బ్రహ్మముడి ప్రోమో: రాజ్ అక్కను కలిసిన ఇందిరాదేవి- మనవరాలికి డబ్బులిచ్చిన నానమ్మ- అప్పును ఇరికించినవాడి కోసం వెతుకులాట!

బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో అప్పు అమాయకురాలు గేమ్ ఆడి రుద్రాణి, రాహుల్‌ను దుగ్గిరాల ఇంటిల్లిపాది కొడతారు. తర్వాత అప్పును ఇరికించిన శీనుగాడి అడ్రస్ తెలియడంతో వాడిని వెతకడానికి రాజ్, కావ్య వెళ్తారు. ఆ విషయాన్ని యామినికి లీక్ చేస్తుంది రుద్రాణి. దాంతో యామిని జాగ్రత్త పడుతుంది.

Published on: Jul 13, 2025 5:30 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో అప్పును ఎలా ఇరికించారో మీలో ఎవరికైనా తెలుసా అని రుద్రాణి అంటే రాజ్ మంచి ఐడియా ఇచ్చారని అంటాడు. అప్పు అమాయకురాలు అనే గేమ్ ఆడుతారు. అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందంను ఏదో ఒక కారణం చెప్పి కొట్టినట్లు ఇంటిల్లిపాది రుద్రాణి, రాహుల్‌ను కొడతారు.

బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

రేవతి అక్కను కలిసింది

దాంతో ఒల్లు హూనం అయిపోయింది, అనవసరంగా ఐడియా ఇచ్చి చచ్చాను ఇప్పుడు మన చావుకు వచ్చింది అని అక్కడి నుంచి పారిపోతారు రుద్రాణి, రాహుల్. దాంతో అంతా నవ్వుతారు. ఇంతలో కావ్య వాళ్లకు అప్పును ఇరికించిన శీను ఉండే ఏరియా పేరు రెహమత్ నగరు అని తెలుస్తుంది. అది వినగానే రేవతి అక్కను కలిసింది అదే ఏరియాలో కదా అని రాజ్ అంటాడు.

అవును రామ్ గారు అని కావ్య చెబుతుంది. ఆ శీను గాడు గురించి అక్కకు తెలిస్తే వాడిని పట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది కదా అని రాజ్ అంటాడు. దాంతో పదండి అని కావ్య, రాజ్ బయలుదేరుతారు. కానీ, ఆ మాటలను రుద్రాణి వింటుంది.శీను గాడి అడ్రెస్ దొరికిపోయింది. కాబట్టి వాన్ని పట్టుకుంటే అప్పు తప్పించుకుంటుందని రుద్రాణి అనుకుని యామినికి కాల్ చేస్తుంది.

యామినికి లీక్ చేసిన రుద్రాణి

శీను గాడు ఉండే అడ్రస్ కావ్య వాళ్లు కనిపెట్టారని, ఇప్పుడు కలవడానికి బయలుదేరారని యామినికి రుద్రాణి చెబుతుంది. శీను గాడు మాత్రం రాజ్ కావ్యలకు దొరకకూడదు. వాడు గానీ దొరికాడంటే నువ్ మాత్రం కచ్చితంగా జైలుకు వెళ్తావ్ అని హెచ్చరిస్తుంది రుద్రాణి. దాంతో తెగ టెన్షన్ పడిపోయిన యామిని శీనుగాడికి ఫోన్ కాల్ చేస్తుంది. నమస్తే మేడమ్ అని శీను మాట్లాడుతాడు.

రేపు కోర్టులో అప్పుకు శిక్ష పడేంతవరకు నువ్ మీ ఇంట్లో ఉండొద్దు. నానక్‌రామ్ గూడాలో నా మనిషి రంగా అని ఒకడుంటాడు. వాడి అడ్రస్ సెండ్ చేస్తాను. వెంటనే అక్కడికి వెళ్లి ఉండు అని యామిని చెబుతుంది. దాంతో అలాగే మేడమ్ అని శీను అంటాడు. ఇప్పుడు నీ చెల్లెలిని ఎలా కాపాడుకుంటావో చూస్తాను అని యామిని అనుకుంటుంది.

మనవరాలిని కలిసిన ఇందిరాదేవి

మరోవైపు రాజ్ అక్క, సుభాష్-అపర్ణల కూతురు రేవతి దగ్గరికి ఇందిరాదేవి వెళ్లి కలుస్తుంది. ఇందిరాదేవిని చూడగానే నానమ్మ అంటూ వెళ్లి ప్రేమగా హగ్ చేసుకుంటుంది. చూసి చాలా రోజులు అయిందని కన్నీళ్లు పెట్టుకుంటుంది రేవతి. మనవరాలి ఖర్చుల కోసం డబ్బులు తీసుకొచ్చి ఇస్తుంది ఇందిరాదేవి. ఆ డబ్బులను తీసుకోడానికి ముందు తటాపటాయించిన రేవతి తర్వాత తీసుకుంటుంది.

రేవతి, ఇందిరాదేవి మాట్లాడుకుంటుండగా ఇంతలో అప్పును ఇరికించిన శీనుగాడి కోసం వెతుక్కుంటూ రాజ్, కావ్య వస్తారు. అక్కా అంటూ డోర్ కొడతారు. రాజ్, కావ్య వచ్చారని రేవతి, ఇందిరాదేవి టెన్షన్ పడతారు. ఇప్పుడు ఇక్కడ నన్ను వాళ్లు చూస్తే రేవతి నిజం బయటపడుతుందని ఇందిరాదేవి భయపడుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.