Bro Song Lyrics: బ్రో మూవీ సాంగ్ లిరిక్స్ ఇవే.. పాడటానికి ట్రై చేస్తారా?
Bro Song Lyrics: బ్రో మూవీ సాంగ్ లిరిక్స్ ఇవే.. పాడటానికి ట్రై చేస్తారా? ఈ మధ్యే వచ్చిన బ్లో శ్లోకం బాగా హిట్ అయిన విషయం తెలిసిందే. ఇందులోని లిరిక్స్ తోపాటు మ్యూజిక్ కూడా అభిమానులను ఆకట్టుకుంది.
Bro Song Lyrics: పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళంలో వచ్చిన వినోదాయ సిద్ధం మూవీకి రీమేక్ అయిన ఈ సినిమాను చాలా వేగంగా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. జులై 28న బ్రో మూవీ రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మధ్యే ఈ మూవీ నుంచి బ్రో శ్లోకంపేరుతో ఓ సాంగ్ రిలీజైన సంగతి తెలుసు కదా.

పవన్ కల్యాణ్ లుక్ రివీల్ చేస్తూ మేకర్స్ ఈ శ్లోకాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తమన్ ఈ పాటకు మ్యూజిక్ అందించాడు. లిరిక్స్ కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. అందుకు తగినట్లే మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ ఇన్‌స్టాంట్ హిట్ గా మారింది. అయితే ఇందులోని లిరిక్స్ కాస్త కష్టంగా ఉన్నాయి. అందుకే మీకోసం ఆ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం. దానిని చూసి మీరూ పాడటానికి ట్రై చేయండి.
బ్రో శ్లోకం లిరిక్స్
కాలం త్రిగుణ సంశ్లేషం
కాలం గమన సంకాశం
కాలం వజ్రయేత్ చారణం
కాలం జన్మనా జాయతే జయం
స్వయం శ్రియం ద్వయం
బ్రో.. బ్రోదిన జన్మ లేషం
బ్రో.. బ్రోవగ ధర్మ శేషం
బ్రో.. బ్రోచిన కర్మ హాసం
బ్రో.. బ్రోదర చిద్విలాసం
బ్రో బ్రో బ్రో బ్రో బ్రో బ్రో బ్రో బ్రో
బ్రో.. బ్రోదిన జన్మ లేషం
బ్రోవగ ధర్మ శేషం
బ్రో.. బ్రోచిన కర్మ హాసం
బ్రోదర చిద్విలాసం
బ్రో

E-Paper



