బ్రహ్మముడి ప్రోమో: రిసార్టులో రాజ్‌ను లొంగదీసుకున్న యామిని- రామ్ ఫోన్ చేయడంతో కావ్య ఎంట్రీ- ప్రియురాలికి భార్య నగలు!
బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో శోభనం గదిలో అప్పు పట్టనట్లు ఉండటంతో కల్యాణ్‌కు కోపం వస్తుంది. దాంతో ఇద్దరు గొడవ పడతారు. రాజ్ చెప్పడంతో రిసార్టుకు కావ్య వస్తుంది. అక్కడ రాజ్‌ను యామిని లొంగదీసుకుంటుంది. మరోవైపు ప్రియురాలికి భార్య స్వప్న నగలను ఇస్తాడు రాహుల్. దాంతో రాహుల్ లవర్ సంతోషిస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో శోభనం గదిలోకి మళ్లీ వెళ్తారు అప్పు, కల్యాణ్. ఇద్దరు బెడ్‌పై కూర్చొంటారు. కల్యాణ్ సంతోషంగా ఉంటాడు. కానీ, అప్పుకు మెసేజ్ రావడంతో పక్కకు వెళ్లి ఫోన్ చూస్తుంటుంది. పక్కనే అప్పు స్పర్శ తగలకపోయేసరికి పక్కకు చూస్తాడు కల్యాణ్. అక్కడ అప్పు ఏం పట్టనట్లు ఉండేసరికి కల్యాణ్ షాక్ అవుతాడు.

కల్యాణ్‌కు కోపం
ఏంటీది పొట్టి అలా దూరంగా ఉండిపోయావ్. ఈ రాత్రి కోసం ఎన్నో రాత్రులు ఎదురుచూశాను తెలుసా అని కల్యాణ్ అంటాడు. కవిగారికి మంచి మూడ్ వచ్చినట్లుంది. కానీ, నాకు అంత ఓపిక లేదని అప్పు అంటుంది. ఫస్ట్ నైట్ రోజును అప్పు ఏమాత్రం పట్టించుకోకపోయేసరికి కల్యాణ్‌కు కోపం వస్తుంది. అప్పుపై సీరియస్ అవుతాడు. దాంతో అప్పు కూడా కోప్పడతుంది. ఇద్దరు వాదించుకుంటూ శోభనం రోజున గొడవ పడతారు.
రెండేళ్ల వరకు శోభనమే కాదు ముద్దు ముచ్చట కూడా లేదని అప్పు గట్టిగా చెబుతుంది. దాంతో కల్యాణ్ చాలా నిరాశపడతారు. అన్ని అవాంతరాలు దాటి శోభనానికి వచ్చిన అప్పు, కల్యాణ్ గొడవ పడటంతో ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అయిపోతుంది. మరోవైపు యామినిని రాజ్ రిసార్టుకు తీసుకెళ్తుంటాడు. అయితే, యామినితో రాజ్ రిసార్ట్‌కు వెళ్లడం గురించి కావ్యకు చెబుతారు అపర్ణ, ఇందిరాదేవి.
యామిని ఏదో ప్లాన్ చేసింది
ఈ ముదనష్టపుది ఏదో ప్లానే చేసింది, అందుకే రిసార్టుకు రాజ్‌ను తీసుకెళ్తుంది అని ఇందిరాదేవి అంటుంది. అక్కడ జరగరానిది జరిగిదే రాజ్ మనకు కాకుండా పోతాడు. ఏదో ఒకటి చేయి కావ్య అని అపర్ణ అంటుంది. మీరేం కంగారుపడకండి అత్తయ్య నేను చూసుకుంటాను అని కావ్య అంటుంది. రాజ్‌కు కాల్ చేసి మాట్లాడుతుంది కావ్య. దాంతో యామినితో రిసార్టుకు వెళ్తున్న విషయం కావ్యకు చెబుతాడు రాజ్.
అంటే, కాబోయే భార్యను షికారుకు తీసుకెళ్తున్నారన్నమాట, ఇన్నాళ్లు నాతో అన్న మాటలు అన్ని అబద్ధాలేనా అని కావ్య అంటుంది. కాదు, మీతో చెప్పినవన్నీ నిజాలే. మీరు కూడా రిసార్టుకు రండి. అక్కడ నా మనసులో మాట చెబుతాను అని రాజ్ అంటాడు. దాంతో కావ్య సరే అని చెబుతుంది. తర్వాత రిసార్టుకు కారులో యామిని, రాజ్ వెళ్తారు.
పూర్తిగా నా సొంతం చేసుకుంటా
కళావతి గారు రిసార్టుకు రాగానే నా గుండెల్లో ఉన్నది నువ్వే అని చెప్పి, నా మనసులోని ప్రేమను కళావతి గారికి ఎక్స్‌ప్రెస్ చేసి తన ప్రేమను గెలుచుకుంటాను అని మనసులో అనుకుంటాడు రాజ్. లేదు బావ.. నిన్ను ఆ కావ్యకు ఎట్టి పరిస్థితుల్లో దగ్గర కానివ్వను. ఏది ఏమైనా సరే నిన్ను ఈరోజు పూర్తిగా నా సొంతం చేసుకుని ఆ కావ్యను నీ జీవితంలోనే లేకుండా, మళ్లీ నీ లైఫ్‌లోకి రాకుండా చేస్తాను అని రాజ్ మాటలు విన్నట్లుగా అనుకుంటుంది యామిని.
రాజ్, యామిని రిసార్టుకు వెళ్తారు. అంతా నేను ప్లాన్ చేసినట్లుగానే జరుగుతుందిగా అని తన మనుషులను అడుగుతుంది యామిని. వాళ్లు అంతా ఓకే అంటారు. మరోవైపు రిసార్టుకు కావ్య వస్తుంది. ఇక రాజ్, యామిని ఒక గది తీసుకుని అందులోకి వెళ్తారు. బెడ్‌పై ఇద్దరు కూర్చొంటారు. రాజ్ ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు. మెల్లిగా రాజ్ వైపుకు యామిని వస్తుంది.
ప్రియురాలికి నగలు
రాజ్భుజంపై చేయి వేసి రాజ్‌ను లొంగదీసుకుంటుంది. రాజ్‌కు ముద్దు పెట్టేందుకు ట్రై చేస్తుంటుంది యామిని. మరోవైపు రిసార్ట్ లోపలికి కావ్యకంగారుగా వచ్చేస్తుంది. మరోవైపు భార్య స్వప్న ఏడు వారాల నగలు కొట్టేసిన రాహుల్ వెళ్లి తన ప్రియురాలికి ఇస్తాడు. అవి చూసిన రాహుల్ గర్ల్‌ఫ్రెండ్ తెగ సంతోషిస్తుంది. అనుకున్నది సాధించావ్‌గా. ఇక నేను నీ సొంతం అని రాహుల్‌తో అంటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper













