బ్రహ్మముడి జులై 9 ఎపిసోడ్: ఇంట్లో వాళ్లను భయపెట్టిన రాజ్.. కావ్యను బెదిరించిన యామిని.. ఉచ్చులో చిక్కిన అప్పూ
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (జులై 9) ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కావ్య లేకుండానే బోర్డు మీటింగ్ కు రాజ్ వెళ్తాడు. అటు యామిని కావ్యకు ఫోన్ చేసి బెదిరిస్తుంది. మరోవైపు యామిని వేసిన ప్లాన్ లో అప్పూ చిక్కుకుంటుంది.
స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి బుధవారం (జులై 9) 769 ఎపిసోడ్ కూడా ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఈ ఎపిసోడ్ లోని ట్విస్టులు ఆశ్చర్యపరిచాయి. రాజ్ తన పాత రూపంలో ఆఫీస్‌కు సిద్ధమవడం, అప్పూ యామిని కుట్రలో భాగంగా లంచం కేసులో ఇరుక్కోవడం, కావ్యను ఓడించేందుకు యామిని కొత్త పథకం కథను ఉత్కంఠగా మలిచాయి. మరి ఈ ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

రాజ్‌ను చూసి ఇంట్లో వాళ్లు షాక్
బ్రహ్మముడి బుధవారం (జులై 9) ఎపిసోడ్ రాజ్ ఆఫీస్‌కు బయల్దేరే సన్నివేశంతో ఆరంభమవుతుంది. అతని నడవడిక, మాటలు పాత రాజ్‌ను గుర్తుచేస్తాయి. కిందకు వచ్చిన రాజ్‌ను అందరూ వింతగా చూస్తారు. రాజ్ సరదాగా, “నేను వేరే గ్రహం నుంచి వచ్చానా?” అని అడుగుతాడు. “లక్ష్మీ వంట సరిగా చేయడం లేదు, ఆమెను తోటమాలిని చేస్తున్నా” అని చెబుతూ ఇంటి బాధ్యతలు తీసుకున్నట్లు చూపిస్తాడు. అతని ప్రవర్తన చూసి అపర్ణ, ఇందిరతో, “ఇతను కొత్త రాజా, పాత రాజా? గతం గుర్తొచ్చినట్లుంది” అని ఆశ్చర్యపోతుంది.
రాజ్ నవ్వుతూ, “అందరూ భయపడ్డారా? నేనే కళావతి గారి నిజమైన బాస్‌ని అని నమ్మేశారు కదా” అని సరదాగా అంటాడు. “ఒక్క క్షణం వదిన బాస్ వచ్చినట్లు అనిపించింది” అని కల్యాణ్, స్వప్న నవ్వుతారు. రాజ్ గర్వంగా, “నేను సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఒక్కసారి చెబితే చాలు, అల్లుకుపోతాను” అని చెబుతాడు. కావ్యతో, “మీ ప్రాబ్లమ్స్ అన్నీ నేను సాల్వ్ చేస్తా, మనల్ని చూస్తే ఎవరైనా నమ్మేస్తారు” అని ధీమా వ్యక్తం చేస్తాడు. ఇందిర ఆశీస్సులు తీసుకుని ఆఫీస్‌కు బయల్దేరతాడు.
బోర్డ్ మీటింగ్‌కు కావ్య, రాజ్
బోర్డ్ మీటింగ్ కోసం ఆఫీస్‌లో అందరూ సిద్ధంగా ఉంటారు. అయితే కావ్య రావడం ఆలస్యం కావడంతో సిద్ధార్థ్ ఆగ్రహంగా ఉంటాడు. “ఎండీ అంటే టైంకు రావాలి, ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు” అని అతడు మండిపడతాడు. ఇంతలో మేనేజర్ మాట్లాడుతూ.. “మా బాస్ ఈ రోజు వస్తున్నారు.. కొంచెం వెయిట్ చేయండి” అని సమాధానమిస్తాడు.
ఇంతలో రాజ్, కావ్య ఆఫీస్‌కు గంభీరంగా ఎంటరవుతారు. “నిన్న ఆఫీస్‌కు వచ్చిన తర్వాత భయం పోయి, కాన్ఫిడెన్స్ వచ్చింది” అని రాజ్ అంటాడు. దీనికి కావ్య స్పందిస్తూ.. మా బాస్ డైలాగ్స్‌తో కాదు, పనితో మాట్లాడతాడని.. నువ్వు ఈ రోజు మాట్లాడే దానిపై కంపెనీ భవిష్యత్తు ఆధారపడి ఉంది అని అతన్ని హెచ్చరిస్తుంది.
కావ్యకు యామిని ఫోన్
రాజ్, కావ్య ఆఫీస్‌కు వెళ్తుండగా యామిని ఫోన్ చేస్తుంది. కావ్యను రెచ్చగొడుతూ.. “ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత సమయం తీసుకున్నావేంటి?” అని సెటైర్ వేస్తుంది. “తప్పు చేసినవాళ్లు ఎవరైనా ఓడిపోతారు. రాజ్ కు గతం గుర్తులేదని నేను అందరికీ చెప్పేశాను” అని అంటుంది. “రాజ్‌కు ట్రైనింగ్ ఇచ్చి ఆఫీస్‌కు తీసుకొస్తున్న విషయం నాకు తెలిసిపోయిందని ఆశ్చర్యపోతున్నావా?” అని కావ్యను గేలి చేస్తుంది. దీనికి కావ్య స్పందిస్తూ.. ఎదుటివాళ్ల జీవితాలతో ఆడుకునే నీకు ఇవన్నీ తెలియకపోతాయా అని అంటుంది.
యామిని బెదిరింపులకు దిగుతుంది. ఈ రోజు నీ కంపెనీ, రేపు నీ ఫ్యామిలీ, చివరికి నీ మొగుడు కూడా నీకు దూరమవుతాడు అని కావ్యతో అంటుంది. నువ్వు అనుకున్నది ఒక్కటీ జరగదని ఈ రోజు నిరూపిస్తా అని కావ్య సవాల్ విసురుతుంది. బోర్డ్ మీటింగ్‌తో పాటు ఇంకో సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాను.. దాన్ని నువ్వు కనుక్కో అంటూ కావ్యకు చెబుతుంది యామిని.
యామిని ఉచ్చులో చిక్కిన అప్పూ
యామిని కుట్ర కావ్యను ఆందోళనకు గురిచేస్తుంది. ఆమె వెంటనే స్వప్నకు ఫోన్ చేసి.. ఇంట్లో అందరూ క్షేమంగా ఉన్నారా? యామిని ఏదో ప్లాన్ చేసింది.. జాగ్రత్త అని హెచ్చరిస్తుంది. అప్పూకి కూడా ఫోన్ చేసి.. యామిని మళ్లీ ఏదో కుట్ర చేస్తోంది, అప్రమత్తంగా ఉండు అని చెబుతుంది. యామిని నిన్ను మీటింగ్‌కు వెళ్లకుండా టైం వేస్ట్ చేయాలని చూస్తోంది అని అప్పూ అంటుంది.
ఇంతలో, యామిని మనుషులు అప్పూని ఇరికించేందుకు లంచం కేసులో ఫిర్యాదు చేస్తారు. ఏసీబీ అధికారులు అక్కడికి వెళ్తారు. నువ్వ షాప్ పెట్టుకోవడానికి లక్షా 20 వేల రూపాయలు లంచం అడిగావని ఫిర్యాదు వచ్చింది అని చెబుతారు. ఇదంతా అబద్ధం, నేను లంచం అడగలేదు అని అప్పూ వివరిస్తుంది. కానీ యామిని మనుషులు ఇచ్చిన కరెన్సీ నోట్ల నంబర్లు, అప్పూ చేతిలోని నోట్లతో సరిపోలడంతో ఆమె ఉచ్చులో ఇరుక్కుంటుంది.
కావ్య లేకుండానే మీటింగ్‌కు రాజ్
అటు కావ్య లేకుండానే రాజ్ మీటింగ్ కు వెళ్తాడు. అతడు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తాడు. ఎలా ఉన్నావ్ రాజ్ అని సిద్ధార్థ్ అడిగితే.. ఎప్పుడూ ఉన్నట్లే ఉన్నాను అని చాలా పొగరుగా చెబుతాడు. మీకే ఏవేవో సందేహాలు వస్తున్నాయట ఏం జరిగింది అని అడుగుతాడు.
కానీ బోర్డు సభ్యులు ఎవరూ నోరు మెదపరు. ఇంతలో సిద్థార్థ్ జోక్యం చేసుకుంటూ వాళ్ల తరఫున తానే మాట్లాడతానని, ఈ మధ్య కంపెనీ లాభాల కంటే నష్టాలే ఎక్కువ వస్తున్నాయని, అందుకే ఎండీనీ మార్చాలని అనుకుంటున్నట్లు చెబుతాడు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
బుధవారం (జులై 9) ఎపిసోడ్ ఉత్కంఠగా ముగిసింది. దీంతో రేపటి ఎపిసోడ్ పై మరింత ఆసక్తి నెలకొంది. బోర్డ్ మీటింగ్‌లో రాజ్ ను చూసి కావ్య షాక్ తినడం.. అప్పూ లంచం కేసు నుంచి బయటపడుతుందా లేదా.. యామిని సర్‌ప్రైజ్ ప్లాన్ ఏమిటి అనేది తర్వాతి ఎపిసోడ్లో చూడొచ్చు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



