Brahmamudi May 7 Episode: బ్రహ్మముడి- రాజు, ఇందుల పెళ్లి డీల్- ట్విస్ట్ ఇచ్చిన రేఖ, బ్లాక్ మెయిల్ చేసిన ఇందు-అపర్ణ కోరిక
Brahmamudi Serial May 7th Episode: బ్రహ్మముడి సీరియల్ మే 7వ ఎపిసోడ్‌లో పెళ్లి గుడిలో కాదని, రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో అని పెద్ద ట్విస్ట్ ఇస్తుంది రేఖ. కానీ, రేఖను ఇందు రివర్స్‌లో బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తుంది. ఈ పెళ్లి ఆపేద్దామని భ్రమరాంబ అంటుంది. రాజు, ఇందు పెళ్లి డీల్ చేసుకుంటారు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రేఖ కొడుకు మదన్‌ను భ్రమరాంబ కూతురు స్వాతి ప్రేమిస్తున్నట్లు ఇందుకు చెబుతుంది. రేపు గుడిలో నా పెళ్లి జరగదు. నీ ప్రేమను ఎప్పటికీ ఓడిపోనివ్వను అని ఇందు అంటుంది. నేను నిన్ను నమ్మలేను. అవతల రేఖ ఆంటీ ఉందని స్వాతి అంటే.. కావచ్చు. కానీ, ఇవతల ఓ కంత్రీ (రాజు) గాడు ఉన్నాడని ఇందు అంటుంది.

హాస్పిటల్ గురించి అడిగిన లక్కీ
మరోవైపు ఆ 10 లక్షలు దేనికి వాడావురా, పంజాగుట్ట హాస్పిటల్‌కి ఎందుకు వెళ్లావ్. నీ జీవితంలో సీక్రెట్స్ లేవనుకున్నా. ఆ 10 లక్షలు ఇచ్చి ఐశ్వర్యతో లైఫ్ సెటిల్ చేసుకుందామనుకున్నా. కానీ నీ స్వార్థం నువ్వు చూసుకుంటావనుకోలేదని లక్కీ అంటాడు. దాంతో కోప్పడిన రాజు ఏంట్రా స్వార్థం, ఇదేనా అర్థం చేసుకుందని రాజు అంటాడు. అవునురా, మరి ఆ పది లక్షలు ఏం చేశావో చెప్పు. నన్ను పరాయివాడిని చేస్తున్నావా. సరే 10 లక్షలు ఎలాగైనా అరెంజ్ చేసి ఐశ్వర్యకు ఇస్తే నేను సెటిల్ చేసుకుంటానని లక్కీ వెళ్లిపోతాడు.
ఇంతలో రాజుకు ఇందు కాల్ చేసి క్షేమసమాచారాలు, ఇంట్లోవాళ్లగురించి అడుగుతుంది. ఎందుకు కాల్ చేశావని రాజు అంటాడు. నాకో సమస్య వచ్చింది. రేపు నా పెళ్లి, నా పెళ్లిని నువ్వు ఆపాలి. నాకు ఇష్టం లేకుండా చేస్తున్న పెళ్లి. ఈ పెళ్లి జరిగితే నేను అనుకుంది నా లైఫ్‌లో చేయలేను. నువ్వు ఒక్కడివే ఆపగలవు. నీకు కావాల్సిన డబ్బును ఇస్తాను. ఒక్క అమ్మాయి జీవితం కాపాడు అని ఇందు అంటుంది.
దానికి సరేనన్న రాజు, గుడిలో ఎంతమంది ఉంటారని అడుగుతాడు. నువ్వు మళ్లీ కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు అని రాజుకు పెళ్లి ప్లాన్ చెబుతుంది ఇందు. నేను చెప్పింది చెప్పినట్లుగా చేస్తే చాలు అని ఇందు అంటే.. నేను అడిగింది అడిగినట్లుగా డబ్బు ఇవ్వాలని రాజు అంటాడు. ఇద్దరు పెళ్లి, డబ్బుతో ఇందు, రాజు డీల్ చేసుకుంటారు. మరోవైపు భ్రమరాంబపై సెటైర్లు వేస్తుంటాడు శేషు.
ఈ పెళ్లి ఆపుతాను
రేఖ గురించి, ఆస్తి గురించి మాట్లాడుకుంటారు. మన కూతురిని మదన్‌కు ఇచ్చి పెళ్లి చేస్తాను. అలా అయితేనే మనకు ఆస్తి వస్తుంది. ఈ పెళ్లి ఆపుతానంటుంది భ్రమరాంబ. ఎలా అని శేషు అడిగితే.. మీరే చూడండి అని వెళ్లిపోతుంది. మరోవైపు ఆస్తి దక్కించుకుందామనుకున్న ప్రతిసారి అడ్డంకులు, షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయని రేఖతో భూషణ్ అంటాడు. ఈసారి ప్లాన్ వర్కౌట్ అవుతుంది. చచ్చిపోయిన తన తల్లిదండ్రులు వచ్చిన ఆపలేరని రేఖ అంటుంది.
మరోవైపు ఆస్తి దక్కించుకునేందుకు నేను ఏ నిర్ణయమైన తీసుకుంటానని ఇందు, మరోవైపు డబ్బు కోసం ఏమైనా చేయాలని రాజు అనుకుంటారు. మరుసటి రోజు ఉదయం పెళ్లి గుడిలో కాదని, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో అని ట్విస్ట్ ఇస్తుంది రేఖ. వయసు ఫ్రూఫ్ కోసం ఇందును ఆధార్ కార్డ్ తెమ్మంటుంది రేఖ. ఎలాగు నాకు నచ్చకుండా పెళ్లి చేస్తున్నావ్. కనీసం నా కోరిక అయిన తీర్చు. ఇందుతో గౌరీ పూజను గుడిలో చేయించేందుకు పర్మిషన్ ఇవ్వు అని బాధగా బతిమిలాడుకుంటుంది అపర్ణ.
ఎక్కువ టైమ్ కూడా తీసుకోం అని ఇందు కూడా బతిమిలాడుతుంది. గౌరీ పూజా చేయిస్తే మనకు కూడా మంచిదని శేషు అంటాడు. అలా ఏం వద్దు. డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లోనే పెళ్లి చేయిద్దామని భూషణ్ అంటాడు. మీరు చెప్పినట్లుగా పెళ్లికి ఒప్పుకున్నాగా, రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో నాకు పెళ్లి ఇష్టం లేదంటే ఆపేస్తారుగా అని రివర్స్‌లో రేఖను బ్లాక్ మెయిల్ చేస్తుంది ఇందు.
అపర్ణ కోరిక తీర్చిన రేఖ
నాకు కావాల్సింది ఇదే. మంచి పట్టు దొరికింది అనుకున్న భ్రమరాంబ సరే అలాగే చెప్పు. ఇది మనల్ని బెదిరిస్తుంది. అది అలా చెబితే మనం దొరికిపోతాం. ఇప్పుడు ఈ పెళ్లి వద్దు. ఇందు చీర మార్చుకో అని భ్రమరాంబ అంటుంది. రేఖ ఆంటీ నాకు మీరంటే అభిమానం, ప్రేమ, భయం అన్నీ ఉన్నాయి. మీరు ఏది చెబితే అది అందుకే చేస్తున్నాను. గౌరీ పూజ గుడిలో చేయించేందుకు పర్మిషన్ కోసం బతిమాలాడుకుంటుంది ఇందు.
మీరు చెప్పినట్లుగానే తల ఆడిస్తున్నాగా. నన్ను మా నానమ్మను గుడికి పంపించండి. ఈ ఒక్కసారి పంపించండని ఇందు అంటుంది. ఒక్కసారి అంటే గుడి నుంచి రావా అని శేషు అంటాడు. దాంతో సరేనని ఒప్పుకున్న రేఖ నీతో అపర్ణ రాదు. భ్రమరాంబ వదిన వస్తుందని చెబుతుంది. సరేనని ఇందు అంటుంది. అలా అపర్ణ కోరికను రేఖ తీరుస్తుంది. ఇందు, భ్రమరాంబ గుడికి కారులో వెళ్తారు. ఆ కారును రాజునే నడుపుతుంటాడు.
రేఖ ఏది ఒప్పుకోమంటే అది ఒప్పుకుంటావా, నా బాధను ఎవరు అర్థం చేసుకోరు అని భ్రమరాంబ అంటుంది. ఇంతలో రాజు సడెన్‌గా కారు ఆపి మొహానికి మాస్క్ పెట్టుకుంటాడు. కత్తి చూపించి భ్రమరాంబను కారు దిగమంటాడు. ఇందును కిడ్నాప్ చేస్తున్నట్లు చెబుతాడు. దానికి భ్రమరాంబ షాక్ అవుతుంది. నన్ను కిడ్నాపా. వద్దు వద్దు అని భయపడుతున్నట్లు, పిన్ని నన్ను కాపాడు అని చేయి పట్టుకుని నటిస్తుంది ఇందు. ఇద్దరు అరుస్తారు.
ఇందు మళ్లీ కిడ్నాప్
కత్తితో పొడుస్తాను, దిగు అని భయపెడతాడు రాజు. దాంతో భ్రమరాంబ కారు దిగుతుంది. ఇందును డ్రైవర్‌గా వచ్చిన రాజు మళ్లీ కిడ్నాప్ చేసి తీసుకెళ్తాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


