బ్రహ్మముడి ప్రోమో: రాజ్ శత్రువుకు యామిని సలహా- బోర్డ్ మీటింగ్‌లో కావ్య పతనం- రామ్ ప్రపోజ్‌కు బ్రేకులు- అపర్ణకు కూతురు!

బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజ్ శత్రువు అయిన సిద్ధార్థ్‌కు సలహా ఇచ్చి ఐడియా చెబుతుంది యామిని. బోర్డ్ మీటింగ్ పెట్టి కావ్య పతనం అయ్యేలా ప్లాన్ చేస్తుంది యామిని. మరోవైపు దుగ్గిరాల ఇంటికి వచ్చిన రామ్ కావ్యకు లవ్ ప్రపోజ్ చేయకుండానే బ్రేకులు పడతాయి. అర్జంట్ అంటూ ఆఫీస్‌కు కావ్య వెళ్లిపోతుంది.

Published on: Jun 29, 2025 8:01 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో గతంలో రాజ్‌కు శత్రువు అయిన సిద్ధార్థ్‌ను పిలిపిస్తుంది యామిని. 40 శాతం షేర్స్ ఉన్న నువ్ రాజ్ కంపెనీని దక్కించుకునేందుకు చాలా ట్రై చేశావ్. కానీ, రాజ్ వల్ల కుదరలేదు. ఇప్పుడు ఆ ఎండీ సీటులో కావ్య ఉంది. కావ్య వల్ల కలిగే నష్టాలు, నీ వల్ల వచ్చే లాభాలు ఏంటో బోర్డ్ మీటింగ్ పెట్టి అందరికి అర్థమయ్యేలా చెప్పమని యామిని చెబుతుంది.

బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

కంపెంనీలో 40 శాతం షేర్స్

కంపెనీలో 40 శాతం షేర్స్ నీవే కాబట్టి సగానికిపైగా సభ్యులు నువ్వే బెస్ట్ అనుకుంటారు. దాంతో సీటు నీ వశం అవుతుంది. బోర్డ్ మీటింగ్‌లో కావ్య పతనం అవుతుంది అని రాజ్ శత్రువు అయిన సిద్ధార్థ్‌కు యామిని సలహా ఇస్తుంది. అలాగే, తన ప్లాన్ చెబుతుంది. దాంతో ఐడియా బాగుందని సిద్ధార్థ్ షేక్ హ్యాండ్ ఇచ్చి బోర్డ్ మీటింగ్ పెడతానని చెప్పి వెళ్లిపోతాడు.

ఇక మరుసటి రోజు ఉదయం మళ్లీ కావ్యకు తన లవ్ ప్రపోజ్ చేయడానికి దుగ్గిరాల ఇంటికి రాజ్ వస్తాడు. రాజ్ రాగానే రామ్ వచ్చావా అంటూ అంతా మర్యాదలు చేస్తారు. పక్కనే కావ్య ఉంటుంది. వెళ్లి నేరుగా కావ్యతో మాట్లాడుతాడు రామ్. కళావతి గారు మనం ప్రేమించిన మనిషి మనం పక్కన ఉంటే బాగుంటుంది అని రామ్ చెబుతాడు. ఆ మాటలను అపర్ణ విని నవ్వుతుంది.

సోదిలా రుద్రాణి, రాహుల్

పక్కనే సోఫాలో కూర్చున్న రుద్రాణి, రాహుల్ సోదిలా ఫీల్ అవుతుంటారు. అదే మనిషి మనతో జీవితాన్ని పంచుకుంటే ఇంకా బాగుంటుంది. నా జీవితంలో సంతోషం అనే పదానికి డెఫినేషన్ అని రాజ్ చెప్పబోతుంటే ఇంతలో సుభాష్ మొబైల్ రింగ్ అవుతుంది. దాంతో అంతా చిరాకుగా సుభాష్ వైపు చూస్తారు. అపర్ణ కోప్పడుతుంది. వెంటనే ఆ ఫోన్ లిఫ్ట్ చేయండి అని చెబుతుంది.

సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అటు నుంచి కంపెనీ మేనేజర్ కాల్ చేస్తాడు. సుభాష్ సడెన్‌గా వాట్ అని షాకింగ్‌గా లేస్తాడు. కంపెనీలో బోర్డ్ మీటింగ్ పెడుతున్నారని, కావ్య మేడమ్ పనుల మీద అవిశ్వాస తీర్మానంలా పెడుతున్నారని సుభాష్‌కు చెబుతాడు మేనేజర్. దాంతో కావ్య ఫోన్ తీసుకుని మేనేజర్‌తో మాట్లాడుతుంది. ఇదివరకు కంపెనీ కోసం ట్రై చేసిన సిద్ధార్థ్ గురించి మేనేజర్ చెబుతాడు.

రామ్ ప్రపోజల్‌కు బ్రేకులు

ఆ సిద్ధార్థ్ ఏదో ఇప్పుడు ప్లాన్ చేసినట్లున్నాడు మేడమ్. అందుకే బోర్డ్ మీటింగ్ పెడుతున్నాడు అని మేనేజర్ చెబుతాడు. నేను వెంటనే బయలుదేరుతాను, వస్తాను అని కావ్య చెబుతుంది. దాంతో రామ్ షాక్ అవుతాడు. రామ్కు నిజంగా అర్జంట్ వర్క్ అని చెప్పి, ఏం అనుకోవద్దని కావ్య వెళ్లిపోతుంది. అలా మరోసారి రామ్ లవ్ ప్రపోజల్‌కు బ్రేకులు పడతాయి.

ఇక మరోవైపు కావ్య, స్వప్నలను కాపాడిన రేవతి ఫొటో చూస్తూ బాధపడుతుంది. ఇంకా ఎన్నాళ్లు ఇలా బాధపడతావ్, ఇదంతా నా వల్లే జరిగిందని రేవతి భర్త అంటాడు. అయితే, రేవతి అపర్ణ ఫొటో చూస్తూ బాధపడుతుందని, అపర్ణకు రేవతి కూతురు, రాజ్‌కు అక్క అవుతుందనే నిజం, గతం బయటపడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.