Subscribe Now! Get features like
బ్రహ్మముడి ఈరోజు అంటే 852వ ఎపిసోడ్ మొత్తం రాజ్, కావ్య పంతం.. రుద్రాణి కొత్త కుట్రలు.. దుగ్గిరాల ఇంటికి మహిళా సంఘం వాళ్లు వచ్చి వార్నింగ్ ఇవ్వడం లాంటి సీన్లతో సాగిపోయింది. అయితే ఎంత జరిగినా వెనక్కి తగ్గని రాజ్.. చివరికి కావ్యను ఎలాగోలా ఇంటికి తీసుకురావడానికి ఇంటి ముందు నిరాహార దీక్షకు సిద్ధమవుతాడు.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (అక్టోబర్ 15) ఎపిసోడ్ రాజ్ ను రుద్రాణి రెచ్చగొట్టే సీన్ తో మొదలువుతంది. ఈ ఇంటి పరువు తీస్తున్న కావ్య కోసం మీరందరూ నిరాహార దీక్ష చేయడం ఏంటి? రాజ్ ను ఎందుకు బలవంతం చేస్తున్నారంటూ రుద్రాణి అంటుంది.
ఈ విషయంలో రాజ్ ను మరింత రెచ్చగొడుతుండటంతో రుద్రాణి చెంప పగలగొడుతుంది ఇందిరా దేవి. ఈ విషయంలో తప్పంతా రాజ్ దే అని, కావ్య ఏం తప్పూ చేయలేదని ఇందిర, అపర్ణ అంటారు. కావ్యను తీసుకొస్తావా లేదా అంటూ రాజ్ కు మరోసారి క్లాస్ పీకి వెళ్లిపోతారు.
మరోసారి రుద్రాణి ప్లాన్ ఫెయిల్ కావడంతో రుద్రాణిని చూసి నవ్వుతుంటాడు రాహుల్. నీ ఒక్క ప్లాన్ కూడా వర్కౌట్ కాదా మమ్మీ.. నువ్వు ఓటమికి కేరాఫ్ అడ్రెసా అని ఎగతాళి చేస్తాడు. దీంతో రుద్రాణికి కోపం వస్తుంది. రాజ్ ను మరింత రెచ్చగొట్టాలని, కావ్యను ఇంటికి దూరం చేయడానికి డోసు పెంచాలని అంటుంది. వెంటనే మహిళా సంఘాల వాళ్లకు ఫోన్ చేయమని రాహుల్ కు చెబుతుంది. వాళ్లు ఎంటరైతే సమస్య మరింత తీవ్రమవుతుందని, రాజ్ ఇరకాటంలో పడతాడని చెబుతుంది.
ఇంతలో రుద్రాణికి కావ్యే ఫోన్ చేస్తుంది. మీడియా వాళ్లకు ఇంటి సమాచారం ఇచ్చింది మీరేనా అంటూ నిలదీస్తుంది. నాకు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే అలవాటు లేదని రుద్రాణి చెప్పినా కావ్య వినదు. ఆ ఇంటికి ఏం జరిగినా కంచుకోటలా తాను కాపాడుకుంటానని కావ్య స్పష్టం చేస్తుంది. దీంతో రుద్రాణి మరింత రెచ్చిపోతుంది. ఇక లాభం లేదు వెంటనే మహిళా సంఘాలను రంగంలోకి దింపాల్సిందే అని అని రాహుల్ తో వాళ్లకు ఫోన్ చేయిస్తుంది.
అటు తన పరువు తీసిన కావ్యకు రాజ్ ఫోన్ చేసి క్లాస్ పీకుతాడు. మీడియా వాళ్లను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావని నిలదీస్తాడు. దీంతో కావ్య కూడా ఎదురుతిరుగుతుంది. బిడ్డ వద్దు అంటున్నానంటే అర్థం చేసుకోవాలని, ఇలా రచ్చ చేయడమేంటని రాజ్ అంటాడు. తనకు బిడ్డ ఎంత అవసరమో అత్తవారింటి పరువు కూడా అంతే ముఖ్యమని, తాను ఇక్కడే బిడ్డను కని కోడలిగా ఆ ఇంటికి వస్తానని కావ్య స్పష్టంగా చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఈ రాక్షసిని ఇంటికి ఎలా తీసుకురావాలో ఏంటో అంటూ రాజ్ అనుకుంటాడు.
అటు తన బిడ్డను తలచుకుంటూ ఎందుకింతలా బాధపెడుతున్నావని కావ్య అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తల్లి కనకం ఆమె దగ్గరికి వచ్చి పాలు తాగమని అంటుంది. ఆమెను ఓదారుస్తుంది. ఈ సమస్య మీడియా పుణ్యమాని సమాజం సమస్య అయిందని, తమతోపాటు అందరూ నీ వెంటనే ఉన్నామని కావ్యకు సర్దిచెబుతుంది. తన భర్తను అల్లరి చేయాలన్నది తన ఉద్దేశం కాదని, ఓ భార్యగా తన భర్త పరువు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తనపై ఉన్నదని కావ్య అంటుంది.
ఆ తర్వాత ఇటు కావ్య, అటు రాజ్ ఒకరినొకరి ఫొటోలు చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు. నేను చెప్పిన ప్రతి విషయం అర్థం చేసుకున్న నువ్వు.. బిడ్డ వద్దంటే ఎందుకు అర్థం చేసుకోవడం లేదని రాజ్ అంటాడు. మీరు చెప్పిన ప్రతిదీ విన్నాను.. ఇదొక్క విషయంలో మీరు ఎందుకు ఇంత మొండిగా ఉంటున్నారని అటు కావ్య అంటుంది. ఇద్దరూ బాధపడుతూ ఉంటారు.
రుద్రాణి ప్లాన్ సక్సెస్ అయి దుగ్గిరాల ఇంటికి మహిళా సంఘాల వాళ్లు వస్తారు. రాజ్ ఎక్కడున్నాడు పిలవండి అని అడుగుతారు. ఈ ఇంటి కోడలైన కావ్యను ఎందుకు హింసిస్తున్నాడు.. పిల్లలు వద్దని ఎందుకు అంటున్నాడు.. అని ప్రశ్నిస్తారు. దీంతో రాజ్ వచ్చి తన భార్యపై ప్రేమే కాదు అమితమైన గౌరవం కూడా ఉన్నదని, తన భార్యనే కాదు ఆఫీసులో మహిళలకు కూడా సమానమైన హక్కులు కల్పించానని అంటాడు. మరి మీ భార్య పుట్టింటికి ఎందుకు వెళ్లింది అని వాళ్లు నిలదీస్తారు.
దీంతో రుద్రాణి కావాలని సీన్లోకి వస్తుంది. చెప్పకపోతే ఏం చేస్తారు.. ఇది మా కుటుంబ విషయం.. అసలు మా మేనల్లుడు ఎవరో మీకు తెలుసా అంటూ మహిళా సంఘం వాళ్లను కావాలని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఇందిరాదేవి చెప్పినా వినదు. దీంతో వాళ్లు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎవరేంటో తెలుస్తుందని బెదిరిస్తారు. వాళ్లు ఇచ్చిన ట్విస్ట్ తో రాజ్ లో మరింత కంగారు మొదలవుతుంది.
కావ్యకు విడాకులు ఇవ్వమని రుద్రాణి అతన్ని మరింత రెచ్చగొడుతుంది. దీంతో రాజ్ మరోసారి కావ్య ఇంటికి వెళ్లి రమ్మని అడుగుతాడు. తాను రానని ఆమె తెగేసి చెబుతుంది. దీంతో నువ్వు వచ్చే వరకు ఇక్కడే నిరాహార దీక్ష చేస్తానని రాజ్ అక్కడే కూర్చుంటాడు. అక్కడితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.







