది. అప్పు ఉండగా వాడికేమవుతుంది. తన ప్రాణం అడ్డుపెట్టుకుని అయినా వాడిని కాపాడుకుంటుంది. నా కోడలు మీద నాకా నమ్మకం ఉంది అని ప్రకాశం అంటాడు.

ఇంటివాళ్లపైనే అటాక్

అమ్మ నాకోసం అంతా తపిస్తున్నారు. మరి అప్పుకు ఏమైనా అయితే, అదే బులెట్ అప్పుకు తగిలితే. అప్పుకు ఏం జరిగినా ఓకేనా. అసలు దొంగ దొరికింది ఎక్కడో తెలుసా ఇంట్లోనే. వాడు తప్పించుకుని మన ఇంటికి వచ్చాడు. మీరన్నట్లు అప్పు వెళ్లి అరెస్ట్ చేయకపోతే వాడు మన ఇంటివాళ్లపైనే అటాక్ చేసేవాడు. అప్పు తన సంతోషాన్ని కూడా తన డ్యూటీ చేసింది కాబట్టే మనకేం కాలేదు అని పోలీసులను పొగుడుతాడు కల్యాణ్.

తనకోసం మళ్లీ మళ్లీ ఇలాంటి రిస్క్ తీసుకోడానికి నేను వెనుకాడను అని కల్యాణ్ అంటాడు. దాంతో అపర్ణ మురిసిపోతుంది. చాలా గర్వంగా ఉంది. మీ అత్తయ్యను చూసి భయపడుతున్నావా. తన కోపమంతా పై పైనే. అయినా పంతులు పెట్టిన శోభనం ముహుర్తానికి ఇంకా టైమ్ ఉందిగా. ధాన్యలక్ష్మీ కోరుకున్నట్లుగానే మీ శోభనం జరిపించొచ్చు అని అపర్ణ అంటుంది.

సరే అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇంత జరుగుతుంటే రాజ్, కావ్య ఎక్కడ అని ఇందిరాదేవి అడుగుతుంది. వాళ్లిద్దరు మా గదిలోనే ఉన్నారు. మేము వచ్చేవరకు మ్యానేజ్ చేస్తామన్నారు అని అప్పు చెబుతుంది. దాంతో శోభన గదిలోకి కుటుంబం అంతా వెళ్తుంది. శోభనం మీకా వాళ్లకా. ఇద్దరు గదిలో ఉంటూ మిమ్మల్ని ఇంత మోసం చేస్తారా అని ఇందిరాదేవి అడుగుతుంది.

మేము దొరికేసాం

అన్నయ్య మేము దొరికేసాం. వీళ్లకు అంతా తెలుసు అని కల్యాణ్ అంటాడు. హో తెలిసిపోయిందా. అనవసరంగా పర్ఫామెన్స్ ఇస్తున్నా అని రాజ్ అంటాడు. నీకంటే ఎక్కువ పర్ఫామెన్స్ ఇస్తుంది మా కావ్య. ఇష్టం లేదంటూనే నీకు బాగా హెల్ప్ చేస్తుంది అని అపర్ణ అంటుంది. దాంతో కావ్య సిగ్గుతో వెళ్తుంది. అరేయ్ ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు. వెళ్లి నీ మనసులో ఉన్న మాట చెప్పు అని ఇందిరాదేవి అంటుంది.

హాల్లో కావ్య చేయి పట్టుకుని రాజ్ ఆపుతాడు. పై నుంచి దుగ్గిరాల కుటుంబం అంతా వస్తుంది. నా మనసులో మాట చెప్పాలని చాలా సార్లు ప్రయత్నించాను. మీరు ఏం చెబుతారో అని భయపడి మౌనంగా ఉండిపోయాను అని రాజ్ అంటాడు. ఇక్కడిదాకా వచ్చి నసుగుతావేంటీ. కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేయ్ అని ఇందిరాదేవి మనసులో అనుకుంటుంది.

నాకు మీకు ఉన్న బంధం ఏంటో నాకు తెలియదు. నా మనసులో ఉంది మీ కళ్లలో కనిపిస్తుంది రెండు ఒకటే అనుకుని ఈ విషయాన్ని మీకు చెబుతున్నాను. నేను.. మిమ్మల్ని.. అంటూ రాజ్ ఆగిపోతాడు. నువ్ పెట్టే టెన్షన్‌కి నా గుండె ఆగిపోయేలా ఉందిరా అని అపర్ణ అంటుంది. కళావతి గారు నేను మిమ్మల్ని.. అని రాజ్ చెప్పబోతుంటే కాల్ వస్తుంది.

యామిని రాజ్ శోభనం

దాన్ని కట్ చేస్తాడు. ఆ కాల్ యామిని చేసినట్లుగా తెలుస్తోంది. రాజ్ లవ్ ప్రపోజ్ చేయకుండా యామిని అడ్డుకుంటుంది. తర్వాత రామ్‌ను ఏం చేయబోతున్నావ్ అని యామినిని తల్లి వైదేహి అడుగుతుంది.

బావను నా సొంతం చేసుకోబోతున్నాను. రేపు బావతో నా శోభనం జరగబోతుంది. తప్పు చేసానన్న గిల్ట్‌తో అయినా తప్పనిసరిగా నా మెడలో మూడు ముళ్లు వేస్తాడు. ఆ కావ్య మెడకు ఉరితాడుగా మారుస్తాడు. చూస్తుండు అని యామిని అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe