Brahmamudi October 28 Episode: బ్రహ్మముడి.. ఇందు, రాజు పెళ్లి.. అసలు అల్లుడిని తానేనన్న లక్కీ.. ట్విస్ట్ ఇచ్చిన అపర్ణ
Brahmamudi Serial October 28th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 28 ఎపిసోడ్ లో రాజు, ఇందు దొంగ పెళ్లి విషయాన్ని లక్కీ బయటపెడతాడు. దీంతో వాళ్లకు నిజంగానే పెళ్లి చేయాలని అపర్ణ నిర్ణయించుకుంటుంది. రాజుని అడుగుతుంది.
Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఫ్రెండ్స్ లక్కీ, రాజు గొడవ పడటం, మాటామాటా అనుకుంటూ సీరియల్ కు పెద్ద ట్విస్ట్ ఇచ్చే విషయాన్ని బయటపెట్టడం హైలైట్ గా నిలిచింది. రాజు, ఇందు దొంగ పెళ్లి విషయం బయటపడటంతో వాళ్లకు నిజంగా పెళ్లి చేయడానికి అపర్ణ సిద్ధమవుతుంది.

నందుకు వెంకీ థ్యాంక్స్.. చలపతికి లక్ష్మీ క్లాస్.. చలపతి కంటతడి
వెంకీని జైల్లో నుంచి విడిపించి నందు ఇంట్లో వదిలి వెళ్లే సీన్ తో సీరియల్ బుధవారం (అక్టోబర్ 28) ఎపిసోడ్ మొదలైంది. వెంకీ వెళ్లి నందుకు థ్యాంక్స్ చెబుతాడు. కానీ ప్రేమ విషయం దాచడంతో నందు అతన్ని తిడుతుంది. నీలాగా లోపల ఒకటి, బయట మరొకటి మాట్లాడటం, నటించడం తనకు రాదని చెప్పి వెళ్లిపోతుంది.
అటు చలపతికి కూడా లక్ష్మీ క్లాస్ పీకుతుంది. నందుకు కనీసం థ్యాంక్స్ ఎందుకు చెప్పలేదని నిలదీస్తుంది. దీంతో చలపతి ఎమోషనల్ అయి కంటతడి పెడతాడు. ఒకప్పుడు నందును ఇంటికి రావద్దని అన్నానని, అలాంటిది ఇప్పుడు వెంకీని విడిపించడంతో మంచివాడిలా నటించలేకపోయానని అంటాడు. లక్ష్మీ అతన్ని ఓదారుస్తుంది.
ఐశ్వర్యను నిలదీసిన రాజు, ఇందు.. నీ బండారం బయటపడిందంటూ..
మరోవైపు రాజు, ఇందు ఆవేశంగా ఇంటికి వెళ్తారు. ఐశ్వర్యను నిలదీస్తారు. నీ బండారం బయటపడిందని రాజు అంటాడు. వెంకీని నువ్వే అరెస్ట్ చేశావని సాక్ష్యాధారాలు దొరికాయంటూ ఆ పేపర్లను ఐషూ ముఖంపై విసిరేస్తాడు రాజు.
అది చూసి లక్కీ అలా ఆడాళ్ల మీదికి పేపర్లు విసురుతావా అని రాజుని మందలిస్తాడు. ఆమె ఏం చేసిందో తెలిసి కూడా సపోర్ట్ చేస్తున్నావా అని ఇందు అంటుంది. వెంకీని కావాలని ఇరికించి, అరెస్ట్ చేయించిందని రాజు, ఇందు ఇంట్లో వాళ్లకు చెబతారు. ఈ పేపర్లు చూస్తే నమ్మేయాలా అని ఐశ్వర్య అంటే.. మా ఐషూ ఏమీ చేయలేదని మేమంటాం.. మీరు ఎలా కాదంటారు అని భ్రమరాంబ అంటుంది.
వీడియో చూపించి ఇరికించిన నందు.. డీలర్ కూడా ఎంట్రీ
అప్పుడే నందు కూడా వస్తుంది. దీని వెనుక ఉన్నది ఐశ్వర్యనే.. అలా అని కంపెనీ మేనేజరే చెప్పాడు.. ఆ వీడియో చూడండి అని చూపిస్తుంది. అందులో వెంకీ కంపెనీ మేనేజర్ ఐశ్వర్యతో డీల్ తర్వాత వెంకీని ఇరికించాలని చెప్పడం చూసి అందరూ షాకవుతారు. అప్పుడే డీలర్ కూడా ఎంట్రీ ఇస్తాడు. ఇంకా ఈవిడతో మాటలేంటి.. దుగ్గిరాల ఫ్యామిలీ, స్వరాజ్ గ్రూపు గొప్పతనం చూసి వస్తే.. నకిలీ బంగారంతో మోసం చేసింది.. ముందు ఆమెను అరెస్ట్ చేయండి అని అంటాడు.
ఐశ్వర్యను అరెస్ట్ చేయబోయిన నందు.. అడ్డుకున్న ఇందు..
దీంతో నందు వెళ్లి ఐశ్వర్యను అరెస్ట్ చేయబోతుంది. చేతులకు సంకెళ్లు వేస్తుంది. కానీ ఇందు అడ్డుపడుతుంది. ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేస్తే పోయేది దుగ్గిరాల కుటుంబం పరువే.. స్వరాజ్ గ్రూపు పేరు కూడా చెడిపోతుంది.. ఈ కంపెనీపై వేల మంది ఆధారపడ్డారు.. వాళ్లంతా రోడ్డున పడతారు అని ఇందు అంటుంది.
అంతేకాదు అటు డీలర్ కు కూడా హామీ ఇస్తుంది. మీరు కోట్ చేసిన మొత్తంలోనే మీకు నష్టం లేకుండా మీ ఆర్డర్ నేను ఇస్తాను.. నన్ను నమ్మండి.. ఈ కేసు వెనక్కి తీసుకోమని అంటుంది. దీంతో అతడు సరే అని చెప్పి వెళ్లిపోతాడు. అందరూ షాకవుతారు. ఎందుకు ఐషూని కాపాడవంటూ ఇందుని అపర్ణ తిడుతుంది.
తాట తీస్తానంటూ ఐశ్వర్యకు వార్నింగ్
అవేమీ పట్టనట్లుగా ఐశ్వర్య వెళ్లిపోబోతోంది. కానీ ఇందు ఆమెను ఆపుతుంది. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్.. మళ్లీ ఇలా చేశావంటే తాట తీస్తానంటూ వార్నింగ్ ఇస్తుంది. దుగ్గిరాల కుటుంబం, స్వరాజ్ గ్రూపు ఎన్నో ఏళ్లుగా ఎంతో నమ్మకంతో వ్యాపారం నడిపిస్తోంది.. ఇప్పుడు నువ్వు వచ్చి ఇలాంటి పనులతో పరువు తీస్తానంటే ఊరుకోను.. మళ్లీ ఇలా చేశావంటే ఇంట్లో కూడా ఉండవు అని అంటుంది.
ఎదురు తిరిగిన ఐశ్వర్య..
కానీ ఐశ్వర్య మాత్రం ఎదురు తిరుగుతుంది. నువ్వు నన్ను కాపాడావా.. నీ కాళ్ల దగ్గర పడి ఉండాలా.. అయినా వాళ్లు అరెస్ట్ చేస్తే నేను బయటకు రాలేననుకున్నావా అని అంటుంది. అంతేకాదు అసలు ఇదంతా నువ్వు చేయడం వల్లే జరిగిందంటూ ఇందుని నిందిస్తుంది. కంపెనీ పెట్టిస్తానని చెప్పి.. చెప్పినట్లే ముందే ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంత వరకూ వచ్చేదే కాదు.. నీ కంపెనీని దెబ్బ కొట్టడమే నా టార్గెట్..
అయినా ఆ డీలర్ గాడు కూడా అప్పుడు తక్కువకు కోట్ చేస్తే నా దగ్గరికి వచ్చి.. ఇప్పుడేమో పెద్ద ఉత్తముడిలా పోజు కొడుతున్నాడు.. నువ్వేమైనా తక్కువ తిన్నావా.. ఆస్తి కోసం ఇంట్లో నటిస్తున్నావని తెలుసు అని ఐశ్వర్య అంటుంది. నీలా దిగజారిపోయి బతకలేదు అని ఇందు అనడంతో ఐషూ ఆమెను కొట్టబోతుంది. దీంతో రాజు కూడా ఐషూపైకి చేయి లేపుతాడు. అటు లక్కీ అడ్డుపడతాడు.
రాజుకి ఎదురు తిరిగిన లక్కీ.. దొంగ మొగుడివి అంటూ..
ఆమె నా భార్య.. ఆమెపై మరో మగాడి చేయి పడకుండా అడ్డుకోవడం నా బాధ్యత అని లక్కీ అంటాడు. ఇప్పుడు నాకంటే ఐశ్వర్యే ఎక్కువైపోయిందా అని రాజు అంటాడు. అవును నాకు ఐషూయే ఎక్కువ అని లక్కీ అంటాడు. తల్లి ఎవరో తెలియక రోడ్డున పడిన నిన్ను నేను ఇక్కడికి తీసుకొచ్చాను.. నీకు నచ్చిన అమ్మాయితో పెళ్లి జరగడానికి ఇందు కారణం.. అలాంటిది మాకే ఎదురు తిరుగుతావా అని రాజు నిలదీస్తాడు.
అవి ఎప్పటికైనా జరగాల్సినవే.. జరిగేవి.. అయినా మీరు మాకు నీతులు చెప్పడమేంటి.. దొంగదారిని డబ్బు కోసం ఈ ఇంట్లోకి వచ్చిన దొంగ మొగుడివి నువ్వు.. ఇందుకి అద్దె మొగుడిగా ఇక్కడికి వచ్చావ్.. నీతో పోలిస్తే నాకే ఈ ఇంటిపై ఎక్కువ హక్కు ఉంది.. నేనే అసలైన అల్లుడిని.. అసలు నువ్వెవరు.. ఈ ఇంటితో నీకు సంబంధం ఏంటి అని లక్కీ అనడంతో అందరూ షాకవుతారు.
ఇందుని పెళ్లి చేసుకుంటావా అని రాజుని అడిగి..
చూశారా.. నేను ఎప్పటి నుంచో వీళ్లకు పెళ్లి కాలేదని చెబుతున్నా ఎవరూ నమ్మలేదు.. ఇప్పుడు వాళ్ల ఫ్రెండే ఆ విషయం చెప్పాడు చూడండి అని ఐశ్వర్య అంటుంది. వివాదం ముదురుతుండటంతో అపర్ణ జోక్యం చేసుకుంటుంది. ఇప్పటి వరకూ దొంగ పెళ్లే కావచ్చు కానీ ఈరోజు వాళ్లకు నిజమైన పెళ్లి చేస్తాను.. మా ఇందుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని రాజుని అపర్ణ అడుగుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


